ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు : Schemes implemented by YSRCP government in AP

ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.

ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు : Schemes implemented by YSRCP government in AP

ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు : Schemes implemented by YSRCP government in AP 

ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. 2019 మే నెలలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ (YSRCP) ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు వాటిని అమలు చేస్తోంది. ఈ ఏడాది మే 30 వ తేదీనాటికి నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 175 సీట్లు ఉన్నాయి. వీటిలో వైఎస్సార్సీపీ 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల కోసం అమలు చేసిన పథకాలను మరింత మెరుగు పరచి రాష్ట్రంలో పేదల జీవితాలను మెరుగు చేసేందుకు కృషి చేస్తున్నారు.

విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి : Special focus on education and health 

పేదల ఆరోగ్యం కోసం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా లక్షలాది రూపాయల విలువైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతోంది. విద్య, ఆరోగ్యంతో పాటు వ్యవసాయం, సంబంధిత పరిశ్రమలను మరింతగా విస్తరించడం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలు ఒకసారి పరిశీలిస్తే...

YSR పెళ్లి కానుక పథకం : YSR Wedding Gift Scheme 

అల్పాదాయ కుటుంబాలకు చెందిన వధువుపై వివాహానికి సహాయం అందించేందుకు వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకం అమలు చేసారు. బీపీఎల్ (BPL), ఈడబ్ల్యూఎస్ (EWS), ఓబీసీ (OBC), మైనారిటీ (minority), ఎస్సీ (SC), ఎస్టీ (ST), దివ్యాంగ వధువులు ఈ ప్రయోజనానికి అర్హులు. ఈ పథకం కింద రూ.1.5 లక్షల నుండి రూ.2 లక్షల వరకు సాయం అందిస్తారు. ఆయా వర్గాలు (category) ప్రకారం సాయం అందుతుంది.

YSR అమ్మ ఒడి పథకం : YSR Amma odi Scheme 

అణగారిన ప్రజలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారి పిల్లలను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు అమలు చేసిందే వైఎస్ఆర్ అమ్మ ఒడి పథకం. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం తల్లిదండ్రులను ప్రోత్సహించి వారి పిల్లలను పాఠశాలలకు పంపించడం ద్వారా విద్యను మరింత అభివృద్ధి చేసేందుకు అమలు చేసిన అద్భుతమైన పథకం. ఈ పథకం అమలు చేయడంతో ప్రతి ఏడాది ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలల్లో చేరుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పథకం అమలు చేసినప్పటి నుంచి దాదాపు 300000 (3 lac students) పైగా విద్యార్థులు పాఠశాలల్లో చేరారు. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలను వారి తల్లి ఖాతాలో జమ చేస్తారు. 1 నుండి 12 తరగతుల (1 to 12th class) పిల్లలకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ పథకానికి తెల్ల రంగు రేషన్ కార్డు ఉన్నవారు అర్హులు.

YSR ఆరోగ్యశ్రీ పథకం : YSR Arogyashri Scheme 

అల్పాదాయ, మధ్య తరగతి ఆదయ కుటుంబాల వారి కోసం ఏర్పాటు చేసిందే ఆరోగ్యశ్రీ పథకం. దరఖాస్తు చేసుకునే వారికి ఉచిత వైద్య సహాయం అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకంలో నమోదు చేసుకున్న ఆయా కుటుంబ సభ్యులందరికీ ఈ పథకం క్రింద వైద్య సహాయం అందిస్తారు. ఈ పథకంలో నమోదైన ప్రతి లబ్ధిదారుడు ప్రతి ఏడాది ఈ పాలసీ పునరుద్ధరణ కోసం తమ అభ్యర్ధనను దాఖలు చేయాల్సి ఉంటుంది. అర్హులైన లబ్దిదారులకు ఆరోగ్యశ్రీ కార్డును అందజేస్తారు.

ఇంకా వీటితో పాటుగా మరిన్ని పథకాలను జగన్ ప్రాఖ్భుత్వం అమలు చేస్తోంది. వృద్ధాప్య, వితంతు, వికలాంగ ఫించన్లను ప్రతి నెలా మొదటి తేదీ నాడు వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి ఫించను అందించడం దేశంలోనే ఎక్కడా లేని విధంగా అందిస్తున్నారు. దీంతో పాటుగా వచ్చే ఏడాదితో జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకోనుంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతోంది. అందుకోసం మొత్తం మంత్రి వర్గం దీనికోసం ఆయా నియోజక వర్గాల్లో పర్యటిస్తున్నారు. ప్రభుతం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. వచ్చే ఏడాది కూడా 2009 ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలనే ధ్యేయంతో ముందుకు వెళుతున్నారు. సీఎం జాన్ అమల్లోకి తెచ్చిన పేదల పథకాలే తిరిగి పార్టీని గెలిపిస్తాయని పార్టీ శ్రేణులు ధీమాతో ఉన్నాయి.