బాలికల కోసం'కన్యాదాన్ పాలసీ' : LIC’s 'Kanyadan Policy' for Girls

పేదరికంలో మగ్గే కుటుంబాల్లోని బాలికల చదువు, వివాహ ఖర్చుల కోసం భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) ప్రవేశ పెట్టిన పథకమే 'కన్యాదాన్ పాలసీ' (Kanyadan Policy).

బాలికల కోసం'కన్యాదాన్ పాలసీ' : LIC’s 'Kanyadan Policy' for Girls

పేదరికంలో మగ్గే కుటుంబాల్లోని బాలికల చదువు, వివాహ ఖర్చుల కోసం భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) ప్రవేశ పెట్టిన పథకమే 'కన్యాదాన్ పాలసీ' (Kanyadan Policy). భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) భారత దేశంలోని పౌరుల కోసం ఎన్నో విశిష్టమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ముఖ్యంగా పోస్టాఫీస్, ఎల్‌ఐసీ వంటి స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. ఈ పథకాల వల్ల ఆయా కుటుంబంలోని పిల్లలకు ఎంతో రక్షణను కల్పిస్తోంది. కేంద్రం ప్రవేశ పెట్టిన ఈ కన్యాదాన్ పాలసీ వల్ల చదువు, వివాహ ఖర్చులతో బాలికలకు ఆర్ధిక తోడ్పాటును ఈ పాలసీ కల్పిస్తోంది. ఈ పాలసీకి సంబంధించిన వివరాలు అంటే... ఈ పాలసీ ఫీచర్లు, ప్రయోజనాలు, మెచ్యూరిటీ అమౌంట్ వంటి పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.

నేటి కాలంలో ఎవరి చేతిలో అయినా డబ్బులు ఉన్నట్లయితే సాధారణంగా అధిక సంఖ్యలో ప్రజలు బ్యాంక్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు (fixed deposits) చేస్తుండడం మనం చూస్తున్నాము. దీంతో పాటుగా స్టాక్ మార్కెట్లలో సైతం పెట్టుబడులు పెట్టడం, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుండడం జరుగుతోంది. దీంతో ఆయా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పథకాలు (schemes) తీసుకొస్తూ వినియోగదారులను (customers) ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. వినియోగదారులు కోరుకుంటున్న విధంగా వారికి అనుకూలమైన ఫీచర్లతో కూడిన పథకాలు నేడు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఈ పథకాలు ప్రధానంగా చదువు, వైద్యం, వివాహం వంటి ముఖ్యమైన అవసరాలు తీర్చి వారికి పెద్ద మొత్తంలో నగదు అందేలా ఉంటున్నాయి.

దీంతో పాటు భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) కూడా కొన్ని అద్భుతమైన పథకాలను అందుబాటులో ఉంచింది. ఇందులో బాగా ప్రాచుర్యం పొంది అందరికీ ఉపయోగకరంగా ఉంటున్న పాలసీయే 'కన్యాదాన్ పాలసీ' (Kanyadan policy). ఇందులో ఎన్నో అదద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ పాలసీని ఎల్‌ఐసీ (LIC) సేవింగ్స్ ప్లాన్ కింద ప్రవేశ పెట్టింది. ఆడపిల్లల చదువు, పెళ్లి ఖర్చులకు అండగా ఆర్థికంగా ఉండేలా ఈ పాలసీని రూపొందించి మార్కెట్లో విడుదల చేసారు. ఈ పాలసీని తీసుకున్న వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మార్కెట్ రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. కుమార్తెలు ఉన్న ఏ తల్లిదండ్రులైనా ఈ కన్యాదాన్ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీని తీసుకునే సమయానికి కుమార్తె వయస్సు ఒక ఏడాది ఉండాలి. పాలసీని తీసుకుంటున్న తల్లిదండ్రుల వయస్సు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అకౌంట్ కోసం కనీస గ్యారంటీ అమౌంట్ లక్ష రూపాయలుగా ఉంది. 13 నుండి 25 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి వరకు ఈ కన్యాదాన్ పాలసీని కొనసాగించుకునే అవకాశం ఎల్ఐసీ కల్పించింది.

  • ఈ కన్యాదాన్ పాలసీని తీసుకున్న తరువాత దీనివల్ల కలిగే ప్రయోజనాల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
  • పాలసీ తీసుకున్న తరువాత పాలసీ హోల్డర్ సహజ కారణాలతో మరణిస్తే గనుక ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు డెత్ బెనిఫిట్ క్రింద లభిస్తుంది.
  • పాలసీదారుడు ప్రమాదం కారణంగా మరణిస్తే గనుక బాధిత కుటుంబానికి రూ. 10 లక్షలు డెత్ బెనిఫిట్ క్రింద లభిస్తాయి.
  • పాలసీ కవరేజీ 25 సంవత్సరాల తరువాత పాలసీ నామినీ మొత్తం అమౌంట్ రూ. 27 లక్షలు చేతికి అందుతాయి. లభించిన ఈ మొత్తం అమౌంట్ విద్య లేదా వ్యాపారాల కోసం ఎంతగానో ఉపయోగపడతాయి.

ఒకవేళ దురదృష్టవశాత్తు పాలసీదారుడు గనుక మరణిస్తే మిగతా ప్రీమియం అమౌంట్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా దీనికి అదనంగా జీవిత బీమా సంస్థ లక్ష రూపాయలను బాధిత కుటుంబానికి యాన్యువల్ పేమెంట్ క్రింద అందిస్తుంది.

మెచ్యూరిటీ తేదీకి మూడు సంవత్సరాల ముందు వరకూ కూడా లైఫ్ రిస్క్ కవరేజీని ఈ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తోంది. పాలసీ మొత్తం కాలం అంతటా ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తికి రక్షణ అనేది ఉంటుంది. వరుసగా మూడేళ్లు ప్రీమియం చెల్లించిన తరువాత పాలసీ గనుక యాక్టివ్ లో ఉన్నట్లయితే లోన్ పొందే సౌకర్యం కూడా ఈ పాలసీలో ఉంది. అత్యవసర కాలంలో ఈ సౌకర్యం పాలసీ తీసుకున్న సంబంధిత కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రీమియం కి సంబంధించిన పేమెంట్ ను నెలవారీగా లేదా 3 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి చెల్లించవచ్చు.