పంచాయత్ సీజన్ 3 మూవీ రివ్యూ : Panchayat Season 3 Movie Review

సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యేతో ఫులేరా వాసి భూషణ్ (దుర్గేశ్ కుమార్) చేతులు కలిపి మంజు దేవి, బ్రిజ్ భూషణ్‍కు వ్యతిరేకంగా గ్రూప్ కట్టి పని చేస్తాడు. దీంతో పాలిటిక్స్ ఊపందుకుంటాయి.

పంచాయత్ సీజన్ 3 మూవీ రివ్యూ : Panchayat Season 3 Movie Review

పంచాయత్ సీజన్ 3 మూవీ రివ్యూ : Panchayat Season 3 Movie Review

ఓ వృద్ధురాలికి ప్రధాన మంత్రి గరీబ్ ఆవాస్ యోజన కింద ఇంటిని అభిషేక్ మంజూర చేయటంతో ఫులేరాలో రాజకీయాలు మొదలవుతాయి. కొన్ని పరిణామాలతో మరింత ఎక్కువవుతాయి. సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యేతో ఫులేరా వాసి భూషణ్ (దుర్గేశ్ కుమార్) చేతులు కలిపి మంజు దేవి, బ్రిజ్ భూషణ్‍కు వ్యతిరేకంగా గ్రూప్ కట్టి పని చేస్తాడు. దీంతో పాలిటిక్స్ ఊపందుకుంటాయి. ఆ తర్వాత ఫులేరా గ్రామంలో రాజకీయాలు ఎలా సాగాయి, ఏ పరిణామాలు జరిగాయన్నది ఈ మూడో సీజన్‍లో ఉంటుంది. 

ప్రధాన నటీనటులు: జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘువీర్ యాదవ్, ఫైజల్ మాలిక్, చందన్ రాయ్, దుర్గేశ్ కుమార్, పంకజ్ జా, సునీత రాజ్వర్. రచయిత: చందన్ కుమార్, నిర్మాణ సంస్థ: ది వైరల్ ఫీవర్. దర్శకుడు: దీపక్ కుమార్ మిశ్రా. పంచాయత్ వెబ్ సిరీస్ రెండు సీజన్లు చాలా సక్సెస్ అయ్యాయి. రెండేళ్లుగా ఎదురుచూస్తున్న మూడో సీజన్ నేడు (మే 28) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఫులేరా గ్రామంలో జరిగే పరిణామాలతో ఈ సిరీస్ తెరకెక్కింది. మరి, రెండు సీజన్ల మ్యాజిక్‍ను ఈ మూడో సీజన్ రిపీట్ చేసిందా.. ఆకట్టుకుందా అనేది ఈ రివ్యూలో తెలుసుకోండి.

పంచాయత్ 3 కథ : Panchayat 3 story 

ప్రహ్లాద్ (ఫైజల్ మాలిక్) కుమారుడు మరణించడం, ప్రధాన పాత్ర అయిన పంచాయతీ సెక్రటరీ (సచివ్) అభిషేక్ త్రిపాఠి (జితేంద్ర కుమార్).. ఫులేరా నుంచి బదిలీ అవటంతో పంచాయత్ రెండో సీజన్ ముగిసింది. ఫులేరా కొత్త సెక్రటరీగా చేరేందుకు కొత్త వ్యక్తి రావడంతో ఇప్పటి మూడో సీజన్ మొదలవుతుంది. అయితే, సర్పంచ్ మంజు దేవి (నీనా గుప్త), ఆమె భర్త బ్రిజ్ భూషణ్ దూబే (రఘువీర్ యాదవ్), ప్రహ్లాద్ సహా గ్రామస్తులు కొందరు కొత్త సెక్రటరీని అడ్డుకుంటారు. మళ్లీ ఫులేరాకు అభిషేక్ త్రిపాఠిని సెక్రటరీగా తిరిగి తెచ్చుకుంటారు. దీంతో ఎమ్మెల్యే చంద్రకిశోర్ సింగ్ (ప్రకాశ్ జా)తో దూబే సహా ఫులేరా ప్రజలకు ఉన్న విభేదాలు మరింత పెరుగుతాయి. ఓ కేసులో ఎమ్మెల్యే జైలుకు వెళతాడు. అభిషేక్ మళ్లీ ఫులేరాలో సెక్రటరీగా విధులు కొనసాగిస్తాడు. రింకీ (సాన్వికా)తో ప్రేమ కంటిన్యూ అవుతుంది. ఎంబీఏ కోసం కూడా ప్రివేర్ అవుతుంటాడు. అయితే, ఓ వృద్ధురాలికి ప్రధాన మంత్రి గరీబ్ ఆవాస్ యోజన కింద ఇంటిని అభిషేక్ మంజూరు చేయటంతో ఫులేరాలో రాజకీయాలు మొదలవుతాయి. కొన్ని పరిణామాలతో మరింత ఎక్కువవుతాయి. సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యేతో ఫులేరా వాసి భూషణ్ (దుర్గేశ్ కుమార్) చేతులు కలిపి మంజు దేవి, బ్రిజ్ భూషణ్‍కు వ్యతిరేకంగా గ్రూప్ కట్టి పని చేస్తాడు. దీంతో పాలిటిక్స్ ఊపందుకుంటాయి. ఆ తర్వాత ఫులేరా గ్రామంలో రాజకీయాలు ఎలా సాగాయి, ఏ పరిణామాలు జరిగాయన్నది ఈ మూడో సీజన్‍లో ఉంటుంది. 

పంచాయత్  సీజన్ 3 : Panchayat Season 3 .

పాలిటిక్స్, ఎమోషన్స్

గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు ఎలా ఉంటాయో, స్థానిక అధికారుల పనివిధానం ఎలా సాగుతుందో పంచాయత్ మూడో సీజన్‍లో మెరుగ్గా చూపించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. రచయిత చందన్ కుమార్, దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా ఈ సీజన్‍లో రాజకీయాలతో పాటు ఎమోషన్లను కూడా మెరుగ్గా చూపించగలిగారు. ఈ సీజన్ చాలా చోట్ల భావోద్వేగానికి గురి చేస్తుంది.. థ్రిల్ చేస్తుంది.. అక్కడక్కడా నవ్విస్తుంది. కొన్ని సీన్లు మనసుకు హత్తుకుంటాయి.

ఫులేరాకు వచ్చిన కొత్త సెక్రటరీని అందరూ కలిసి వెనక్కి పంపడం తొలి ఎపిసోడ్లో ఆకట్టుకుంది. అభిషేక్ మళ్లీ గ్రామానికి సెక్రటరీగా తిరిగిరావడం అంతా చకచకా జరిగిపోతాయి. అయితే, ప్రధాన మంత్రి గరీబ్ ఆవాస్ యోజన కింద ఇల్లు పొందేందుకు ఓ వృద్ధురాలు చేసే ప్రయత్నాలు నవ్విస్తాయి, ఆకట్టుకుంటాయి. ఈ తతంగం కూడా ఎమోషనల్‍గానే ముగుస్తుంది. ఆ తర్వాత ఎమ్మెల్యేతో చేతులు కలిపే భూషణ్… సర్పంచ్‍ను ఇబ్బందుల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. తూర్పు, పడమర అంటూ గ్రామంలో చీలిక తెచ్చేందుకు భూషణ్ చేసే ఆలోచనలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తాయి. గ్రామంపై తమ పట్టును నిలుపుకునేందుకు సర్పంచ్ భర్త బ్రిజ్ భూషణ్ ప్రయత్నాలు చేస్తారు. మొత్తంగా ఈ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతాయి. ఎమ్మెల్యే చేతిలో పావురం చనిపోయే తంతు కూడా కూడా సస్పెన్స్‌గా ఉంటుంది. చివర్లో ఎమ్యెల్యే, గ్రామస్తుల మధ్య ఘర్షణ కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. పంచాయతీ సెక్రటరీ అభిషేక్ త్రిపాఠిది ప్రధాన పాత్రే అయినా.. ఈ మూడో సీజన్‍లో చాలా క్యారెక్టర్లకు ప్రాధాన్యం ఉంటుంది. కథను ఆ పాత్రలు ఎక్కువగా ముందుకు నడిపిస్తాయి. ఈ విషయంలో ఈ సీజన్ విభిన్నంగా ఉంటుంది. భూషణ్ పాత్ర కూడా మెయిన్‍గా సాగుతుంది.

తగ్గిన కామెడీ, పెరిగిన ఎమోషన్లు

గత రెండు సీజన్లతో పోలిస్తే పంచాయత్ మూడో సీజన్లో కాస్త కామెడీ తగ్గింది. ఎక్కువగా రాజకీయాల చుట్టూ సాగుతుంది. దీంతో ఎక్కువ భాగం సీరియస్‍గా ఉంటుంది. అక్కడక్కడా కామెడీ ఉన్నా.. లాస్ట్ రెండు సీజన్ల కంటే తక్కువే. అయితే, మూడో సీజన్లో ఎమోషన్లపై రైటర్, డైరెక్టర్ ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది. సైనికుడైన కుమారుడిని కోల్పోయిన ప్రహ్లాద్ పాత్ర కూడా భావోద్వేగంగా సాగుతుంది. వృద్ధురాలితో అతడు మాట్లాడే మాటలు కన్నీళ్లు పెట్టిస్తాయి.

అక్కడక్కడా సాగదీతగా..

ఈ సీజన్ అక్కడక్కడా సాగదీతగా అనిపిస్తుంది. డైలాగ్‍ల్లో పంచ్‍లు కూడా ఎక్కువగా కనిపించలేదు. కొన్ని సీన్లను ఎడిట్ చేసి నిడివి తగ్గించి ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ కలుగుతుంది. నాలుగో సీజన్‍కు సిద్ధం. పంచాయత్ నాలుగో సీజన్‍లో పంచాయతీ ఎన్నికలే ప్రధానంగా ఉంటాయని ఈ మూడో సీజన్ చివర్లో మేకర్స్ స్పష్టంగా చెప్పేశారు. ఎమ్మెల్యేతో ఫులేరా గ్రామస్తుల గొడవ పెరగటంతో ఇక తదుపరి సీజన్ పూర్తిగా రాజకీయం చుట్టూ ఉండేలా కనిపిస్తోంది. అందుకే నాలుగో సీజన్‍కు కూడా మంచి హైప్ ఉంటుంది.

 ఎవరెలా చేశారంటే... Talent of actors  

ఫులేరా సెక్రటరీ అభిషేక్ త్రిపాఠిగా జితేంద్ర కుమార్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. మంజూ దేవిగా నైనా గుప్తా, బ్రిజ్ భూషణ్ పాత్రలో రఘువీర్ యాదవ్ కూడా అలవోకగా నటించేశారు. సాన్వికా అందంగా, అమాయాకంగా మెప్పించారు. భూషణ్‍గా దుర్గేశ్ కుమార్ సహా సునీతా రజ్వార్, పంకజ్ జా, అశోక్ పాఠక్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మూడో సీజన్‍ను ఇంట్రెస్టింగ్‍గా తెరకెక్కిండటంతో రచయిత చందన్ కుమార్, దర్శకుడు దీపక్ కుమార్ సక్సెస్ అయ్యారు. స్క్రీన్‍ప్లే, ఎడిటింగ్ మరింత మెరుగ్గా ఉండిఉంటే ఈ సీజన్ మరో లెవెల్‍కు వెళ్లేది. అనురాగ్ సైకియా అందించిన మ్యూజిక్ కూడా స్టోరీ ఫీల్‍కు తగ్గట్టు సాగింది. ఎమోషనల్ సీన్లలో బీజీఎం ఆకట్టుకుంటుంది.

మొత్తంగా..

పంచాయత్ సీజన్ 3 అక్కడక్కడా స్లోగా అనిపించినా.. ఓవరాల్‍గా ఆకట్టుకుంటుంది. ఇంట్రెస్టింగ్‍గానే సాగుతుంది. కామెడీ, ఎంటర్‌టైన్‍మెంట్ తగ్గినా.. ఎమోషన్లు మెప్పిస్తాయి. పాలిటిక్స్ ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఈ మూడో సీజన్ కూడా తప్పకుండా చూడొచ్చు. హిందీ ఆడియోలోనే ఈ సిరీస్ ఉంది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయవచ్చు.