కంటెంట్ సినిమాలకే ఆదరణ : Content movies are popular

సినిమాలో కంటెంట్ (content) ఉంటే అది స్టార్ హీరో (star hero) సినిమానా కాదా అని నేటి ప్రేక్షకుడు చూడడం లేదు. ఇటువంటి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

కంటెంట్ సినిమాలకే ఆదరణ : Content movies are popular

కంటెంట్ సినిమాలకే ఆదరణ : Content movies are popular 

సినిమాలో కంటెంట్ (content) ఉంటే అది స్టార్ హీరో (star hero) సినిమానా కాదా అని నేటి ప్రేక్షకుడు చూడడం లేదు. ఇటువంటి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు ఇటీవల విడుదలైన అద్భుత విజయం సాధించిన రంగమార్తాండ (Rangamarthanda), 'బలగం' (Balagam) సినిమాలే ఉదాహరణ. బలగం సినిమా అంతర్జాతీయంగా కూడా ఇప్పటికే ఎన్నో అవార్డులను (International Awards) అందుకుంది.

 

ఇప్పటికే గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా బాక్సాఫీస్ (Telugu Box-office) వద్ద చిన్న చిత్రాలు ఘన విజయాన్ని అందుకుంటున్నాయి. పెద్ద చిత్రాలకు ధీటైన కంటెంట్ (content) తో ఇది సాధ్యమవుతుందని చెప్పవచ్చు. కంటెంట్ బాగుంటే అందులో స్టార్ హీరోలే అవసరం లేదని చిత్రాలు నిరూపించాయి. కోడి రోజుల క్రితం విడుదలైన శాకుంతలం (Sakhuntalam), రుద్రుడు (Rudrudu) సినిమాలు కూడా ఫరవాలేదనిపించాయి. ఇక ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాలను థియేటర్లలో విరూపాక్ష, హలోమీరా.. ! చిత్రాలు విడుదల అవుతుండగా, మరికొన్ని చిత్రాలను ఓటీటీలో (OTT) సైతం విడుదల చేస్తున్నారు ఆయా చిత్రాల మేకర్స్ (film makers). వారంలో ఓటీటీలో విడుదల (releasing in OTT) కానున్న చిత్రాల వివరాలు మీకోసం.

విరూపాక్ష : Virupaksha

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Mega Hero Sai Dharam Tej), సంయుక్త జంటగా నూతన దర్శకుడు (Director) దండు కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే విరూపాక్ష. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ (posters), ట్రైలర్ (trailer) సినిమాపై అంచనాలు (expectations) పెంచేసాయి. అన్ని నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న చిత్రం ఏప్రిల్ 21 న (releasing on April 21st) థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ లో వచ్చిన డైలాగ్ (trailer dialogue) ... 'జరుగుతున్న చావులకు కారణం నేను తెలుసుకుని తీరతాను.. రుద్రవనాన్ని కాపాడగల విరూపాక్షవి నువ్వే'... సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాయి ధరమ్ తేజ్ ఖాతాలో విజయం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు.

 

హలో.. మీరా.. ! : Hello ... Mira

ఒకే ఒక పాత్రతో (only one role) సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ (suspense drama thriller) గా రూపొందిన చిత్రమే హలో.. మీరా.. ! యల్లాప్రగడ గార్గేయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రానికి కాకర్ల శ్రీనివాసు దర్శకత్వం వహించాడు. సినిమా మొత్తం మీరా పాత్ర (Meera character) చుట్టూనే తిరుగుతుంది. ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ గా చిత్రం ఏప్రిల్ 21 ((releasing on April 21st)) రిలీజ్ అవనుంది.

వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు : This week films are releasing in OTT

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ : Disney+ Hotstar

సుగా (డాక్యుమెంటరీ స్పెషల్) … ఏప్రిల్ 21 (Suga (Documentary Special) … April 21

 

సోనీలివ్ : Sony Liv

గర్మీ.. సిరీస్.. ఏప్రిల్ 21 (Garmi.. series... April 21)

 

నెట్ ఫ్లిక్స్ : Netflix

హౌ టు గెట్ రిచ్... ఇంగ్లీష్... ఏఫ్రిల్ 18

చింప్ ఎంపైర్... డాక్యుమెంటరీ... ఏప్రిల్ 19 (Chimp Empire... Documentary... April 19)

ది మార్క్డ్ హార్ట్... సీజన్ 2... ఏప్రిల్19 (The Marked Heart... Season 2... April19)

చోటా భీమ్... సీజన్ 17... ఏప్రిల్ 20 (Chota Bheem... Season 17... April 20)

టూత్ పరి... హిందీ... ఏప్రిల్ 20 (Tooth Pari… Hindi… April 20)

డిప్లొమ్యాట్... ఇంగ్లీష్... ఏప్రిల్ 20 (Diplomat... English... April 20)

సత్య 2... తెలుగు... ఏప్రిల్ 21 (Satya 2... Telugu... April 21)

రెడీ... తెలుగు... ఏప్రిల్ 21 (Ready... Telugu... April 21)

ఇండియన్ మ్యాచ్ మేకింగ్... వెబ్ సిరీస్... ఏప్రిల్ 21 (Indian Matchmaking... Web Series... April 21)

టూరిస్ట్స్ గైడ్ టు లవ్... ఇంగ్లీష్... ఏప్రిల్ 21 (A Tourist's Guide to Love... English... April 21)