పర్యావరణ పరిరక్షణలో అగ్రస్థానంలో తెలంగాణ : CSE released the report

వృక్షో రక్షతి రక్షితః అన్న నానుడి అందరికీ తెలిసిందే. చెట్లను పెంచడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. CSE released the report Telangana on the top of environmental performance

పర్యావరణ పరిరక్షణలో అగ్రస్థానంలో తెలంగాణ : CSE released the report
Telangana on the top of environmental performance

వృక్షో రక్షతి రక్షితః అన్న నానుడి అందరికీ తెలిసిందే. చెట్లను పెంచడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. దీనికి సంబంధించి పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలి. ప్రకృతిని పరిరక్షించడమంటే మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా, భావితరాల వారికి ఆరోగ్యకరమైన జీవితాలను ఇవ్వడం కూడా. అందుకోసం తొమ్మిదేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దీనికోసం బృహత్తర పథకాన్ని అమలు చేసింది. మొక్కలు నాటే కార్యక్రమాన్ని అమలుచేసి ఒకవైపు పర్యావరణం, మరోవైపు అడవుల పెంపకం కార్యక్రమం. దీంతో ఈ కార్యక్రమం నేడు యావత్ దేశం దృష్టి తెలంగాణపై పడేలా చేసింది.

పర్యావరణ హితంలో భాగంగా హరితహారంతో అద్భుతాలు ఎలా చేయవచ్చో దేశానికి ప్రత్యక్షంగా చూపించి ఆకుపచ్చ కిరీటంతో దేశం ముందు తెలంగాణ రాష్ట్రం మరోసారి ఠీవీగా నిలిచింది. అంతేకాకుండా పర్యావరణానికి దానికి పరిరక్షణకు పుట్టినిల్లుగా ఘనత వహించింది. దేశంలో ఎక్కడ చూసిన తరిగిపోతున్న అడవులు కనిపిస్తున్నాయి తప్ప అడవులు పెరగడం నేడు జరగడం లేదు. అయితే అడవుల పెరుగుదలకు కృషి చేసిన తెలంగాణ అందరి అంచనాలను తలక్రిందులు చేసింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రముఖ సంస్థ సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) అందించిన నివేదికలో తెలంగాణ ప్రథమ స్థానం సాధించినట్లు ప్రకటించడం నిజంగా తెలంగాణ ప్రజలకు శుభవార్తే అని చెప్పవచ్చు.అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా (role model) గా నిలిచినా తెలంగాణ మరోసారి పర్యావరణ పరిరక్షణలో మరోసారి ఆదర్శంగా నిలిచింది. 7.213 పాయింట్లతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన తెలంగాణ మున్సిపల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లోనూ ఆదర్శంగా నిలిచింది.

cricplayers promo code

పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అడవుల విస్తీర్ణం, పచ్చదనం పెరుగుదల, మున్సిపల్‌ ఘనవ్యర్థాలు, మురుగునీటి శుద్ధి, పునరుత్పాదక శక్తి, భూగర్భ జలాలు, నీటి వనరులు అనే ఏడు అంశాలను సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ, CSE) పరిగణనలోకి తీసుకుంది. దేశంలోని 28 రాష్ట్రాలతో పాటుగా కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పరిస్థితులను అధ్యయనం చేసింది. అన్నింటికీ కలిపి మొత్తం మీద 10 పాయింట్లు నిర్ణయించింది. దీని ప్రకారం పాయింట్లను ఆయా రాష్ట్రాలకు కేటాయించింది. అందులో 7.213 పాయింట్లతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మిగిలిన రాష్ట్రాలు కనీసం తెలంగాణ దరిదాపుల్లో కూడా లేవు. మొత్తం 28 రాష్ట్రాల్లో 26 రాష్ట్రాలు 5.7 పాయింట్లకు దిగువనే ఉన్నాయి. అందులో 16 రాష్ట్రాలు 5 పాయింట్లకే పరిమితం అయ్యాయి. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉత్తరప్రదేశ్‌ 4.7 పాయింట్లతో 16 వ స్థానంలో నిలిచింది.

పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ కృషి : CM KCR's effort to protect the environment

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించి అందరి సహకారంతో దానిని సాధించి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన కేసీఆర్ ఆది నుండే పర్యావరణ పరిరక్షణకు కంకణం కట్టుకున్నారు. దీర్ఘదృష్టితో ఆలోచించి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. భావితరాల వారి కోసం హరించుకుపోయిన అడవులను పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో రాష్ట్రంలో పచ్చదనం అందరి సహకారంతో 22 శాతం నుంచి 33 శాతానికి పెంచేలా ఒక ఉద్యమ రూపంలో కృషి చేసారు. దీనిని ఇలానే నిరంతరం కొనసాగించాలని నిర్ణయించారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మానవ ప్రయత్నంగా తెలంగాణ ప్రభుత్వం హరితహారాన్ని చేపట్టి మొత్తంగా 273 కోట్ల మొక్కలను నాటినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 2015-16 మధ్య కాలంలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా, అది 2023 నాటికి 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.

Also Read - A terrible train accident in Odisha

 మొత్తం తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో అడవులు 24.06 శాతంగా ఉన్నట్లు మంరి తెలిపారు. హరితహారం కారణంగా రాష్ట్రంలో 7.70 శాతం పచ్చదనం పెరిగినట్లు ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (FSI) నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో వినూత్నంగా నూతన పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాల్లో ‘హరిత బడ్జెట్‌’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ప్రతీ గ్రామంలో ఒక నర్సరీ ఏర్పాటు చేసారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 15,000 నర్సరీలు, 19,400కు పైగా పల్లె ప్రకృతి వనాలు, 2,725 బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసారు. దీంతోపాటుగా పట్టణాల్లో రూ.700 కోట్లతో 180 అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేసారు. హైదరాబాద్ నగరానికి రెండుసార్లు వరల్డ్ ట్రీ సిటీ (World Tree City) గా గుర్తింపు లభించింది. అన్ని రంగాల్లోనూ దూసుకుని వెళుతున్న తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దృష్టిని తనవైపు మరల్చుకునేలా చేసింది. ప్రతి ఒక్కరి కృషితో రాష్ట్ర వ్యాప్తంగా హరిత విప్లవాన్ని ఒక ఉద్యమంలా నిరంతరం చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని దానిని పకడ్బందీగా అమలు చేస్తూ విజయం సాధిస్తోంది. దానికి ఉదాహరణే నేడు అందుకున్న అవార్డు.