మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం : 8th March International Women's Day

యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత: ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని ఆర్యోక్తి. మరి అటువంటి స్త్రీ మూర్తులకు మనం నిజంగా గౌరవాన్ని ఇస్తున్నామా? వారికి కల్పించాల్సిన సౌకర్యాలను అందిస్తున్నామా? లేక కేవలం వారిని ఆటబొమ్మలుగానే చూస్తున్నామా?

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం : 8th March International Women's Day

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం : 8th March International Women's Day

యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత: ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని ఆర్యోక్తి. మరి అటువంటి స్త్రీ మూర్తులకు మనం నిజంగా గౌరవాన్ని ఇస్తున్నామా? వారికి కల్పించాల్సిన సౌకర్యాలను అందిస్తున్నామా? లేక కేవలం వారిని ఆటబొమ్మలుగానే చూస్తున్నామా?

 

మహిళలు మహరాణులు... పచ్చనైన ప్రతి కథకు తల్లివేరు పడతులు... భగ్గుమనే కాపురాల అగ్గిరవ్వ భామలు... ఇంటి దీపమై వెలిగే ఇంధనాలు ఇంతులు అని ఒక కవి చెప్పినట్లుగా నిజంగా మహిళలు మహరాణులు. అమ్మగా... అక్కగా... భార్యగా... ఎన్నో పాత్రలను పోషిస్తూ సమాజంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో సమాజ అభివృద్ధికి తోడ్పడటంలో మహిళలు ముందంజ వేస్తున్నారు.

 

మహిళా దినోత్సవం 2023 థీమ్ : 2023 Women's Day Theme

ప్రతి ఏడాది (Every year) జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున (International Women's Day) ఒక్కో థీమ్ (Theme) ను ప్రకటిస్తుంటారు. అదేవిధంగా ఏడాదికి సంబంధించి థీమ్ ను ఇప్పటికే ప్రకటించారు. ఏడాదికి థీమ్ వచ్చి 'ఎంబ్రేస్ ఈక్విటీ' (Embrace Equity). అంటే 'లింగ సమానత్వంపై దృష్టి పెట్టండని అర్ధం. అయితే నిజంగా ఇది ఆచరణలో మాత్రం అమలు కావడం లేదంటే అతిశయోక్తి కాదు. భూదేవికి ఉన్నంత ఓర్పు ఉన్న మహిళలు మగవారి దురహంకారానికి బలైపోతూనే ఉన్నారు. ఎక్కడ చూసినా మహిళలపై దాడులు (Attacks on Women), నీచ ఆకృత్యాలు నిత్యకృత్యమై పోయాయి. వరకట్న చావులు (Dowry Deaths), అత్యాచారాలు (Rapes), యాసిడ్ దాడులు (Acid Attacks) ఎన్నో రకాల ఆకృత్యాలకు మహిళలు బలైపోతున్నారు.

 

సమాజ అభివృద్ధికి (For Development of Society) తాము సైతం అంటూ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయినప్పటికీ మగవారితో సమానమైన గౌరవం, అవకాశాలు మాత్రం మహిళలకు లభించడం లేదు. అన్ని రంగాల్లోనూ (In all fields) మహిళల భాగస్వామ్యాన్ని కల్పించడానికి, ప్రోత్సాహించడానికి అంతర్జాతీయం మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఏడాది మార్చి 8 జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం 111వది కావడం గమనార్హం. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు (All Countries) మహిళలకు అన్ని రంగాల్లోనూ స్థానం కల్పిస్తున్నారు. అయినప్పటికీ మహిళలకు పురుషులతో సమానంగా గౌరవం లభించడం లేదనే చెప్పవచ్చు. ఇప్పటికీ మహిళలను వంటింటి కుందేళ్ళు గానే పరిగణించడం... బానిసలుగానే (Treating as a Slaves) చూడడం జరుగుతోంది. ఆదిమ కాలంలో (In primitive times) ఆడవారిదే ఆధిపత్యం. అయితే కాలంతో పాటుగా వారిని అణగద్రొక్కుతూ పురుషాధిపత్యం (Male Dominance) చెలాయించడం మొదలయింది.

 

మహిళా దినోత్సవాన్ని మార్చి 8 ఎందుకు? : Why Women's Day on March 8th?

1908 సంవత్సరంలో అమెరికాలోని శ్రామిక మహిళలు (Working Womens) తమ హక్కుల (Their Rights) కోసం గట్టి ఉద్యమాన్ని (Started a movement) చేపట్టారు. ఉద్యమంలో లక్షలాది మంది మహిళలు పాల్గొన్నారు. దీని ప్రభావం రష్యాపై పడింది. అక్కడి మహిళలు కూడా ఉద్యమం చేపట్టడంతో నికోలస్ (Nicholas) చక్రవర్తి తన పదవికి రాజీనామా (Resignation) ప్రకటించారు. సమయంలోనే రష్యా మహిళలకు ఓటు హక్కు లభించింది. 1911లో మొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకొన్నారు. 1913లో, అంతర్జాతీయ మహిళా దినోత్సవం తేదీని మార్చి 8కి (March 8th) మార్చారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది (Every Year) అదే రోజున నిర్వహిస్తున్నారు.

ఇంకా వివక్షలోనే మహిళలు : Women are still discriminated

సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత శిఖరాల్లో నిలిచిన మహిళలకు ఇంకా లింగ వివక్ష, హింస, దురాగతాలు తప్పడం లేదు. మహిళా దినోత్సవం జరుపుకోవటం ప్రారంభమై 100ఏళ్లు (More than 100 years) దాటింది. అయినప్పటికీ ఇంకా మహిళలు పోరాడి సాధించుకున్న హక్కులు కూడా దక్కకపోవటం విచారకరమనే చెప్పాలి. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్(United Nations Secretary General Antonio Guterres) విడుదల చేసిన వాస్తవాల నివేదిక (Fact Sheet) అందరినీ వొళ్ళు గగుర్పొడిచేలా చేసింది. నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 11 నిముషాలకు (Every 11 minutes) ఒక మహిళ లేదా బాలిక తన జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు (Murder) గురవుతున్నట్లు వెల్లడించారు.

 

రోజుకు సగటున 86 మందిపై అత్యాచారం : 86 Women's are raped daily 

భారతదేశంలో (In India) పరిస్థితి చాలా ఘోరంగా వుంది. నేషనల్క్రైమ్బ్యూరో (National Crime Bureau) 2021 ప్రకారం, ప్రతి రోజూ సగటున (On average everyday) 86 మంది మహిళలు అత్యాచారానికి (Rape) గురవుతున్నారు. మహిళలపై జరుగుతున్న 49 నేరాలు ఐపీసీ (IPC) కింద నమోదు అవుతున్నాయి. ప్రతి రోజూ వరకట్న వేధింపుల కింద సగటున 18 మంది మహిళలు (18 women on average under dowry harassment) తమ ప్రాణాలను కోల్పోతున్నారు. 2021 సంవత్సరంలో 6,589 వరకట్న మరణాలు నమోదయ్యాయి. ఇవి కేవలం నమోదైన కేసులు మాత్రమే. వెలుగులోనికి రానివి వీటికంటే ఎక్కువే ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం మూడో వంతు మంది మహిళలు గృహ హింస లేదా లైంగిక హింసను (A third of women facing domestic or sexual violence) ఎదుర్కొంటున్నామని తెలియజేయడం మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు నిదర్శనం.

భారత్ లో లింగ అసమానత సూచిక : Gender Inequality Indicators in India

ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) రూపొందించిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ - 2022 (Global Gender Gap Index – 2022) సూచికలో 146 దేశాల్లో భారత్ 135 స్థానంలో నిలిచింది. 2014 లో 114 స్థానం.

దేశ ఆర్థిక వ్యవస్థలో లింగపరమైన దూరానికి సంబంధించి సూచిక ప్రకారం భారత్ స్కోర్ 0.849 గా ఉంది.

యూఎన్డీపీ (United Nations Development Program) వారు రూపొందించిన లింగ సంబంధిత అభివృద్ధి భారత్ (Gender Related Development India GDI) – 2022లో భారత్ 122 స్థానంలో నిలిచింది.

 

మహిళలపై నేరాల రేటు NCRB డేటా : Crime rate against women NCRB Data 

2019లో మహిళలపై నేరాల సంఖ్య 4,05,326.

2020లో హిళపై రిగిన నేరాల సంఖ్య 3,71,503.

అధికారిక లెక్కల ప్రకారం 2021 సంవత్సరంలో హిళపై 4,28,278 నేరాలు జరిగినట్లు నమోదయ్యాయి. రాజస్థాన్ లో ఒక క్ష నాభాకు రేప్ క్రైమ్ 16.4%, చండీగఢ్లో 13.3%, ఢిల్లీలో 12.9%, రియాణాలో 12.3% క్రైమ్ రేట్ ఉందని NCRB వెల్లడించింది. జాతీయ టు 4.8 గా ఉంది. అంటే వెలుగులోనికి రాని నేరాల సంఖ్య భారీగానే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తంగా క్ష నాభాకు హిళపై నేరాల రేటు 64.5%.

 

అత్యాచార కేసులు : Rape Cases

అత్యాచార కేసుల్లో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో 2021లో 6,337 రేప్లు రిగాయి. ధ్యప్రదేశ్లో 2,947, ఉత్తప్రదేశ్లో 2845 అత్యధికంగా నమోదయ్యాయి. అతి తక్కువగా ఢిల్లీలో 1250 అత్యాచార కేసులు నమోదయ్యాయి.

మహిళలే మానవాళికి జీవనాధారం : Women are the lifeblood of mankind

మహిళలే లేకపోతే మానవ మనుగడే (Human survival) లేదు. అటువంటి మహిళల పట్ల చూపిస్తున్న వివక్ష, వారిపై జరుపుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత: ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని ఆర్యోక్తి. అటువంటి సమాజంలో స్త్రీలకి దక్కుతున్న విలువ ఏమిటనేది ప్రతి ఒక్కరం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సమసమాజ స్థాపనలో మగవారితో పోటీ పడుతూ అంతరిక్షంపైన కూడా కాలు మోపిన స్త్రీల పట్ల మన దృక్పధం ఏమిటి? 100 సంవత్సరాల నుంచి కేవలం ఒక ఉత్సవంగా జరుపుకుంటున్న మహిళా దినోత్సవం (Women’s day) మహిళలకు ఏమి సౌకర్యం కల్పించింది? వారికి కల్పిస్తున్న స్థానం ఏమిటి? స్త్రీలపై జరుగుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసి వారికి ఒక సముచిత స్థానాన్ని కల్పిస్తే అదే నిజమైన మహిళా దినోత్సవంగా చెప్పవచ్చు. స్త్రీ మూర్తులకు మనం నిజంగా గౌరవాన్ని ఇస్తున్నామా? వారికి కల్పించాల్సిన సౌకర్యాలను అందిస్తున్నామా? లేక కేవలం వారిని ఆటబొమ్మలుగానే చూస్తున్నామా? స్త్రీలను గౌరవిద్దాం (Let us respect the women.).

 

అపరాజిత స్తోత్రం : Aparajita Stotra

యా దేవీ సర్వభూతేషు విష్ణు మాయెతి సబ్ధితా |

నమస్తస్యై, నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

 

యా దేవీ సర్వభూతేషు చేతనేత్యాభిధియాతే |

నమస్తస్యై, నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

 

యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిథామ్ |

నమస్తస్యై, నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

 

యా దేవీ సర్వభూతేషు నిధ్రా రూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

 

యా దేవీ సర్వభూతేషు క్షుధా రూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

 

యా దేవీ సర్వభూతేషుచ్చాయా రూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

 

యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

 

యా దేవీ సర్వభూతేషు తృష్ణా రూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

 

యా దేవీ సర్వభూతేషు క్షాంతి రూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ||

 

యా దేవీ సర్వభూతేషు జాతి రూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు లజ్జా రూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ||

 

యా దేవీ సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ||

 

యా దేవీ సర్వభూతేషు శ్రాద్ధా రూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ||

 

యా దేవీ సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ||

 

యా దేవీ సర్వభూతేషు లక్ష్మి రూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ||

 

యా దేవీ సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ||

 

యా దేవీ సర్వభూతేషు మృతి రూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ||

 

యా దేవీ సర్వభూతేషు ద్ధయా రూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ||

 

యా దేవీ సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ||

 

యా దేవీ సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ||

 

యా దేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ||

 

యా దేవీ సర్వభూతేషు బ్రాంతి రూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ||

 

ఇంధ్రియాణామధిష్ఠాత్రి భూతానాం చాఖిలేశు

యా భూతేషు సతతం తస్యై వ్యాప్యై దేవ్యై నమో నమః ||

 

చిత్తి రూపేణ యా కృత్స్నం యేతాధ్ వ్యాప్య స్థితా జగత్ |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

స్తుతా సురైః పూర్వహ్ మభేష్ఠ సమ్శ్రాయా ||

 

తధా సురేన్ధ్రేణా ధినేషు సేవిత |

కరొటు సా నః శుభహేతు రీశ్వ్రతి

శుభాని భాధ్రాంవభిహన్తు చాపదాహ్ ||

ఓం ధూర్గమాత స్వరూపాయ అపరాజితమాతాయై నమో హమహ్ ||