తెలంగాణ పీఠం కోసం బీజేపీ పావులు : BJP steps up for Telangana

తెలంగాణాలో పాగా వేయడానికి బీజేపీ (BJP) కొత్తకొత్త వ్యూహాలతో ముందుకెళుతోంది. ఇందులో భాగంగా అధికార బీఆర్ఎస్ పార్టీని ప్రతీ విషయంలోనూ టార్గెట్ చేస్తూ వెళుతోంది. ‘BJP Mission 90’ in Telangana

తెలంగాణ పీఠం కోసం బీజేపీ పావులు : BJP steps up for Telangana

బీజేపీకి కర్ణాటక ఎన్నికలు షాక్ కి గురి చేసాయి. గెలుపుపై ధీమాగా ఉన్న బీజేపీ కర్ణాటకను అనూహ్య రీతిలో కోల్పోయిన భారతీయ జనతా పార్టీ (BJP) తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయాలనే కృతనిశ్చయంతో ఉంది. వచ్చే ఏడాది (next year) తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగబోతున్నాయి. దీంతో ఇప్పటి నుంచే ప్రత్యేక ఆపరేషన్ తో బీజేపీ ముందుకెళ్తోంది. అయితే బీజేపీ తాజాగా 'మిషన్ 90' (Mission 90) ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ టార్గెట్ తోనే వచ్చే ఎన్నికల్లో విజయం కోసం సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

గతంతో పోల్చుకుంటే బీజేపీ తెలంగాణాలో మెరుగైన స్థితిలోనే (BJP in better condition) ఉంది. రోజురోజుకీ పుంజుకుంటోంది. అందుకే కేంద్ర అధిష్టానం ఈసారి జరగబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడించాలని నిర్ణయించుకుంది. బీజేపీ రాష్ట్ర నేతలు సైతం ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణపై ఇప్పటినుంచే దృష్టి పెట్టామని... రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నామనే బలమైన సంకేతాలు ఇక్కడి నేతలకు ఇచ్చేలా కేంద్ర నాయకత్వం (Central leadership) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Home Minister Amit Shah) ఈ నెల 15న (June 15th) ఖమ్మం రానున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read - Leaders who have a following among Telangana youth

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది తెలంగాణ. ఇప్పటికే ప్రధాన పార్టీలు అన్నీ నువ్వా -నేనా అన్నట్లు ముందుకెళ్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) గెలిచింది. ఇప్పుడు మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) ఇప్పటికే రెండుసార్లు ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. ఈసారి జరిగే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తోంది. కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో అక్కడ అమలు పరచిన వ్యూహాలను ఇక్కడ అమలు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ఇక బీజేపీ సైతం ఈసారి తెలంగాణాలో ఎలాగైనా పాగా వేసి దక్షిణాది రాష్ట్రాల్లో మరో రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోంది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో (GHMC elections) బీజేపీ (BJP) సత్తా చాటింది. ఆ ఉత్సాహంతో రాబోయే అసెంబ్లీయే ఎన్నికల్లో తెలంగాణను కైవసం చేసుకోవాలని చూస్తోంది. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక సీటుతోనే సరిపెట్టుకున్న బీజేపీ 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నడూ లేనివిధంగా 4 స్థానాలను (4 MP seats) కైవసం చేసుకుని బీజేపీ (BJP) చరిత్ర సృష్టించింది.

తెలంగాణాలో ‘బీజేపీ మిషన్ 90’ : ‘BJP Mission 90’ in Telangana

తెలంగాణాలో పాగా వేయడానికి బీజేపీ (BJP) కొత్తకొత్త వ్యూహాలతో ముందుకెళుతోంది. ఇందులో భాగంగా అధికార బీఆర్ఎస్ పార్టీని ప్రతీ విషయంలోనూ టార్గెట్ చేస్తూ వెళుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ఇందుకోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. అదే మిషన్ 90 తెలంగాణ 2023 (Mission 90 Telangana 2023). రాష్ట్రంలో మొత్తం 120 అసెంబ్లీ (Assembly) స్థానాలు ఉన్నాయి. ఇందులో 90 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళుతోంది. పార్టీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేసే అంశాలపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం బీజేపీ అధిష్టానం (BJP High command) దృష్టి పెడుతోంది. ఎన్నికలకు మరి కొద్దీ నెలలు ఉండడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీనికోసం నాయకులూ, కార్యకర్తలు అందరూ కలిసి పనిచేయాలని ఇటీవల శామీర్ పేట్ లోని ఓ రిస్టార్ లో ఆ పార్టీ విస్తారక్, పాలక్, ప్రభారీల సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ (BL Santosh) హాజరయ్యారు. ఈ సారి జరిగే ఎన్నికలు ఖచ్చితంగా హోరాహోరీగా సాగే అవకాశం అయితే ఉంది. బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP), టీ కాంగ్రెస్ (T Congress), టీడీపీ (TDP), కమ్యూనిస్ట్ పార్టీలు (Communist parties) అన్నీ కూడా తమతమ ప్రణాళికలతో సమాయత్తమవుతున్నాయి.

టీబీజేపీలో చోటుచేసుకోనున్న మార్పులు! : Changes will take place in TBJP!

తెలంగాణ బీజేపీ కమిటీలో మార్పులు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (MP Bandi Sanjay) కి కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈటల రాజేందర్ కు ఇప్పటికే బీజేపీ ఎన్నికల ప్రచార సారథిగా (Etela Rajender is the chief of BJP's election campaign) బాధ్యతలు అప్పజెప్పారు. ఆయన ఇప్పటికే రంగంలోకి కూడా దిగి పనికూడా మొదలుపెట్టారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) కు టీబీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు అర్ధమవుతోంది.

Read More About Telangana Politics News