'మిరల్' మూవీ రివ్యూ : 'Miral' movie review

ప్రేమిస్తే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన భరత్ (Hero Bharat) ఈ చిత్రంలో చేసిన నటన ప్రేక్షకుల్ని మెప్పించిందా... ప్రేక్షకుల్ని హారర్ సీన్లు భయపెట్టేలా ఉన్నాయా..

'మిరల్' మూవీ రివ్యూ : 'Miral' movie review

'మిరల్' మూవీ రివ్యూ : 'Miral' movie review

గత వారం థియేటర్స్ లోకి మరీ చెప్పుకోదగ్గ పేరున్న చిత్రాలు రాలేదు. వచ్చిన కొన్ని చిత్రాల్లో తమిళ భాష నుంచి తెలుగులోకి అనువదింపబడిన “మిరల్” మూవీ ఒకటి. థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ చిత్రం ఒరిజినల్ గా 2022 లో విడుదల అయింది. అయితే ఇప్పుడు తెలుగులో ఈ ఏడాదిలో వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో, నటీనటుల పెర్ఫార్మెన్స్, సాంకేతిక విలువల గురించి ఈ సమీక్షలో చూద్దాం. ప్రేమిస్తే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన భరత్ (Hero Bharat) ఈ చిత్రంలో చేసిన నటన ప్రేక్షకుల్ని మెప్పించిందా... ప్రేక్షకుల్ని హారర్ సీన్లు భయపెట్టేలా ఉన్నాయా... ఒకసారి సమీక్షిద్దాం.

 

చిత్రం కథ : Movie Story

ఇక కథలోకి వస్తే... రమ (వాణి భోజన్) కి ఓ ప్రమాదం నుంచి తప్పించుకున్న తన భర్త హరి (భరత్) విషయంలో ఆమెని కొన్ని పీడకలలు తరచుగా వెంటాడుతూ ఉంటాయి. ఈ క్రమంలో రమా తన తల్లి మాట మేరకు తన సొంతూరికి వెళ్లి అక్కడ తమ ఆచారాల ప్రకారం కొన్ని పనులు చేస్తే ఇవన్నీ ఆగుతాయని చెప్పడంతో తల్లి మాట ప్రకారం తన వూరికి వెళ్తుంది. అయితే ఓరోజు హరి ఫోన్ చేసి భార్యను వెనక్కి వచ్చేయమని చెబుతాడు. ఈ క్రమంలో తిరిగి ఇంటికి వస్తుండగా వారి కుటుంబానికి పదేళ్ల కితం ఓ గ్రామంలో జరిగిన ఘటన తరహాలో మళ్ళీ జరుగుతుంది. అసలు అక్కడేం జరుగుతుంది... హరి ఇంకా తన కుటుంబం మళ్ళీ తిరిగి సురక్షితంగా వెనక్కి తిరిగి వచ్చారా లేదా అనేది మిగతా సినిమా కథ.

 

తన బావను కాకుండా రమ (వాణి భోజన్) తాను ప్రేమించిన హరి (భరత్)‌ ను పెళ్లి చేసుకొంటుంది. అయితే తమ ఇష్టాలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడంతో కూతురుపై తండ్రి (కేఎస్ రవికుమార్) కోపంగా ఉంటాడు. అయితే తన భర్త చనిపోయినట్టుగా రమను పీడకలలు వెంటాడుతుంటాయి. దాంతో తమ గ్రామానికి వచ్చి అమ్మవారికి పూజలు చేయాలని రమ, హరిని పిలుస్తుంది. అయితే రమ పెళ్లి తర్వాత మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు, కూతురిని ఆమె తండ్రి ఎలా ట్రీట్ చేశాడు? గ్రామానికి వచ్చి పూజలు చేసిన తర్వాత రమ, హరికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ పరిస్థితులను హరి ఎలా ఎదుర్కొన్నాడు? గ్రామం నుంచి తిరిగి ఇంటికి  వెళ్తుంటే... దెయ్యాలు ఎలా వెంటాడాయి? అవి నిజంగా దెయ్యాలేనా? లేక ఎవరైనా నాటకం ఆడారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మిరల్ సినిమాను చూడాల్సిందే.

 

హారర్, ఘోస్ట్ ఎలిమెంట్స్‌ పాయింట్స్‌తో రాసుకొన్న కథ బాగుంది. కానీ ప్రీ క్లైమాక్స్‌ నుంచి క్లైమాక్స్ వరకు గజిబిజిగా సాగే స్క్రీన్ ప్లే సినిమా చూసే ప్రేక్షకులను కొంత గందరగోళానికి గురిచేస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ వరకు కేవలం మూడు క్యారెక్టర్లతో ఒకే ప్లేస్‌లో కథను నడిపించిన తీరు బాగుంది. అయితే క్లైమాక్స్ ట్విస్టు ఎమోషనల్‌గా అంతగా ఆకట్టుకోకపోవడమే కాకుండా.. అప్పటి వరకు ప్రేక్షకుల్లో ఉండే ఫీల్‌ను చల్లారేలా చేస్తుంది.

 

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే... 'ప్రేమిస్తే' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన భరత్ ఈ సినిమాలో ఓ ఎమోషనల్ పాత్రలో మొత్తం సినిమాను  తన భుజాల మీద వేసుకొని నటించాడు. అడవిలో తన కుటుంబాన్ని రక్షించుకునే క్రమంలో చేసిన సీన్ చక్కగా ఆకట్టుకొనేలా ఉంటుంది. భార్యకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకొనే క్యారెక్టర్‌లో మరోసారి మంచి నటనను ప్రదర్శించాడు. ఇక వాణి భోజన్ గ్లామర్‌కు ఆస్కారం లేనప్పటికీ, చక్కటి  ఫెర్పార్మెన్స్ రోల్‌లో ఒదిగిపోయింది. కేఎస్ రవికుమార్, మాస్టర్ అంకిత్ తదితరులు తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.

 

సాంకేతిక విభాగం : Technical Team

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే... సినిమాటోగ్రాఫర్ (cinematographer) బాలా సన్నివేశాలను చిత్రీకరించిన తీరు.. అలాగే ఆ సీన్లలో హారర్ నింపిన తీరు బాగుంది. సంగీత దర్శకుడు (Music Director) ప్రసాద్ ఎస్ఎన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరింత హారర్‌గా చూపించేలా చేసింది. సతీష్ కుమార్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథలో సరైన వెరైటీ లేకపోవడం వల్ల సినిమా కొంత సాగదీసినట్టు ఉండటం మైనస్ అని చెప్పవచ్చు. ఇది ప్రేక్షకులని నిరాశ పరిచింది. హరర్, ఫ్యామిలీ ఎమోషన్స్ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుందని చెప్పవచ్చు.

 

ఈ చిత్రంలో థ్రిల్ కలిగించే అంశాలు మరీ అంత ఎక్కువేమీ లేవు. కానీ, స్టోరీ లైన్ ఫరవాలేదు అనిపిస్తుంది. అయితే దానిని తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల్ని మెప్పించదు. అలాగే చిత్రం యొక్క కథలో ప్రధాన అంశం ఏంటి అనేది మొదటి 15 నిమిషాల్లోనే ప్రేక్షకులకి అర్ధం అయిపోతుంది. ఇంకా సినిమాని కూడా సాగదీతగా బోర్ కొట్టించే సన్నివేశాలతో లాగారు. అలాగే హారర్ సన్నివేశాలు ఏమాత్రం భయపెట్టేవిగా అనిపించవు. తెలుగు డబ్బింగ్ ఏమాత్రం బావుండక పోవడం మైనస్ అని చెప్పవచ్చు. ఆయా పాత్రలకి చేసిన డబ్బింగ్ పనులు చాలా నాసిరకంగా చేశారు.

 

నటీనటులు (Actors) : ప్రేమిస్తే భరత్, వాణి భోజన్, కేఎస్ రవికుమార్, మీరా కృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు

దర్శకత్వం (Director):  ఎం శక్తివేల్

నిర్మాత (Producer) : సీహెచ్ సతీష్ కుమార్

మ్యూజిక్ డైరెక్టర్ (Music Director) : ప్రసాద్ ఎస్ఎన్

సినిమాటోగ్రాఫర్ (Cinematographer) : సురేష్ బాలా

ఎడిటర్ (Editor) : కలైవనన్ ఆర్