రంగుల హోళీ : festival of colors holi

కులమతాలకు అతీతంగా యావత్ భారతదేశంలో (entire India) అందరూ ఒక్కటై జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది రంగుల కేళీ 'హోళీ' (Holi) మాత్రమే. చిన్నా, పెద్ద, కుల, మత, వయో బేధం లేకుండా ప్రతి ఒక్కరూ రంగుల్లో మునిగి తేలియాడే ఏకైక పండుగ.

రంగుల హోళీ : festival of colors holi

రంగుల హోళీ : festival of colors holi

కులమతాలకు అతీతంగా యావత్ భారతదేశంలో (entire India) అందరూ ఒక్కటై జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది రంగుల కేళీ 'హోళీ' (Holi) మాత్రమే. చిన్నా, పెద్ద, కుల, మత, వయో బేధం లేకుండా ప్రతి ఒక్కరూ రంగుల్లో మునిగి తేలియాడే ఏకైక పండుగ.

 

భారతీయ సంప్రదాయం (Indian tradition) ప్రకారం ప్రతి ఏడాది పాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు హోళీ పండుగను జరుపుకుంటారు. హోళీ పూర్ణిమను (Holi Purnima) కాముని పున్నమిగా కూడా పిలుస్తుంటారు. పౌర్ణమికి ముందు రోజు రాత్రి అన్ని గ్రామాల నుండి సేకరించిన పిడుకలతో కాముడి దహనాన్ని నిర్వహిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఆయా ప్రాంతాలకు సంబంధించిన సంప్రదాయాల (traditions) ప్రకారం వివిధ సందర్భాలను పురస్కరించుకుని హోళీ పండుగను జరుపుకుంటారు.

వసంతోత్సవం : spring festival

ఫాల్గుణ మాసం (The month of Falguna) పున్నమి రోజున జరుపుకునే పండుగ కనుక ఫాల్ఘుణోత్సవమని... వసంతఋతువును స్వాగతించే వేడుక కాబట్టి వసంతోత్సవమని కూడా పిలుచుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (Andhra, Telangana) రాష్ట్రాల్లో కాముని పున్నమి (Kamuni purnima) పేరుమీద వేడుకలను జరుపుకుంటారు. తమిళనాడులో (Tamilnadu) 'కామిక్ పండిగె' (Kamik pandige), కర్ణాటకలో (Karnataka) 'కామన హబ్బ' (Kamana Habba) గా పిలుస్తారు. మదన దహనం, అనంతరం పునరుజ్జీవుడు కావడాన్ని పురస్కరించుకుని హోళీ వేడుకలను జరుపుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో (Northern states) హోళీని ఘనంగా నిర్వహిస్తారు. పండుగకు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత (very famous) ఉంది.

 

హోళీ పురాణ గాథ : holi mythical story

హోళీ పండుగ జరుపుకోవడం వెనుక ఎన్నో పురాణం గాథలు ఉన్నాయి. యోగ నిష్టలో ఉన్న పరమ శివుని (Lord Shiva) తపస్సును భంగం చేయమని దేవతలు అందరూ కలిసి మన్మథుడిని కోరతారు. అప్పుడు మన్మథుడు (Manmatha) పరమేశ్వరునికి తపోభంగం కలిగించడానికి ఆయన మీదకి తన పూలబాణాన్ని సాధిస్తాడు. దీంతో ఆగ్రహించిన పరమశివుడు తన మూడో కంటిని (third eye) తెరిచి మన్మథుడిని బూడిద చేస్తాడు. మన్మథుడి భార్య రతీదేవి శివుడిని తన భర్త చేసిన తప్పిదాన్ని మన్నించమని వేసుకోవడంతో ఆదిదేవుడి మనస్సు కరిగి మన్మథుడు రతీదేవికి మాత్రమే కనిపించేలా వరం ప్రసాదిస్తాడు. దీంతో మన్మథుడు తిరిగి రతీదేవికి దక్కాడు.

మరో కథ...

హోళీ పండుగను జరుపుకోవడానికి ఇంకో ప్రాముఖ్యమైన కథ కూడా ఉందని చెబుతారు. పూర్వం రఘుమహారాజు కాలంలో హోలిక అనే రాక్షసి (Demon name of Holika) రాజ్యమంతా తిరుగుతూ పసిపిల్లలను చంపుతుండేది (killing the childrens). దీంతో యోగి ఒక వృద్ధురాలికి సలహా ఇస్తాడు. దీని ప్రకారం వృద్ధురాలు పిల్ల చేత హోలికా రాక్షసిని తిట్లు తినిపించిందంట. తిట్లను భరించలేక హోలిక చనిపోయింది. దీంతో గ్రామస్తులందరూ కలిసి హోలిక శరీరాన్ని దహనం చేసి పండుగ చేసుకున్నారట. అందుకే దీన్ని హోలికా దహనమని (Holika burning) పిలుస్తూ సంప్రదాయాన్ని ఇప్పటికీ జరుపుకుంటున్నట్లు చెబుతారు.

 

16 రోజుల వేడుకలు : 16 days celebrations

చిన్నారి కృష్ణుడు (Srikrishna) తన శరీరపు రంగు, రాధ శరీరపు రంగు మధ్య ఎందుకురా అంత వ్యత్యాసముందని తల్లి యశోదను అడుగుతాడు. దీంతో యశోద రాధను తన ముఖానికి రంగు వేసుకోమని కోరిందంట. దీంతో అలా హోళీ ప్రసిద్ధి చెందింది. శ్రీ కృష్ణుడు పెరిగిన మధుర, బృందావనంలో (Mathura, Vrindavan) ఇప్పటికీ 16 రోజులపాటు హోళీ వేడుకులను (16 days Holi celebrations) జరుపుకునే సంప్రదాయం నడుస్తోంది. వేడుకులకు భారతదేశం నుంచే కాకుండా, ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వేడుకులకు లక్షలాది మంది హాజరవుతారు.

వాడుకలో ఉన్న మరో కథ : another story is...

కథలే కాకుండా మరో కథ కూడా వాడుకలో ఉంది. పార్వతి (Parvathi) పరమ శివుడిని పెళ్లి చేసుకోవాలని భావించి అందుకు సహాయం చేయాల్సిందిగా కామదేవుడికి తెలుపుతుంది. దీంతో కామదేవుడు తపోదీక్షలో ఉన్న శివుడి తపస్సును (penance) భంగ పరచాలనుకుంటాడు. అందుకోసం శివునిపై పూల బాణాన్ని వదులుతాడు. దీంతో శివుడు తన మూడో కంటిని తెరిచి కామదేవుడిని భస్మం చేస్తాడు. కామదేవుని భార్య రతీదేవి (Rathidevi) పరమేశ్వరుడిని తన భర్తను బ్రతికించమని వేడుకుంటుంది. దీంతో రతీదేవి కోరికను మన్నించి శివుడు తిరిగి కామదేవుడిని బ్రతికిస్తాడు. ఘటన జరిగిన రోజుని పురస్కరించుకుని హోళీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా హోళీ వేడుకలు నిర్వహిస్తారు. హోళీ పండుగకు ఎన్నో గాథలు ఉన్నప్పటికీ ప్రకృతి పులకించే వసంతఋతువులో (Spring season) ప్రజలంతా ఎంతో ఉత్సాహంతో వసంతోత్సవాన్ని జరుపుకుంటారు.

 

ప్రతి ఒక్కరూ రంగులు జల్లుకుంటూ (colors) ఎంతో ఉత్సాహంగా హోళీ వేడుకలు చేసుకుంటారు. రెండు రోజుల పాటు జరిగే వేడుకల్లో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ పాల్గొంటారు. దక్షిణాదిన ప్రసిద్ధమైన తిరుపతి బాలాజీ మందిరంలో (Tirupati Balaji Temple) వసంతఋతువులో జరిగే వసంతోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది ఉత్సవాలను తిలకించేందుకు తిరుమల చేరుకుంటారు. స్వామి వారికి అభిషేకాలు చేస్తారు.