ఏపీ బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్ద పీట : Agriculture has a big place in the AP budget

దేశంలో వ్యవసాయానికి పెద్ద పీట వేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉంది. ఇక్కడి రైతులకు, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వారి ఎదుగుదలకు దోహద పడుతోంది.

ఏపీ బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్ద పీట : Agriculture has a big place in the AP budget

ఏపీ బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్ద పీట : Agriculture has a big place in the AP budget 

దేశంలో వ్యవసాయానికి పెద్ద పీట వేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉంది. ఇక్కడి రైతులకు, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వారి ఎదుగుదలకు దోహద పడుతోంది. ఇందులో భాగంగా వ్యయవసాయ రంగానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్లో రూ.4,020 కోట్లు ప్రతిపాదించారు. దీని ద్వారా 52.38 లక్షల మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధులతో కలిపి మొత్తముగా మూడు విడతలలో రూ.13500 లు ఆర్ధిక సహాయాన్ని అందిస్తోంది. ఈ పథకం ప్రారంభించిన నాటినుండి ఇప్పటి వరకూ ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో రూ.27,063 కోట్లను అర్హులైన రైతు కుటుంబాల అకౌంట్లలో వేశారు. ఈ పథకాన్ని కౌలుదారులకు, ఆర్ఓఎఫ్ఆర్ (ROFR) భూములను సేద్యం చేస్తున్న గిరిజన రైతు కుటుంబాలకు సైతం అందిస్తున్నారు.

వ్యవసాయ ఉత్పాదనకు ఉపయోగపడే నాణ్యమైన పరికరాలు, వస్తువులను ముందుగానే పరీక్షించి వీటి సరఫరా మొదలుకుని గ్రామస్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ వరకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి. గత 2022-23 ఆర్థిక సంవత్సరంలో 187 కోట్ల రూపాయల విలువైన సుమారు 7 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన సబ్సిడీతో కూడిన పంట విత్తనాలను సుమారు 12 లక్షల మంది రైతులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. వ్యవసాయ యాంత్రీకరణ కోసం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1,212 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదించారు. రైతులకు పశువుల బీమాను అందించేందుకు అభివృద్ధి చెందిన, స్వదేశీ పశువులే కాకుండా ఈ కోవకు చెందని పశువులు కూడా ఈ పథకం క్రిందకు వచ్చేటట్లుగా వైఎస్‌ఆర్‌ పశు బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇది రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. పశువుల సంరక్షణ కోసం రైతుల ఇంటి వద్దకే పశు సంబంధిత సేవలను అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే 340 అత్యవసర సంచార పశు వైద్యశాలలను (Emergency mobile veterinary clinics) ప్రారంభించింది. డాక్టర్ వైఎస్‌ఆర్‌ వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షా కేంద్రాలతో అనుసంధానం అయ్యేటట్లుగా 154 నియోజకవర్గ స్థాయి జంతు వ్యాధుల నిర్ధారణా కేంద్రాలను మంజూరు చేసారు.

రాష్ట్రంలో మిగిలిన 7578 రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.40.46 కోట్లు ప్రతిపాదించారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షా కేంద్రాల కోసం ఈ ఆర్ధిక సంవత్సరానికి 36.39 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదించారు. పర్యావరణ అనుకూల సేంద్రీయ పంట దిగుబడులను పెంచడం కోసం వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తూ, సాగు ఖర్చు తగ్గిస్తూ, ప్రభుత్వం సమగ్ర పంట నిర్వహణ పద్ధతులతో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పొలం బడి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాధికారత కల్పిస్తోంది

ఎరువుల వాడకం తగ్గించాలి : Reduce the use of fertilizers 

రైతులకు భరోసాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రైతు భరోసా పథకం కొంత మేర రైతులకు ఊరటను ఇస్తున్నప్పటికీ రైతులు ఇంకా నష్టాలనే చవి చూస్తున్నారు. పెరుగుతున్న ధరలతో రైతు కుదేలవుతున్నాడు. ఎకరం పొలం సాగుకు అయ్యే ఖర్చును ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. దాదాపు 30,000 రూపాయల వరకూ ఎకరాకు ఖర్చు అవుతోంది. కొలు రైతు కి తాను ఇవ్వాల్సిన కొలు ధర అదనం. అయితే విచ్చలవిడిగా ఎరువులను వాడొద్దని వ్యవసాయ శాఖ అధికారులు మొత్తుకుంటున్నా రైతులు ఆలకించడం లేదు. ఒకప్పుడు దుక్కి దున్నాలంటే నాగలి, ఎడ్లను ఉపయోగించేవారు. ఇప్పుడు ట్రాక్టర్ లేనిదే దుక్కి అవడం లేదు. ఆఖరికి కోతలు సైతం యంత్రాలు చేసేస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 59 లక్షల ఎకరాల భూమి సాగు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే 2021 వ సంవత్సరంలో 40.77 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 2022 లో అది అది దాదాపు 35 లక్షలకు చేరుకుంది.

నాలుగు సార్లు దుక్కి దున్నడానికి రూ.4600 

విత్తనాలు, కూలీల ఖర్చులు రూ.7000 

కొత్త ఖర్చు రూ. 8800 

ఎరువులకు రూ. 6200