ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం : A terrible train accident in Odisha

ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో గూడ్స్ రైలును కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (Coromandel Express) ఢీకొన్న విషయం తెలిసిందే. దీంతో చెన్నై కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 13 బోగీలు పట్టాలు తప్పాయి

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం : A terrible train accident in Odisha

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం : A terrible train accident in Odisha 

ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో గూడ్స్ రైలును కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (Coromandel Express) ఢీకొన్న విషయం తెలిసిందే. దీంతో చెన్నై కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 13 బోగీలు పట్టాలు తప్పాయి. కోరమండల్‌ రైలు బోగీలపై యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్ (Yashwanthpur Express) దూసుకెళ్లింది. ఘటనలో యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ 4 బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనాస్థలంలో 200 అంబులెన్స్‌లు సహాయక చర్యలు అందిస్తున్నాయి.

278 కి చేరిన మృతుల సంఖ్య : Death toll rises to 278 

కోరమాండల్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఒక గూడ్సు ఢీకొట్టిన ఘటనలో మృతుల సంఖ్య 278 కి చేరుకుంది. ఇప్పటి వరకూ ఈ ప్రమాదంలో 900 మందికి పైగా గాయపడ్డారు.  వీరిలో 400 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.  ప్రమాదానికి గురైన బెంగళూరు- హౌరా యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో 994 మంది ప్రయాణికులు రిజర్వేషన్ టిక్కెట్లు బుక్ చేసుకోగా... మరో 300 మంది అన్-రిజర్వుడు ప్రయాణికులు ఎక్కినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థికసాయం, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఘటన ప్రాంతంతో పాటు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. సంఘటన పూర్తి వివరాలను అధికారులనుండి అడిగి తెలుసుకున్నారు.

భారత్ లో జరిగిన రైలు ప్రమాదాలు : Train accidents in India 

  • 1956 లో మహబూబ్‌నగర్‌లో గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదం జరిగి 112 మంది మరణించారు.
  • 1956లో తమిళనాడులో అరియలూర్ వద్ద వరదలకు వంతెన కొట్టుకుపోవడంతో మద్రాస్ ట్యూటికోరన్ ఎక్స్‌ ప్రెస్ నదిలో పడి 156 మంది మరణించారు. ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూనే అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారు.
  • 1981 జూన్ 6న బీహార్‌లోని సమస్తిపూర్ వద్ద భాగమతి నదిలో రైలు పడి భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అనధికారికంగా మొత్తం 800 మంది చనిపోయుంటారని అంచనా వేశారు. ఆ నదిలో నుంచి 212 మృతదేహాలను వెలికి తీశారు. ఇది భారత రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం.
  • 1987 జూలై 8న ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల వద్ద దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 53 మంది మరణించారు. ఇదే ఏడాది తమిళనాడులోని అరియలార్ వద్ద నదిలో రాక్‌ఫోర్ట్ రైలు పడిన దుర్ఘటనలో 75 మంది మరణించారు.
  • 1988 జూలై 8న బెంగళూరు త్రివేండ్రం ఐస్‌లాండ్ ఎక్స్‌ప్రెస్ కేరళలో పట్టాలు తప్పి ఒక సరస్సులో పడడంతో 107 మంది మరణించారు.
  • 1990 జూన్ 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గొల్లగూడలో జరిగిన ప్రమాదంలో 36 మంది మరణించారు.
  • 1990 అక్టోబర్ 9న కాకతీయ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • 1992 ఏప్రిల్ 7న తెనాలి వద్ద బిట్రగుంట-విజయవాడ ప్యాసింజర్ రైలు ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • 1994 మే 3న నల్గొండ జిల్లాలో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ఒక ట్రాక్టర్‌ను ఢీకొన్న దుర్ఘటనలో 35 మంది మరణించారు.
  • 1995 ఆగస్టు 20న పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ – కాళింది ఎక్స్‌ప్రెస్‌లు ఢీ కొనడంతో 302 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇది దేశంలో జరిగిన రెండో అతిపెద్ద రైల్వే ప్రమాదం.
  • 1998 నవంబర్ 26న పంజాబ్‌లో జమ్ముతావి – సీల్దా రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో  212 మంది మరణించారు.
  • 1999 ఆగస్టు 2న బెంగాల్‌లో అవధ్ ఎక్స్‌ప్రెస్ – బ్రహ్మపుత్ర మెయిల్‌లు ఒకే ట్రాక్‌పైకి వచ్చి ఢీ కొనడంతో 288 మంది ప్రాణాలను కోల్పోయారు. 
  • 2002లో హౌరా రాజధాని రైలు బీహార్ వద్ద ధావి నదిలో పడిపోవడంతో 130 మంది మరణించారు.
  • 2002 డిసెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా రామలింగాయపల్లి వద్ద కాచిగూడ బెంగళూరు రైలు పట్టాలు తప్పడంతో 20 మంది మరణించారు.
  • 2003 జనవరి 3న కాచిగూడ-మన్మాడ్ ఎక్స్‌ ప్రెస్ మహారాష్ట్రలో ఆగి ఉన్న రైలు పైకి దూసుకెళ్లిన దుర్ఘటనలో 20 మంది మరణించారు.
  • 2003 జూలై 2న గోల్కొండ ఎక్స్‌ప్రెస్ కి బ్రేక్ ఫెయిలవడంతో వరంగల్ స్టేషన్ వద్ద పట్టాలు తప్పి, రోడ్డుపై తిరగబడిన సంఘటనలో 21 మంది మరణించారు.

  • 2005 అక్టోబర్ 29 న రేపల్లె-సికిందరాబాద్ ప్యాసింజర్ రైలు నల్గొండ జిల్లా రామన్నపేట వలిగొండ మధ్య పట్టాలు తప్పడంతో 115 మంది మరణించారు.
  • 2006 జూలై 11న ముంబయి లోకల్ రైళ్లలో ఏడు బాంబులు పేలి 181 మంది మరణించారు. 900 మంది గాయాలపాలయ్యారు.
  • 2006 డిసెంబర్ 2న బీహార్‌లో భాగల్పూర్ వద్ద 150 సంవత్సరాల నాటి పాత వంతెన రైలుపై కూలడంతో 47 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • 2007 ఫిబ్రవరి 18న సంఝౌతా ఎక్స్‌ప్రెస్ లో జరిగిన పేలుళ్ళలో 68 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • 2008 ఆగస్టు 1న వరంగల్ జిల్లాలో గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన ఘటనలో 31 మంది మరణించారు.
  • 2009 ఫిబ్రవరి 14న హౌరా నుంచి చెన్నై వెళ్లే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కి చెందిన 14 కోచ్‌లు ఒడిశాలోని జాజ్పూ‌ర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పడంతో 16 మంది మరణించగా, 50 మందికి గాయాలయ్యాయి.
  • 2010 మే 28న బెంగాల్‌లో జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన తర్వాత గూడ్స్ రైలు దూసుకొచ్చి ఢీకొన్న ఘటనలో 150 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • 2012 మే 22న అనంతపురం పెనుకొండలో హంపి ఎక్స్‌ప్రెస్‌ కి జరిగిన ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • 2012 జూలై 30 నెల్లూరులో అర్ధరాత్రివేళ తమిళనాడు ఎక్స్‌ప్రెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 47 మంది మరణించారు.
  • 2013 ఆగస్టు 19న బిహార్ లోని ధమరా ఘాట్ స్టేషన్లో సహర్స రైలు ఢీకొన్న దుర్ఘటనలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • 2013 డిసెంబరు 28న ఆంధ్రాలోని కొత్త చెఱువు వద్ద బెంగళూరు నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడంతో 26 మంది చనిపోయారు

  • 2014 మేలో దివ జంక్షన్-సవాత్వాడి స్టేషన్ మధ్య పాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • 2014 మే 26 న యూపీలోని చురేబ్ రైల్వే స్టేషన్లో గోరక్ ధామ్ ఎక్స్ ప్రెస్ గూడ్స్‌ రైలును ఢీకొనడంతో 25 మంది మరణించారు.
  • 2014 జూలై 23న మెదక్ జిల్లాలో ట్రాక్ క్రాస్ చేస్తున్న స్కూల్ బస్సును నాందేడ్ సికిందరాబాద్ ఎక్స్ ప్రెస్ ఢీకొనడంతో 20 మంచి ప్రాణాలు కోల్పోయారు.
  • 2015 మార్చిలో డెహ్రాడూన్ వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్ రాయబరేలి, యూపీ వద్ద పట్టాలు తప్పిన దుర్ఘటనలో 58 మంది మరణించారు.
  • 2015 ఆగస్టులో మధ్య ప్రదేశ్‌లో కామయాని ఎక్స్‌ప్రెస్, జనతా ఎక్స్‌ప్రెస్ పట్టాల తప్పడంతో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • 2016 నవంబరులో యూపీ పుఖ్రయాన్ వద్ద ఇండోర్-రాజేంద్ర నగర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 150 మంది మరణించారు.
  • 2017 జనవరిలో హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ విజయనగరం వద్ద పట్టాలు తప్పడంతో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • 2017 ఆగస్టులో యూపీ ముజఫర్ నగర్ వద్ద కళింగ ఉత్కల ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో 23 మంది మరణించారు.
  • 2018 అక్టోబరులో అమృత్ సర్ లో దసరా చూస్తోన్న జనాల పైకి రైలు దూసుకెళ్లడంతో 59 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • 2020 మేలో జాల్నా వద్ద ట్రాక్ మీద పడుకున్న వలస కూలీలపైకి రైలు దూసుకెళ్లడంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు