'టైగర్ నాగేశ్వర రావు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల : 'Tiger Nageswara Rao' first look poster released

మాస్ మహారాజ రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageshwararao) చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది.

'టైగర్ నాగేశ్వర రావు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల : 'Tiger Nageswara Rao' first look poster released

'టైగర్ నాగేశ్వర రావు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల : 'Tiger Nageswara Rao' first look poster released 

మాస్ మహారాజ రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageshwararao) చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది.  తెలుగు చిత్ర పరిశ్రమలో అతి వేగంగా సినిమాలు తీసే హీరోల్లో రవితేజ (Hero Ravi Teja) ముందుంటారు. ఆయన తన కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. గత ఏడాది చివర్లో వచ్చిన 'ధమాకా' సంచలన విజయంతో 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సంవత్సరం ఆరంభంలో సైతం చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య', రవితేజ హీరోగా వచ్చిన 'రావణాసుర' ఆయన నటనలో మరో కోణాన్ని చూపించాయి. ఈ ఏడాదిలోనే విడుదల కానున్న 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రం ఆయన కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్రంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై (Abhishek Aggarwal Arts banner) అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం (Director Vamshi) వహించారు. నుపూర్ సనన్ (Nupur Sanon) హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ (First Look Poster), కాన్సెప్ట్ వీడియో (Concept Video) అభిమానులను ఎంతగానో అలరిస్తోంది.

రాజమండ్రిలోని గోదావరిపై ఉన్న ఐకానిక్ హేవ్‌లాక్ బ్రిడ్జ్ పైన ఈరోజు మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియోను లాంచ్ చేశారు. ‘ఇన్‌స్పైర్డ్ బై ట్రూ రూమర్స్’ అంటూ హీరో విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్‌తో కాన్సెప్ట్ వీడియో మొదలైంది. ‘అది 70 దశకం. బంగాళాఖాతం తీర ప్రాంతంలోని ఒక చిన్న గ్రామం. ప్రపంచాన్ని భయపెట్టే చీకటి కూడా అక్కడి జనాలను చూసి భయపడుతుంది. దడ దడమంటూ వెళ్లే రైలు ఆ ప్రాంతం పొలిమేర రాగానే గజ గజమంటూ వణుకుతుంది. ఆ ఊరు మైలురాయి కనబడితే జనం అడుగులు తడబడతాయి. దక్షిణ భారతదేశపు నేర రాజధాని. స్టువర్ట్‌పురం.. టైగర్ జోన్.. ది జోన్ ఆఫ్ టైగర్ నాగేశ్వర రావు’ అంటూ స్టువర్ట్‌పురం ఊరిని పరిచయం చేశారు మేకర్స్.

ఇక వీడియో చివరన ‘జింకలను వేటాడే పులిని చూసుంటావు. పులుల్ని వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా?’ అంటూ రవితేజ చెప్పే డైలాగ్ ఈ వీడియోకి హైలైట్‌గా నిలిచింది. ఇక రవితేజ గడ్డంతో రఫ్ లుక్‌లో నిజంగా టైగర్‌ను తలపించాడు. టైగర్ నాగేశ్వరరావు ప్రపంచాన్ని పరిచయం చేసే కాన్సెప్ట్ వీడియోకు ఐదు భాషల్లో ఐదుగురు సూపర్ స్టార్స్ వాయిస్‌ ఓవర్ ఇచ్చారు. తెలుగు వెర్షన్‌కు వెంకటేష్, వరుసగా హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో జాన్ అబ్రహం, శివ రాజ్‌కుమార్, కార్తీ, దుల్కర్ సల్మాన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

ఆర్ మదీ విజువల్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, జీవీ ప్రకాష్ కుమార్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్... కరడుగట్టిన నేరస్తుల ప్రపంచానికి ప్రేక్షకులను తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాయి. ఈ ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియో సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 20న (release on 2023 October 20) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.