OTT లో స్ట్రీమింగ్ అవుతోన్న 'ఫ్యామిలీ స్టార్' : 'Family Star' streaming on OTT
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) చిత్రం డిజిటల్ ప్రీమియర్ రిలీజ్ అయింది.
OTT లో స్ట్రీమింగ్ అవుతోన్న 'ఫ్యామిలీ స్టార్' : 'Family Star' streaming on OTT
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) చిత్రం డిజిటల్ ప్రీమియర్ రిలీజ్ అయింది. గత శుక్రవారం ఉదయం 12 గంటలకు అంటే అర్ధరాత్రి నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ‘ఫ్యామిలీ స్టార్’ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. గత నెల ఏప్రిల్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా మే 3వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అనేలా ఇప్పటి వరకు వార్తలు వినిపించాయి. అయితే అంతకు ముందుగానే... అంటే విడుదలైన 20 రోజులలోనే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకు వచ్చారు.
OTT లో స్ట్రీమింగ్ అవుతోన్న 'ఫ్యామిలీ స్టార్' ('Family Star' streaming on OTT) విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) సంస్థకు చెందిన స్టార్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరించారు. ఈ సినిమాను పూర్తి ఎంటర్‌టైనర్‌గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల (Parasuram Petla) రూపొందించారు. అయితే థియేటర్లలో అనుకున్నంతగా విజయం అందుకోలేకపోయిన ఈ మూవీ... ఓటీటీలో మాత్రం మంచి ఆదరణను పొందుతుందని, అందుకే ముందుగానే ఓటీటీలోకి తీసుకు వచ్చారనేది ఇండస్ట్రీలో ఓ టాక్.
'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ విజయం అనంతరం విజయ్ దేవరకొండ- పరశురామ్ కాంబినేషన్‌లో 'ఫ్యామిలీ స్టార్' సినిమా రిలీజ్ అయింది. దీంతో గీత గోవిందం కంటే పెద్ద హిట్ అవుతుందని మూవీ టీమ్ భారీ నమ్మకాన్నే పెట్టుకుంది. ఏప్రిల్ 5న ఈ సినిమా థియేటర్లలో విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకొని ఆడియన్స్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థను కూడా ఎంతగానో నిరాశపరిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది. ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో 'ది ఫ్యామిలీ స్టార్' సినిమా ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. థియేట్రికల్ రన్ సమయంలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్‌ను ఎలా అలరిస్తుందో చూడాలి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలో అభినయ, వాసుకి, రోహిణి హట్టంగడి, రవిబాబు, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రలు పోషించారు. సంగీతం గోపీ సుందర్ అందించారు.
నిజానికి ఫ్యామిలీ స్టార్ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారని, కానీ సినిమాపై కావాలనే కొందరు నెగెటివిటీ క్రియేట్ చేశారంటూ సినిమా బృందం ఆరోపించింది. యూఎస్ ప్రీమియర్ల నుంచే ఈ నెగెటివ్ టాక్ మొదలైందని చెప్పుకొచ్చింది. కొంత మంది యూట్యూబ్ ఛానెళ్ల వ్యక్తులు సినిమా విడుదలకు ముందే రివ్యూలు పెట్టేశారని, సోషల్ మీడియాలో కావాలని నెగెటివిటీ క్రియేట్ చేశారంటూ ఆరోపించింది. ఈ దెబ్బకి నిర్మాత దిల్ రాజు థియేటర్ల ముందు మైక్ పట్టుకుని ఫ్యామిలీ ఆడియెన్స్ రివ్యూని స్వయంగా తీసుకున్నారు కూడా. ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా వైరల్ అయ్యాయి. ఈ సినిమాకి విజయం దక్కకూడదని, విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని కొందరు వ్యక్తులు, కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పనిగట్టుకుని నెగెటివిటీ క్రియేట్ చేశారంటూ దిల్ రాజు కూడా ఆరోపించారు.
ఫ్యామిలీ స్టార్ రిలీజ్‌కు ముందే సినిమా మీద నెగిటివ్ పోస్టులు చేశారన్నది మాత్రం వాస్తవమే. ఇవన్నీ ఫ్యామిలీ స్టార్ సినిమా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దృష్టికి వచ్చాయి. దీంతో నిర్మాణ సంస్ధ ఇచ్చిన సోషల్ మీడియా స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియా గ్రూప్స్, అక్కౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు కూడా చేశారు. విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ కలిసి పోలీసులను ఆశ్రయించారు.
సినిమా రివ్యూ : Movie review
ఈ సినిమాకి సంబంచించి కథ (Family Star Story) విషయానికి వస్తే.. గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆఖరివాడు. ఇద్దరు అన్నలు, వదినలు, వాళ్ళ పిల్లలు, బామ్మ, ఇలా ఒక మధ్యతరగతి కుటుంబంలో చిన్నవాడైన గోవర్ధన్ కుటుంబాన్ని తన భుజస్కందాలపై నడిపిస్తూ వుంటాడు. తన కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చే గోవర్ధన్... వారిని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఒప్పుకోడు... వారికి ఎదురు తిరిగి తగిన బుద్ధి చెబుతుంటాడు. అలాంటి సమయంలో ఆ ఇంట్లోకి వస్తుంది ఇందు (మృణాల్ ఠాకూర్) అనే అమ్మాయి. గోవర్ధన్ ఉంటున్న ఇంట్లోనే మేడ మీద ఒక గది ఖాళీగా ఉంటే దానిలో అద్దెకి దిగుతుంది. గోవర్ధన్ మొదట్లో ఆమెని వ్యతికేరించినా, మెల్లగా ఆమె చేస్తున్న పనులు నచ్చి ఆమెతో ప్రేమలో పడతాడు. పెళ్లి కూడా చేసుకుందాం అని అనుకుంటాడు. అదే సమయంలో ఆమె గోవర్ధన్ మీద ఒక థీసిస్ రాస్తుంది. అది తను చేసే మధ్యతరగతి కుటుంబం గురించిన రీసెర్చ్ అని, దానిని యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తుంది. అందులో గోవర్ధన్ మధ్యతరగతి కుటుంబం గురించిన అన్ని వివరాలు ఉంటాయి. గోవర్ధన్ ఆ పుస్తకం చదివి తన కుటుంబాన్ని మొత్తం ఇందు రోడ్డు మీదకు తీసుకువచ్చిందని తలంచి ఆమెని అసహ్యించుకుంటాడు. మధ్య తరగతి కుటుంబం అంటే పస్తులుండే కుటుంబం కాదని, తలుచుకుంటే మేము కూడా సంపన్నులం అవగలమని చూపిస్తాడు. వెంటనే తనకు ఇంతకు ముందు ఆఫర్ ఇస్తామన్న ఒక పెద్ద వ్యాపారవేత్త (జగపతి బాబు) దగ్గరికి వెళ్లి తాను ఇప్పుడు ఆ ఉద్యోగం తీసుకుంటానని ప్రాధేయపడితే అతను గోవర్ధన్‌కి ఆ ఉద్యోగాన్ని ఇస్తాడు, అలాగే రెండు సంవత్సరాల జీతం అడిగితే అది కూడా ముందే ఇస్తాడు. తనది మధ్యతరగతి కుటుంబం కాదని, ధనవంతుల కుటుంబం అని ఇందుకు చెప్తాడు. ఆమె మీద ద్వేషం పెంచుకుంటాడు. ఇంతకీ ఇందు అనే అమ్మాయి ఎవరు? తాను నిజంగానే గోవర్ధన్ మధ్యతరగతి కుటుంబాన్ని వీధిలోకి లాగడం కోసమే థీసిస్ రాసిందా? లేక ఆ వ్యాపారవేత్త గోవర్ధన్ అడగగానే వెంటనే ఉద్యోగం, జీతం ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాడు? గోవర్ధన్, ఇందు మళ్ళీ కలిశారా? వాళ్ళు పెళ్లిచేసుకున్నారా? తరువాత ఏమైంది? గోవర్ధన్ జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది... OTT లో స్ట్రీమింగ్ అవుతోన్న 'ఫ్యామిలీ స్టార్' ('Family Star' streaming on OTT) అనేది తెలియాలంటే ఈ సినిమా తప్పకుండా చూసి తీరవలసిందే.