త్వరలో రానున్న ఉత్తమ 5G స్మార్ట్ ఫోన్లు : Best 5G Smartphones Coming Soon

త్వరలో రానున్న ఉత్తమ 5G స్మార్ట్ ఫోన్లు : Best 5G Smartphones Coming Soon

త్వరలో రానున్న ఉత్తమ 5G స్మార్ట్ ఫోన్లు : Best 5G Smartphones Coming Soon 

నేడు స్మార్ట్ ఫోన్ వాడని వారు లేరనడంలో సందేహం లేదు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ స్మార్ట్ గా ప్రతి ఒక్కరి చేతుల్లోనూ దర్శనమిస్తోంది. అంతలా పెనవేసుకు పోయింది స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితాలతోను. 2G నుండి 3G వరకూ, 3G నుండి 4G వరకూ విస్తరించిన నెట్వర్క్ నేడు 5G వరకు విస్తరించింది. 

అత్యంత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించిన ఎన్నో స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే రాబోయే కొన్ని నెలల్లో సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసిన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఇందులో ఆపిల్ (Apple), నథింగ్ (Nothing), గూగుల్ (Google), వన్ ప్లస్ (OnePlus) వంటి బ్రాండ్ల నుంచి సరి కొత్త సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చే నెలలో రానున్నాయి. ఈ ఫోన్లకు సంబంధించిన సరికొత్త ఫీచర్లు, ఎప్పుడు రిలీజ్ అవనున్నాయో ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Nothing నథింగ్ ఫోన్ (2) : Nothing Phone (2)

భారత దేశంలో నథింగ్ ఫోన్ (2) ను జూలై 11 న అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారత్ తో పాటుగా ఇతర దేశాల్లోనూ విడుదల కానుంది. సరికొత్త టెక్నాలజీతో విడుదల కానున్న ఈ 5G స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్8+జనరల్1 (Snapdragon8+Gen1) ప్రాసెసర్, ప్రత్యేకమైన చిప్ సెట్ ఇందులో ఉంది. 6.7 అంగుళాల స్క్రీన్ కలిగి 700mAh బ్యాటరీతో రానుంది. ఈ ఫో యొక్క డిజైన్, సౌండ్ సిస్టం మిగతా ఫోన్లతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ ఫోన్ తో పాటు ఛార్జర్ ఉండడం లేదు. ఈ స్మార్ట్ ఫోన్ తో మూడేళ్ళ పాటు ఆండ్రాయిడ్ OS అప్ గ్రేడ్స్, నాలుగేళ్లకు సెక్యూరిటీ ప్యాచెస్ లభించనున్నాయి. 

యాపిల్ సరికొత్త ఐఫోన్ 15 సిరీస్ : Apple latest iPhone 15 Series 

నేడు ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే ప్రతి ఏడాది సరికొత్త సిరీస్ లతో ఫోన్లను విడుదల చేస్తున్నారు. యాపిల్ (Apple) సరికొత్త ఐఫోన్ 15 సిరీస్ (Apple iPhone 15 Series) ఈ సాంవత్సరం సెప్టెంబర్ లో విదలయ్యే అవకాశం ఉంది. కొత్తగా విడుదల కానున్న అన్ని మోడల్స్   పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌ తో రానున్నాయి. ఈ మోడల్స్ గ్లాస్ బ్యాక్ ప్యానల్స్ (glass back pannels) కలిగి ఉండనున్నాయి. ప్రస్తుతమున్న యాపిల్ పాత మ్యూట్ స్విచ్ బటన్ ను కొత్త దానితో భర్తీ చేయనున్నారు. ఫ్లాగ్‌షిప్ ఫోన్ల వెనుక ప్యానల్ లో పెద్ద కెమెరా బంప్ లు ఉండనున్నట్లు తెలుస్తోంది. డిజైన్ మాత్రం ఐఫోన్ 14 సిరీస్ మాదిరిగానే ఉండనుంది.

oneplus nord వన్‌ప్లస్ నార్డ్ 3 : oneplus nord OnePluse Nord3 

భారత దేశంలో వన్‌ప్లస్ నార్డ్ 3 (OnePlus Nord3) త్వరలో విడుదల కానుంది. కంపెనీ ఇప్పటికే నార్డ్ 2 (Nord 2) సిరీస్ ఫోన్లను రిలీజ్ చేసిన విషయం విదితమే. అతి త్వరలోనే మరో సిరీస్ ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వన్‌ ప్లస్ నార్డ్ 3 (OnePlus Nord 3.15K) రిజల్యూషన్‌తో 120Hz డిస్‌ప్లేతో విడుదల కానుంది. దీనికి అమోలెడ్ (AMOLED) ప్యానెల్ ఉండనుంది. ఈ వన్‌ ప్లస్ నార్డ్ 3 ఫోన్ మీడియా టెక్ డైమెన్షన్ 9000 (MediaTek Dimension 9000) ప్రాసెసర్‌, 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ రానుంది. ఇది ఆండ్రాయిడ్ 13 వెర్షన్ తో నడుస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5 : Samsung galaxy fold Samsung Galaxy Z ఫోల్డ్ 5 

భారత దేశంలో వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులకు శామ్సంగ్ కంపెనీ పెట్టింది పేరు. స్మార్ట్ ఫోన్లకు కూడా మంచి పేరు గాంచింది. శామ్సంగ్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ (Foldable phone) సరికొత్త ఫీచర్లతో రానుంది. వచ్చే జూలై 27 వ తేదీన ఈ ఫోల్డబుల్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది గెలాక్సీ Z ఫోల్డ్ 5 స్మార్ట్‌ ఫోన్ (Galaxy Z Fold 5 smart phone) పేరుతో విడుదల కానుంది. దీంతో పాటుగా మరో స్మార్ట్ ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5 (Samsung Galaxy Z Flip5) ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ రెండు ఫోన్లు కూడా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 (Qualcomm Snapdragon 8 Gen 2) చిప్ సెట్ తో రానున్నాయి. శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5 స్మార్ట్ ఫోన్ 6.2 అంగుళాలు, HD+ AMOLED అవుటర్ డిస్‌ప్లేతో రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ తో 7.6 అంగుళాలు, QXGA+AMOLED ఫోల్డింగ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

Google Pixel గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ : Google Pixel Google Pixel 8 Series 

ఈ సంవత్సరం అక్టోబర్ లో గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ (Google Pixel 8 Series) లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్లో నెక్స్ట్ జెనరేషన్ టెన్సర్ (Next Generation Tensor G3 SoC) G3 SoC తో రానుంది. ఈ ఫోన్లో పిక్సెల్ 8 రెండు కెమెరాలు ఉంటాయి. ప్రో మోడల్స్ లో 3 సెన్సార్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ (Google) కంపెనీ ఫోన్లో సరికొత్త హార్డ్ వేర్, గూగుల్ అత్యుతమ ఇమేజింగ్ ప్రోసెసింగ్ టెక్నాలజీ (Google best image processing technology) ని అందిస్తుంది. తక్కువ కాంతిలో కూడా మెరుగైన ఫోటోల కోసం నూతనీకరించబడిన 50 మెగాపిక్సెల్ Samsung GN2 ISOCELL సెన్సార్‌తో అనుసంధానం చేయబడింది.