నేడు చెన్నై, బెంగళూరు మధ్య మ్యాచ్ : Today match between CSK vs RCB

నరాలు తెగే ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లు (Exciting matches) ... ఆఖరి ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌లు బంతిని స్టాండ్స్ లోకి పంపించే షాట్లు... వెరసి ఐపీఎల్ (IPL) క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తోంది.

నేడు చెన్నై, బెంగళూరు మధ్య మ్యాచ్ : Today match between CSK vs RCB

నేడు చెన్నై, బెంగళూరు మధ్య మ్యాచ్ : Today match between CSK vs RCB

నరాలు తెగే ఉత్కంఠ భరితమైన మ్యాచ్లు (Exciting matches) ... ఆఖరి ఓవర్లలో బ్యాట్స్మెన్లు బంతిని స్టాండ్స్ లోకి పంపించే షాట్లు... వెరసి ఐపీఎల్ (IPL) క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తోంది.

 

ఐపీఎల్ 16 సీజన్ (IPL 16th season) మ్యాచ్లు అభిమానులను ఎంతగానో రంజింప చేస్తున్నాయి. ఉత్కంఠ భరితంగా సాగుతున్న మ్యాచ్లతో ఐపీఎల్ (IPL) అందరినీ అలరిస్తోంది. అన్ని జట్లూ తమ సామర్ధ్యాన్ని నిరూపించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. పాయింట్ల పట్టికలో (points table) అగ్రస్థానానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా నేడు అభిమానులకు నిజమైన క్రికెట్ మజాను అందించే మ్యాచ్ జరగబోతోంది. ధోనీ సారథ్యంలోని (CSK captain MS Dhoni) చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య నేడు బెంగళూరు జట్టు హోమ్ గ్రౌండ్ (RCB home ground) లో మ్యాచ్ జరగనుంది. దీంతో అభిమానులు ఎంతో ఉత్కంఠంగా మ్యాచ్ (Exciting match) కోసం ఎదురు చూస్తున్నారు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆయా జట్ల అభిమానులకు (team fans) పండగే అని చెప్పవచ్చు.

ముఖాముఖి పోరులో చెన్నైదే పైచేయి  : CSK leading in Head to Head

ఐపీఎల్ లో (IPL) బెంగళూరు టీమ్ పై చెన్నై జట్టుకి మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకూ జరిగిన ఐపీఎల్ లో బెంగళూరు జట్టుపై చెన్నై టీమ్ (CSK) దే పైచేయి. ఇరు జట్లు ఇప్పటి వరకూ 30 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో 19 మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) విజయం సాధించగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 10 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఇక అత్యధిక స్కోర్ (highest score) విషయంలో చెన్నై టీమ్ 216 పరుగులు కాగా, బెంగళూరు జట్టుది 205 పరుగులు. అత్యల్ప స్కోర్ లో (lowest score) చెన్నై 82 పరుగులు, బెంగళూరు 70 పరుగులు. గత ఏడాది జరిగిన 15 ఐపీఎల్ సీజన్లో (15th IPL season) రెండు సార్లు తలపడగా తలో మ్యాచ్ గెలిచాయి.

 

ఇక ఏడాది జరుగుతున్న 16 సీజన్లో (16th season IPL) ఇరు జట్లూ తలో 4 మ్యాచ్లు ఆడాయి. చెన్నై జట్టు (CSK) 4 మ్యాచ్లలో 2 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లలో ఓడింది. బెంగళూరు (RCB) కూడా 4 మ్యాచ్లలో 2 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లలో ఓడింది. అయితే నెట్ రన్ రేట్ (net run rate) చెన్నై జట్టుది ఎక్కువ కావడంతో పాయింట్ల పట్టికలో 6 వస్థానంలోనూ, 7 స్థానంలో బెంగళూరు ఉన్నాయి. మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్-3 లో (CSK will reach 3rd place) చోటు సంపాదించాలని చెన్నై భావిస్తోంది. ఒకవేళ బెంగళూరు గెలిస్తే 4 స్థానానికి చేరుకుంటుంది. అయితే బెంగళూరు తో జరిగే మ్యాచ్కి ముందుగా చెన్నై జట్టుని గాయాల (injuries) బెడద బాధిస్తోంది. సీజన్ మొదలైన తరువాత దీపక్ చాహర్ (Deepak Chahar), బెన్ స్టోక్స్ (Ben Stokes) గాయాల బారిన పడడంతో తుది జట్టుకి దూరంగా ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన గత మ్యాచ్లో ధోని (MS Dhoni) మోకాలి గాయంతో బాధపడడం స్పష్టంగా కనిపించింది. మ్యాచ్లో ధోని కుంటుతూ కనిపించాడు. అదేవిధంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ మగలా (Magalaa) సైతం బెంగళూరుతో జరిగే మ్యాచ్కి దూరమయ్యాడు. ఒకవేళ ధోని (Dhoni) కనుక బెంగళూరుతో జరిగే మ్యాచ్లో ఆడకపోతే అంబటి రాయుడు (Ambati Rayudu) కీపింగ్ చేయవచ్చు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అంచనా : RCB probable playing XI

విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వేన్ పార్నెల్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వైషాక్ విజయ్కుమార్, మహ్మద్ సిరాజ్

 

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంచనా : CSK probable playing XI

డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోని (కెప్టెన్ & వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, మహేశ్ తీక్షణ, ఆకాష్ సింగ్, తుషార్ దేశ్పాండే

 

మ్యాచ్ కి సంబంధించిన వివరాలు : Details of the match

17 ఏప్రిల్ 2023 (Match Date) : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) vs చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ (CSK)

కెప్టెన్స్ (Captains) :  ఫాఫ్ డు ప్లెసిస్ (Faf Du Plessis, RCB), MS ధోని (MS Dhoni, CSK)

స్టేడియం (Stadium) : MA చిన్నస్వామి, బెంగళూరు

మ్యాచ్ టైమింగ్ (Match timing) : 7:30 PM

టాస్ టైమింగ్ (Toss timing) : 7:00 PM

లైవ్ స్ట్రీమింగ్ (Live streaming) : స్టార్ స్పోర్ట్స్ ఛానల్ (Star sports, జియో సినిమా (Jio cinema)