ఎక్స్‌ప్రెస్‌వేలతో తగ్గనున్న ప్రయాణదూరం : Travel distance will be reduced by expressways

ఎక్స్‌ప్రెస్‌వేలతో తగ్గనున్న ప్రయాణదూరం : Travel distance will be reduced by expressways

ఎక్స్‌ప్రెస్‌వేలతో తగ్గనున్న ప్రయాణదూరం : Travel distance will be reduced by expressways

అటల్ బిహారీ వాజపేయి (Atal Bihari Vajpayee) హయాంలో మొదలైన జాతీయ రహదారుల అభివృద్ధి (development of National Highways) నేడు మరింత ఊపందుకుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ వేలాది కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి పరుస్తున్నారు. 2025 సంవత్సర నాటికి దేశవ్యాప్తంగా 1.8 లక్షల కిలోమీటర్ల (1.8 lac kilometers) మేర జాతీయ రహదారుల అభివృద్దే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే కొన్ని వేల కిలోమీటర్లను అభివృద్ధి చేయడంతో హైవేపై ప్రయాణం సమయం తగ్గడంతో పాటు దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా మెరుగవుతోంది. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రధానమైన ప్రాంతాల్లో ఎక్స్ప్రెస్వేలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే మరికొన్ని ఎక్స్ప్రెస్వేలు (expresways) అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) సారథ్యంలో హైవేల అభివృద్ధి గణనీయంగా పెరిగింది. త్వరలో అందుబాటులోకి రానున్న కొన్ని ఎక్స్ప్రెస్వే వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.

 

ఢిల్లీ - ముంబై ఎక్స్ప్రెస్వే : Delhi - Mumbai Expressway

ఢిల్లీ - ముంబై ఎక్స్ప్రెస్వే గనుక పూర్తయితే రెండు నగరాల మధ్య ప్రయాణం చేసే సమయం తగ్గిపోతుంది. కేవలం 12 గంటల్లోనే (Delhi Mumbai journey will be 12 hours) ఎక్స్ప్రెస్వే ద్వారా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అదేవిధంగా ఇదే మార్గం ద్వారా ఢిల్లీ, గోవా మధ్య కూడా దూరాన్ని తగ్గించనుంది. ప్రస్తుతం మార్గంలో ప్రయాణ సమయం సుమారు 35 గంటలు పడుతోంది (Delhi-Goa present 35 hours). ఢిల్లీ - ముంబై ఎక్స్ప్రెస్వే గనుక అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం దాదాపు 15 గంటలు (reduce 15 hours) తగ్గనుంది. ప్రస్తుతం ఎక్స్ప్రెస్వే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీ, ముంబై నగరాల మధ్య రోడ్డు దూరం దాదాపు 1144 కిలోమీటర్లు.

 

ముంబై - నాగ్పూర్ ఎక్స్ప్రెస్వే : Mumbai - Nagpur Expressway

ముంబై - నాగ్పూర్ ఎక్స్ప్రెస్వే ఆరు లేన్ల రహదారిగా (6 lanes) రూపుదిద్దుకుంటోంది. రెండు నగర మధ్య దూరం మొత్తం 701 కిలోమీటర్లు (701 kilometers). మరో ఆరు నెలల్లో రహదారి నిర్మాణం పూర్తి కావొచ్చని అంచనా వేస్తున్నారు. రహదారి నిర్మాణం పూర్తయితే గనుక ముంబయి - నాగ్పూర్ మధ్య ప్రయాణ దూరం 8 గంటలుగా (Mumbai-Nagpur journey will be 8 hours) మారనుంది. రహదారి 10 జిల్లాల గుండా 390 గ్రామాలను (10 districts, 390 villages covered) కలుపుతూ నిర్మితమవుతోంది. మార్గంలో ప్రధాన నగరాలు కళ్యాణ్, నాగ్పూర్, నాసిక్, వార్ధా, భివాండి, ఔరంగాబాద్, షిర్డీ ఉన్నాయి. రహదారిలో 5 ఫ్లై ఓవర్లు, 33 ప్రధాన వంతెనలు, 25 ఇంటర్ఛేంజింగ్లు, 189 అండర్పాస్లు, 6 సొరంగాల నిర్మాణం చేపడుతున్నారు.

 

బెంగళూరు - చెన్నై ఎక్స్ప్రెస్వే : Bangalore - Chennai Expressway

బెంగళూరు - చెన్నై ఎక్స్ప్రెస్వే... బెంగళూరు, చెన్నై నగరాల మధ్య రానున్న ఎక్స్ప్రెస్వే   దక్షిణ భారతదేశంలో అందుబాటులోకి రానున్న ప్రధానమైన ఎక్స్ప్రెస్వే (South India main expressway) అని చెప్పవచ్చు. ఇది రెండు నగరాల ఆమధ్య ప్రయాణ దూరాన్ని గణనీయంగా తగ్గించనుంది. హైవే అందుబాటులోకి వస్తే దాదాపు మూడు గంటల్లోనే (Bangalore-Chennai journey will be 3 hours) రెండు నగరాల మధ్య ప్రయాణం సాగించవచ్చు. హైవే మొత్తం దూరం 260 కిలోమీటర్లు (260 kilometers). హైవే ఆంధ్రప్రదేశ్లోని పలమనేరు, చిత్తూరుల మీదుగా వెళుతుంది.

 

ఢిల్లీ - అమృత్సర్ - కత్రా ఎక్స్ప్రెస్వే  : Delhi - Amritsar - Katra Expressway

ఢిల్లీ - అమృత్సర్ - కత్రా ఎక్స్ప్రెస్వే (expressway) మొత్తం దూరం 650 కిలోమీటర్ల (650 kilometers) మేర నిర్మాణం కానుంది. ఢిల్లీలోని బహదూర్ఘర్ బోర్డర్ నుండి జమ్మూలోని కత్రా వరకు ఎక్స్ప్రెస్వే నిర్మాణం కొనసాగనుంది. ఎక్స్ప్రెస్వే గనుక అందుబాటులోకి వస్తే పంజాబ్లోని అమృత్సర్, నొకదార్, గురుదాస్పూర్ వంటి ప్రధాన నగరాలకు ప్రయాణ సమయం తగ్గనుంది.  ఎక్స్ప్రెస్వే ప్రసిద్ధ పర్యాటక క్షేత్రాలకు (connectivity to famous tourist spots) వెళ్లడానికి కూడా ఉపయోగపడనుంది.

 

రాయ్పూర్ - విశాఖపట్నం ఎక్స్ప్రెస్వే : Raipur - Visakhapatnam Expressway

రాయ్పూర్ - విశాఖపట్నం ఎక్స్ప్రెస్వే... ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ నుండి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వరకు ఎక్స్ప్రెస్వే (expressway) నిర్మాణం జరగనుంది. ఎక్స్ప్రెస్వే ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఉండనుంది. ఆరు లేన్ల (6 lanes) ఎక్స్ప్రెస్వే మొత్తం 464 కిలోమీటర్ల (464 kilometers) దూరం ఉంటుంది. మధ్య తూర్పు - మధ్య భారతదేశంలోని ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా నిర్మితమవుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే గనుక ఎక్స్ప్రెస్వే 2025 సంవత్సరం నాటికి పూర్తయ్యే (will be complete 2025) అవకాశం ఉంది. దీని నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల (useful for 3 states) వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

 

గంగా ఎక్స్ప్రెస్వే : Ganga Expressway

గంగా ఎక్స్ప్రెస్వే… ఉత్తర్ప్రదేశ్లోని బులంద్షహర్, హాపూర్, సంభాల్, అమ్రోహా, బదౌన్, షాజహాన్పూర్, ఉన్నావో, హర్దోయ్, రాయ్బరేలీ, ప్రతాప్గఢ్తో సహా మొత్తం 12 నగరాల (12 cities) గుండా రహదారి నిర్మాణం జరగనుంది. మొత్తం 94 కిలోమీటర్ల (94 kilometers) పొడవైన రహదారి ఆరు లేన్లుగా నిర్మితం కానుంది. ఎక్స్ప్రెస్వే ఢిల్లీ-మీరట్, ప్రయాగ్రాజ్-వారణాసి, మీరట్-హరిద్వార్ ఎక్స్ప్రెస్వేలతో కనెక్టివిటీ కలిగి ఉంటుంది. దీంతోపాటుగా ఆగ్రా, యమునా ఎక్స్ప్రెస్వేలతోనూ అనుసంధానం కానుంది. ప్రణాళిక ప్రకారం ఆంతా జరిగితే గనుక ఎక్స్ప్రెస్వే 2025 సంవత్సరం నాటికి అందుబాటులోకి రానుంది.