తెలంగాణా యువతలో ఫాలోయింగ్ ఉన్న నేతలు : Leaders who have a following among Telangana youth

ఐటీ రంగంలో దేశంలో అత్యంత విజయ శిఖరాలను చేరుకుంటున్న వాటిలో తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ముందుంది. రాజకీయంగా కూడా సంచలనాలు సృష్టిస్తోంది.

తెలంగాణా యువతలో ఫాలోయింగ్ ఉన్న నేతలు  : Leaders who have a following among Telangana youth

తెలంగాణా యువతలో ఫాలోయింగ్ ఉన్న నేతలు : Leaders who have a following among Telangana youth

  

ఐటీ రంగంలో దేశంలో అత్యంత విజయ శిఖరాలను చేరుకుంటున్న వాటిలో తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ముందుంది. రాజకీయంగా కూడా సంచలనాలు సృష్టిస్తోంది.

 

తెలంగాణా దేశంలోనే అత్యంత ఖ్యాతి గడించిన రాష్ట్రం. ఇక్కడి హైటెక్ సిటీలోని ఐటీ రంగం లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తోంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉండి రాష్ట్రాల విభజనలో తెలంగాణాగా ఆవిర్భవించింది. 1998 నవంబర్ 24 అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హైటెక్ సిటీకి రూపకల్పన చేసి అప్పటి ప్రధాని వాజపేయి చేతుల మీదుగా ప్రారంభింపచేసారు.

 

యువ నాయకుల ప్రసంగాలే కీలకం

 

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు. రెండింటిని కలిపి సైబరాబాద్ గా పిలుస్తారు. ప్రస్తుతం ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ తెలంగాణా ఐటీ రంగాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తూ ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. ఐటీ, పారిశ్రామిక రంగాల్లోనే కాకుండా రాజకీయంగా కూడా దేశంలో రాష్ట్రం అందరిలో చర్చనీయాంశంగా నిలిచింది. ఇక్కడ అధికారంలో ఉన్న తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) ఇటీవలే భారత  రాష్ట్ర సమితి (భారాస) జాతీయ పార్టీగా ఆవిర్భవించింది.

 

ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి జాతీయ అధ్యక్షుడు. ఇక్కడి రాజకీయ నేతలు తమ పనితీరుతో రాష్ట్రంలోని యువతను ఎంతగానో ప్రభావితం చేస్తున్నారు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని ప్రజా సేవకుడు అంటరానే నానుడికి తగ్గట్లుగా ఇక్కడ ఉన్న ఎంతో మంది నాయకులు పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పని చేస్తున్నారు. అయితే ఎంత మంది నాయకులు ఉన్నప్పటికీ వారిలో కొంత మంది మాత్రమే యువతను ప్రభావితం చేయగలరు. అలాంటి రాజకీయ నాయకులు లక్షలాది మంది యువతను ఎంతో ప్రభావితం చేస్తూ తమ మీద అభిమానాన్ని పొందేలా చేసుకుంటున్నారు.

 

1. కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)

 

ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడైన కేటీఆర్ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మృదుస్వభావి, అందరితో మర్యాదపూర్వకంగా, వినమ్రంగా ఉండే కేటీఆర్ అంటే ఇక్కడి యువతలో ఎంతో క్రేజ్ ఉంది. పూణే యూనివర్శిటీలో MSc (బయో-టెక్నాలజీ), సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో MBA (మార్కెటింగ్) చదివాడు. తన తండ్రి ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఐటీ సంబంధిత బిజినెస్ లో అనుభవం ఉండడంతో ఎన్నో ప్రసిద్ధి చెందిన సంస్థలను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేలా కృషి చేసాడు. ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలను ఇక్కడ ఏర్పాటు చేయించడంలో సఫలమై ఎంతో మందికి ఉపాధి కల్పించడమే కాకుండా గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దారు. ఎక్కడైనా సభల్లో మాట్లాడినప్పుడు అందరినీ ఆకట్టుకునేలా ప్రసంగించే మంచి వక్తగా పేరు పొందారు. యువకుడైన కేటీఆర్ యువతకు ఎంతో ఆదర్శంగా నిలిచారు. నిజమైన నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కేటీఆర్ లో ఉన్నాయని అంటారు.

 

2. కల్వకుంట్ల కవిత

 

సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలో పనిచేసిన కవిత తెలంగాణాలో ఎంతో ప్రాముఖ్యం పొందారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె అయిన కవిత 2004 లో అమెరికాలో జాబ్ విడిసి పెట్టి తెలంగాణాలో అప్పుడే ఊపందుకున్న తెలంగాణా ఉద్యమం కోసం భారత్ కు తిరిగి వచ్చేసారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో నిజామాబాద్ నుంచి లోక్ సభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆమెకు రాష్ట్రంలో ముఖ్యంగా మహిళల్లో ఎంతో ఫాలోయింగ్ ఉంది. అందరినీ తన ప్రసంగాలతో ఆకట్టుకోవడమే కాకుండా, బతుకమ్మ పండుగకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా నిలిచింది. తెలంగాణాలో ఎంతో ప్రాముఖ్యమైన "బతుకమ్మ" పండుగను రాష్ట్ర పండుగగా మార్చడానికి కృషి చేసారు.

 

3. టి. హరీష్ రావు

 

పిన్న వయసులోనే యావత్ దేశంలోనే 6 సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికైన ఏకైక వ్యక్తి హరీష్ రావు. అధికార పార్టీలో ప్రస్తుతం ఆర్ధిక మంత్రిగా ఉన్నారు. యూత్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసినప్పుడు ఎన్నో కీలక ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేసారు. ప్రతిష్టాత్మకమైన మిషన్ కాకతీయ, నీటిపారుదల పాత ప్రాజెక్టుల పునరుద్ధరణ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో తెలంగాణా నీటి కొరత సమస్యను పరిష్కరించి ఖ్యాతి గడించారు. గ్రామా స్థాయిలో నీటి పునరుద్ధరణను అమలు చేశారు. ఎల్లప్పుడూ తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడమే కాదు, యూత్ లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు హరీష్ రావు అల్లుడు. ఈయన సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

 

4. గువ్వల బాలరాజు

మానవత్వానికి మారుపేరుగా నిలిచి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే గా కంటే మానవతావాదిగా పేరు పొందారు బాలరాజు. అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన బాలరాజు లా కోర్సులో మాస్టర్ డిగ్రీ (LLM) చేసారు. తెరాసలో చేరి 2014 లో పార్టీ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందారు. పేద కుటుంబానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ ఎంతో మందికి మానవత్వంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తన నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేసారు. ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమై ఉంటారు. ఆయన చేస్తున్న సేవాకార్యక్రమాలతో యువత ఆయనంటే ఎంతో అభిమానం చూపిస్తారు. ఆయన మీద అభిమానంతో #gbrarmy, #gbryuvasena, #gbrsoldiers అనే పేర్లతో గ్రూప్స్ ఏర్పాటు చేసి  అయన చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు ఆయన అభిమానులు, అనుచరులు.

 

5. రేవంత్ రెడ్డి

 

జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, ఎటువంటి రాజకీయ అండ లేకుండా సొంతంగా తన రాజకీయ జీవితాన్ని తీర్చిదిద్దుకున్న నాయకుడు రేవంత్. తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఏబీవీపీలో పనిచేసారు. 2006 లో జడ్పీటీసీగా, 2007 లో ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2009 లో టీడీపీ తరపున కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ గా పనిచేసారు. 2014 లో కూడా మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2017 లో కాంగ్రెస్ లో చేరారు. ఈయనకు ఫేస్ బుక్ లో 5 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. 2019 లో ఎంపీ గా గెలుపొందారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మొక్కవోని ఆయన ధైర్యం, ఆయన ప్రసంగాలు యువతను ఎంతగానో ఆకట్టుకుంటాయి. 

 

6. కిషన్ రెడ్డి

 

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి మొదటి నుంచి బీజేపీ లోనే ఉన్నారు. తెలంగాణా పోరు యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్ర ఎంతో పేరు తీసుకువచ్చింది. తెలంగాణాలో బీజేపీ కి ఉన్న ముఖ్య నేతల్లో కిషన్ రెడ్డి ఒకరు. ఆయన నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటూ వారి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆయన ప్రసంగాలు యువతను ఎంతగానో ఆకట్టుకుంటాయి. విద్యార్థి దశ నుంచే యూత్ విభాగంలో పని చేసిన అనుభవం ఆయనకు యువతను దగ్గర చేసింది. 2004 లో హిమాయత్ నగర్ నుంచి, 2009, 2014 లో అంబర్ పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2019 లో సికింద్రాబాద్ నుంచి లోక్ సభ ఎంపీగా గెలుపొంది మోదీ ప్రభుత్వంలో హోమ్ మంత్రిగా 2019 నుంచి 2021 వరకు పని చేసారు. 2021 నుంచి టూరిజం, సాంస్కృతిక శాఖా మంత్రిగా ఉన్నారు.