మార్కెట్లోకి రియల్ మీ కొత్త ఫోన్లు : Realme's new phones in the market

భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల వాడకం ఎంతో వేగంగా విస్తరిస్తోంది. ఈరోజు ఏ ఒక్కరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ తప్పకుండా కనిపిస్తుంది.

మార్కెట్లోకి రియల్ మీ కొత్త ఫోన్లు : Realme's new phones in the market

భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల వాడకం ఎంతో వేగంగా విస్తరిస్తోంది. ఈరోజు ఏ ఒక్కరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ తప్పకుండా కనిపిస్తుంది. దీంతో స్మార్ట్ ఫోన్లను తయారు చేసే ఆయా కంపెనీలు వినియోగదారులను మరింత ఎక్కువగా ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు విభిన్నమైన స్మార్ట్ ఫోన్స్ మోడళ్లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. సరికొత్త ఫీచర్లు, విభిన్న ఆఫర్లతో భారీ డిస్కౌంట్లను అందిస్తూ మార్కెట్లో తమ వాటాను పెంచుకుంటున్నారు. ఇందులో భాగంగా చైనాకి చెందిన ప్రసిద్ధ మొబైల్ కంపెనీ రియల్ మీ తాజాగా పలు రకాల మోడళ్లను మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లు, ఆఫర్లతో విడుదల చేసింది. ఈ మోడళ్ళు అమెజాన్ ఇండియా (Amazon India), రియల్ మీ ఇండియా (Realme India) వెబ్‌సైట్లలో ఈ నెల 26 వ తేదీ వరకు భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉండనున్నాయి. కంపెనీ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా మొబైళ్లను కొనుగోలు చేస్తే అదనంగా రూ.1000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్లు రియల్‌ మీ నార్జో ఎన్55, నార్జో 60 (Realme Narzo N55, Narzo 60) సిరీస్‌లపై లభిస్తాయి.

రియల్‌ మీ నార్జో ఎన్55 : Realme Narzo N55 

రియల్‌ మీ నార్జో ఎన్55 4GB+64GB స్టోరేజీతో అందుబాటులోకి వచ్చింది ఈ మోడల్ ఫోన్ ధర మార్కెట్లో రూ.10,999 గా ఉంది. ఈ మోడల్ ఫోన్ పై రూ.500 లు డిస్కౌంట్ ను కంపెనీ ప్రకటించింది. రియల్‌ మీ నార్జో ఎన్55 6GB+128GB స్టోరేజీతో కూడిన స్మార్ట్ ఫోన్ ధర రూ.12,999 గా ఉంది. దీనిపై రూ.వెయ్యి వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ డిస్కౌంట్ ధరతో రూ.11,999 కే లభించనుంది.

రియల్‌ మీ నార్జో 60 5G : Realme Narzo 60 5G

సరికొత్త నార్జో సిరీస్ ఫోన్లలో భాగంగా రియల్‌ మీ నార్జో 60 5G (Realme Narzo 60 5G) ఫోన్ 8GB+128GB స్టోరేజీ మోడల్ ధరను రూ.17,999 గా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై ఈ నెల 26 వ తేదీ వరకూ రూ.1000 డిస్కౌంట్ ను అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్ రూ.16,999 కే వినియోగదారులకు లభించనుంది. రియల్‌ మీ నార్జో 60 5G (Realme Narzo 60 5G) 8GB+256GB స్టోరేజీ కలిగిన స్మార్ట్ ఫోన్ మోడల్ ధర రూ.19,999 కాగా దీనిపై కంపెనీ రూ.1000 వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇది మార్కెట్లో రూ.18,999 కే వినియోగదారులకు లభించనుంది.

నార్జో 60 ప్రో 5G హై-ఎండ్ వేరియంట్ : Narzo 60 Pro 5G is the high-end variant 

రియల్‌మీ నార్జో 60 ప్రో 5G (Realme Narzo 60 Pro 5G) 12GB RAM+1TB స్టోరేజీ కలిగిన స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రూ.29,999 గా కంపెనీ ప్రకటించింది. అయితే ఈ ఫోన్ పై మరో ఐదు రోజులు అంటే ఈ నెల 26 వ తేదీ వరకు రూ.1000 డిస్కౌంట్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ రూ.28,999 కే లభించనుంది. రియల్‌మీ నార్జో 60 ప్రో 5G (Realme Narzo 60 Pro 5G) స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మూడు మోడళ్లపైనా ఆరు నెలల కాలానికి నో కాస్ట్ ఈఎంఐ (No cost EMI) కూడా అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

తక్కువ బడ్జెట్లో రియల్ మీ C53 : Realme C53 in low budget 

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉండే స్మార్ట్ ఫోన్ల కోసం ఎదురు చూస్తున్న వినియోగదారులకు రియల్ మీ మొబైల్ కంపెనీ శుభవార్తను చెప్పింది. రియల్ మీ C సిరీస్ (Realme C series) లో 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమేరాతో రియల్ మీ C53 స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు   కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.10,000 వేల లోపే ఉండడం గమనార్హం. రెండు స్టోరేజి వేరియంట్లలో రెండు రంగులతో ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ మలేషియాలో విడుదల అయింది. రియల్ మీ C53 స్మార్ట్ ఫోన్లో 6GB RAM, 90Hz డిస్‌ప్లే, 5,000mAh సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉండడం విశేషం. ఈ ఫోన్లో ఉన్న గొప్ప విశేషమేమిటంటే 108MP కెమెరా. ఇంత తక్కువ ధరలో మరి ఏ ఇతర ఫోన్లలో కూడా ఈ ఫీచర్ కనిపించాడంటే అతిశయోక్తి కాదు. 

రియల్ మీ C53 4GB+128GB స్టోరేజీతో కూడిన స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,999 గా కంపెనీ ప్రకటించింది. ఈ మోడల్ స్మార్ట్ ఫోన్ విక్రయాలు ఈ నెల 26 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు భారత్ లో రిటైల్ స్టోర్లలో ప్రారంభం కానుంది. ఈ మోడల్ పై రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ఛాంపియన్ గోల్డ్ (Champion Gold), ఛాంపియన్ బ్లాక్ (Champion Black) అనే రెండు కలర్స్ లో లభించనున్నట్లు కంపెనీ పేర్కొంది.