ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులు : AP Budget Allocations

2023-2024 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,79,279 లక్షల కోట్లు. రెవెన్యూ వ్యయం (Revenue Expenditure) రూ.2,28,540 కోట్లు, మూల ధన వ్యయం (Capital expenditure) రూ.31,061 కోట్లు గా అంచనాలు రూపొందించారు.

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులు : AP Budget Allocations

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులు : AP Budget Allocations

2023-2024 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,79,279 లక్షల కోట్లు. రెవెన్యూ వ్యయం (Revenue Expenditure) రూ.2,28,540 కోట్లు, మూల ధన వ్యయం (Capital expenditure) రూ.31,061 కోట్లు గా అంచనాలు రూపొందించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక శాఖా మంత్రి (Finance Minister) బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jaganmohan reddy), ఇతర మంత్రుల సమక్షంలో ప్రవేశపెట్టారు. 2023-2024 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,79,279 లక్షల కోట్లు. రెవెన్యూ వ్యయం (Revenue Expenditure) రూ.2,28,540 కోట్లు, మూల ధన వ్యయం (Capital expenditure) రూ.31,061 కోట్లుగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు (Revenue deficit) రూ.22,316కోట్లు, ద్రవ్య లోటు (Monetary deficit) రూ.54,587 కోట్లుగా పేర్కొన్నారు. జీఎస్డీపీలో లోటు ((GSTP deficit)) 3.7 శాతంగా తెలిపారు. బడ్జెట్ లో వివిధ రంగాలకు, ఆయా శాఖలకు ప్రతిపాదించిన కేటాయింపులు క్రింది విధంగా ఉన్నాయి.

  • వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం (YSR Pension scheme) కోసం రూ.21,424 కోట్లు కేటాయింపులు చేసారు
  • స్కిల్ డెవలప్మెంట్ (Skill development) విభాగం కోసం రూ.1,191 కోట్లు కేటాయింపులు చేసారు.
  • పాఠశాల విద్య కోసం (primary education) రూ.29,062 కోట్లు, ఉన్నత విద్య (higher education) కోసం 2,600 కోట్లు కేటాయించారు
  • వైఎస్సార్ కళ్యాణమస్తు (YSR Kalyanamastu) కోసం రూ.200 కోట్లు. ఈబీసీ నేస్తం (EBC nestham) కోసం రూ.650 కోట్లు కేటాయించారు
  • వైఎస్సార్ చేయూత (YSR cheyootha) పథకం కోసం రూ.5,000 కోట్లు కేటాయింపు.. మహిళ, శిశు సంక్షేమం (Women and child welfare) కోసం రూ.3,950 కోట్లు కేటాయింపులు చేశారు
  • మధ్యాహ్న భోజన పథకానికి (Mid-day meal) రూ.1000 కోట్లు కేటాయించారు
  • పాఠశాలల్లో నాడు-నేడు (Nadu-Nedu) పనుల కోసం రూ. 3,500 కోట్లు కేటాయించారు
  • గడప గడపకూ మన ప్రభుత్వం (Gadapagadapakoo mana prabhutvam) కోసం రూ.532 కోట్లు కేటాయించారు
  • ప్రత్యక్ష బదిలీ (Direct transfer) ద్వారా రూ.27,065 కోట్లు కేటాయించారు
  • వైఎస్సార్ అభయ హస్తం (YSR Abhaya Hastam) పథకానికి రూ.21,275 కోట్లు కేటాయించారు
  • పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక (Environmental, Forestry, Science, Technology) శాఖలకు రూ.1,200 కోట్లు కేటాయించారు
  • రైతు భరోసాకు (Rythu Bharosa) రూ.4,000 కోట్లు కేటాయించారు
  • మైనార్టీ కార్పొరేషన్కు (minority corporation) రూ.1,848 కోట్లు కేటాయించారు
  • హోం శాఖకు (Ministry of Home Affairs) రూ.8,206 కోట్లు కేటాయించారు
  • ఈబీసీ కార్పొరేషన్కు (EBC Corporation) రూ.6,165 కోట్లు కేటాయించారు
  • బ్రాహ్మణ కార్పొరేషన్కు (Brahman Corporation) రూ.348 కోట్లు కేటాయించారు
  • ఎస్టీ కార్పొరేషన్కు (ST corporation) రూ.2,428 కోట్లు కేటాయించారు
  • క్రిస్టియన్ కార్పొరేషన్కు (Christian corporation) రూ.115.03 కోట్లు కేటాయించారు
  • జగనన్న విద్యా దీవెన (Jagananna Vidya deevena) కోసం రూ.2,841.67 కోట్లు కేటాయించారు
  • యువజన, పర్యాటక (Youth and Tourism) శాఖకు రూ.1,191 కోట్లు కేటాయించారు
  • అమ్మ ఒడి (Amma Odi) కోసం రూ.6,500 కోట్లు కేటాయింపు ప్రకటించారు
  • ఎనర్జీ రంగానికి (energy sector) రూ.6,456 కోట్లు కేటాయించారు
  • గ్రామ, వార్డు సచివాలయాల (Village and Ward Secretariats) శాఖకు రూ.3,887 కోట్లు కేటాయించారు
  • షెడ్యూల్ కులాల సంక్షేమానికి (SC Welfare) రూ.20,007 కోట్లు కేటాయించారు
  • షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి (ST Welfare) రూ.6,887 కోట్లు కేటాయింపులు చేసారు
  • వైఎస్సార్ ఆసరాకు (YSR Asara) 6,500 కోట్లు కేటాయింపు చేసారు
  • వైస్సార్ వాహన మిత్రకు (YSR vahana mitra) రూ.275 కోట్లు కేటాయించారు
  • జగనన్న చేదోడు (Jagananna Chedodu) పథకం కోసం రూ.350 కోట్లు కేటాయించారు
  • వైఎస్సార్ నేతన్న (YSR netanna) నేస్తం కోసం రూ.220 కోట్లు కేటాయింపులు చేసారు
  • నీటి పారుదల (Irrigation Department) శాఖకు రూ.11,908 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు (R&B) రూ.9,000 కోట్లు కేటాయించారు
  • పేదల ఇళ్ల నిర్మాణం (Construction of houses for the poor) కోసం రూ.5,600 కోట్లు కేటాయింపు చేసారు
  • మైనార్టీల సంక్షేమం (Minority welfare) కోసం రూ.4,207 కోట్లు కేటాయించారు
  • పురపాలక, పట్టణాభివృద్ధికి (municipal and urban development) రూ.9,840 కోట్లు కేటాయించారు
  • కాపు సంక్షేమానికి (Kapu welfare) రూ.4887 కోట్లు కేటాయించారు
  • రైతులకు వడ్డీలేని రుణాలు (Interest free loans to farmers) రూ.500 కోట్లు కేటాయించారు
  • వైఎస్సార్ కాపు నేస్తం (YSR Kapu nestam) కోసం రూ.550 కోట్లు కేటాయించారు
  • మత్స్యకారుల డీజిల్ సబ్సిడీ (Fishermen's Diesel Subsidy) కోసం రూ.50 కోట్లు కేటాయించారు
  • లా నేస్తం (Law nestam) కోసం రూ.17 కోట్లు కేటాయించారు
  • జగనన్న తోడు (jagananna thodu) కోసం రూ.35 కోట్లు కేటాయింపులు చేసారు
  • జగనన్న వసతి దీవెనకు (Jagananna vasati deevena) రూ.2,200 కోట్లు కేటాయించారు
  • వ్యవసాయ యాంత్రీకరణ (Agricultural mechanization) కోసం రూ.1,212 కోట్లు కేటాయించారు
  • డ్యాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల (Interest Free Loans to Dwakra groups) కోసం రూ.1,000 కోట్లు కేటాయించారు
  • డీబీటీ స్కీమ్స్ (DBT schemes) కోసం రూ.54 వేల కోట్లకుపైగా కేటాయించారు.
  • వైద్యం, ఆరోగ్యం (Medicine, health) కోసం రూ.15,882 కోట్లు కేటాయించారు
  • జగనన్న విద్యా కానుకకు (Jagananna vidya kanuka) రూ.560 కోట్లు కేటాయించారు
  • ధరల స్థిరీకరణ నిధికి (Price Stabilization Fund) రూ.3,000 కోట్లు కేటాయించారు
  • పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి (Panchayati Raj, Rural Development) రూ.15,882 కోట్లు ప్రతిపాదించారు