కేరళ హైకోర్టులో 'నగ్నత్వం' కేసులో విజయం సాధించిన రెహానా ఫాతిమా

33 ఏళ్ళ మహిళా హక్కుల కార్యకర్త (Women's rights activist) రెహానా ఫాతిమా వివాదాలకు కొత్తేమీ కాదు. తన ఇద్దరు మైనర్ పిల్లలు ఒక అబ్బాయి. Justice Kauser Edappagat

కేరళ హైకోర్టులో 'నగ్నత్వం' కేసులో విజయం సాధించిన రెహానా ఫాతిమా
Rehana Fathima from Kerala

మహిళలు తమ శరీరాలు, జీవితాలపై స్వతంత్ర నిర్ణయాలు (independent decisions) తీసుకుంటే లైంగిక వేధింపులు, వివక్షతో పాటుగా ఒంటరితనానికి గురి కావాల్సి వస్తోందని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. మహిళలకు తమ శరీరాలపై స్వయం నిర్ణాయక హక్కు తరచూ నిరాకరణకు గురవుతోందని వ్యాఖ్యానించింది. జువెనైల్‌ జస్టిస్‌, పోక్సో, ఐటీ చట్టాల కింద మహిళా హక్కుల కార్యకర్త (Women's rights activist) రెహానా ఫాతిమాపై పోలీసులు నమోదు చేసిన కేసును కేరళ హైకోర్టు కొట్టివేసింది ఈ సందర్భంగా హైకోర్టు పైవిధంగా తమ అభిప్రాయాన్ని వ్యాక్యం చేసింది. రెహానా ఫాతిమా (Rehana Fathima) తన మైనర్ పిల్లలతో కలిసి అర్ధ నగ్న భంగిమలో తన శరీరంపై పెయింట్ వేయించుకున్నారు.

అనంతరం రెహానా సోషల్ మీడియాలో (Social Media) ‘శరీరం-రాజకీయాలు’ అనే శీర్షికతో వీడియోను పోస్ట్ చేశారు. దీంతో రెహానాపై పోక్సో, జువెనైల్‌ జస్టిస్‌, ఐటీ చట్టంలోని నిబంధనల కింద కేరళలో పలు కేసులు నమోదయ్యాయి. దీనిపై రెహానా (Rehana) కేరళలోని దిగువ కోర్టును ఆశ్రయించింది. అయితే దిగువ కోర్టు రెహానా అభ్యర్థనను తిరస్కరించింది. దిగువ కోర్టు తిరస్కరణపై ఆమె కేరళ హైకోర్టులో సవాలు చేసింది. అక్కడ ఆమెకు ఊరట లభించింది. హైకోర్టు న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్ (High Court Judge Kauser Edappagat) ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం (Tribunal) మహిళల శరీర ఎగువ భాగాల అర్ధ నగ్నత్వం (nudity) విషయంలో పురుషులు, మహిళలను వేర్వేరు దృష్టి కోణాల్లో చూస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయమూర్తి మాట్లాడుతూ శరీరం ఎగువ భాగాలపై వివక్షను ప్రశ్నిస్తూ సందేశం ఇచ్చేనందుకే ఈ బాడీ పెయింట్‌ కళను వినియోగించినట్లు తెలిపారు.

నగ్నత్వాన్ని కామోద్రేక దృష్టితో ముడిపెట్టడం తగదు : Justice Kauser Edappagat

నగ్నత్వాన్ని (nudity) కామోద్రేక దృష్టితో ముడిపెట్టడం తగదు. అశ్లీలత (obscenity), అసభ్యత, కామోద్దీపనలతో నగ్నత్వాన్ని అన్నివేళలా సమానంగా భావించడం తప్పు... కామోద్దీపన అనే భావన చూసే వారి దృష్టిని బట్టే ఉంటుందని... న్యాయమూర్తి (Judge) ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దేవాలయాలపై వివిధ రకాల భంగిమల్లోని శిల్పాలు (Sculptures in various poses on temples) ప్రాచీన కాలం నుంచీ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తల్లీ, బిడ్డల మధ్య అనుబంధంలోని గాఢత, పవిత్రతను (sanctity of mother-child connection) ఎవరూ ప్రశ్నించలేరని తేల్చిచెప్పారు. ఒక సామాజిక లక్ష్యం కోసం రెహానా రూపొందించిన ఈ వీడియోను అవగాహన చేసుకోవడంలో దిగువ కోర్టు విఫలమయ్యిందని ఈ సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆమెపై పోలీసులు నమోదు చేసిన కేసులన్నింటినీ రద్దు చేయాలని (all cases should be dismissed) ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక హక్కులో గోప్యత, సమానత్వం కోసం తన శరీరం గురించి స్వయంప్రతిపత్తి నిర్ణయాలు తీసుకునే హక్కు స్త్రీకి ఉందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా హామీ ఇచ్చిన వ్యక్తిగత స్వేచ్ఛ పరిధిలోకి కూడా వస్తుందని న్యాయమూర్తి ఉద్ఘాటించారు. పిల్లలను అశ్లీల చిత్రాలకు ఉపయోగించినట్లు చూపించినట్లు ఇందులో ఏమీ లేదు. వీడియోలో లైంగికత గురించిన విషయంపై కూడా ఎలాంటి సూచనా లేదు. పురుషుడు లేదా స్త్రీ అయినా, ఆ వ్యక్తి పైభాగంలో పెయింటింగ్ చేయడం లైంగిక అసభ్యకరమైన చర్యగా చెప్పలేం’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

రెహనా ఫాతిమా ఎవరు? : Who is Rehana Fatima?

Rehana fatima

33 ఏళ్ళ మహిళా హక్కుల కార్యకర్త (Women's rights activist) రెహానా ఫాతిమా వివాదాలకు కొత్తేమీ కాదు. తన ఇద్దరు మైనర్ పిల్లలు ఒక అబ్బాయి, ఒక అమ్మాయిని తన అర్ధ నగ్న శరీరంపై పెయింటింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన తర్వాత ఆమె మళ్లీ వార్తల్లోకెక్కారు. రెహానా కొచ్చికి చెందిన మహిళా హక్కుల కార్యకర్త. 2014లో, రెహానా ఫాతిమా తన భర్త మనోజ్ కె శ్రీధర్‌తో కలిసి నైతిక పోలీసింగ్‌కు (moral policing) వ్యతిరేకంగా కొచ్చిలో జరిగిన వివాదాస్పద 'కిస్ ఆఫ్ లవ్' నిరసనలో (controversial 'Kiss of Love' protest) పాల్గొన్నారు. మరోసారి, త్రిస్సూర్‌లోని ప్రముఖ కార్యక్రమం ఓనం టైగర్ డ్యాన్స్ (Onam tiger dance) లో పాల్గొనడం ద్వారా పురుషాధిపత్యాన్ని ప్రశ్నించేందుకు ప్రయత్నించింది. రెహానా మోడలింగ్‌ (modeling) కూడా చేసేది. కొంతకాలం క్రితం వరకు ప్రభుత్వ రంగ సంస్థ BSNLలో టెలికాం టెక్నీషియన్‌గా (telecom technician in BSNL) పనిచేసారు.

Also Read - AP Budget Allocations

ఫాతిమా ఒక సనాతన ముస్లిం కుటుంబంలో జన్మించింది (born in a Muslim family). తన తండ్రి మరణానంతరం ఫాతిమా జీవితమే మారిపోయినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. 2018 అక్టోబర్‌లో అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఫాతిమా శబరిమల కొండపైకి (Sabarimala) హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్టుతో పాటు వెళ్లేందుకు ప్రయత్నించింది. పోలీసులతో జరిగిన తోపులాటలతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఆలయ ప్రధాన గర్భగుడి (main sanctum sanctorum) నుండి 500 మీటర్ల దూరంలో మితవాదులు ఆమె ప్రవేశాన్ని అడ్డుకోవడంతో ఫాతిమా వెనుదిరిగింది.