టీడీఎస్ చెల్లింపు ఆలస్యమైతే జరిమానా ఉండదు : No penalty for delay in TDS payment
టీడీఎస్ (TDS) చెల్లింపులో ఆలస్యమైతే ఇకనుండి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పును ఇచ్చింది.
టీడీఎస్ చెల్లింపు ఆలస్యమైతే జరిమానా ఉండదు : No penalty for delay in TDS payment
టీడీఎస్ (TDS) చెల్లింపులో ఆలస్యమైతే ఇకనుండి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పును ఇచ్చింది. యూఎస్ టెక్నాలజీస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (US Technologies International Pvt limited) అనే సాఫ్ట్‌వేర్ కంపెనీకి సంబంధించిన కేసులో ఈ మేరకు కోర్టు తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా అసలు టీడీఎస్ అంటే ఏమిటి? ఇది ఆలస్యం అయితే అపరాధ రుసుము ఎందుకు చెల్లించాలి అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. ఒక వ్యక్తి సంపాదన (earning) లేదా ఆదాయం మూలం వద్దనే పన్నును మినహాయించడాన్ని లేదా కోతను విధించడాన్ని టీడీఎస్ (Tax Deducted at Source) అంటారు. సాధారణంగా చెల్లింపుల సమయంలోనే ఈ టీడీఎస్ అమలు అవుతుంది. అనంతరం టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన తరువాత ఈ టీడీఎస్ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అయితే టాక్స్ చెల్లించే సదరు వ్యక్తి పన్ను చెల్లించే (tax paying) విషయంలో విఫలమైతే గనుక ఈ మొత్తానికి సమానమైన అపరాధ రుసుము చెల్లించాలని ఆదాయపు పన్ను చట్టం చెబుతోంది. అయితే పైన పేర్కొన్న కంపెనీ కేసు విషయంలో సుప్రీంకోర్టు దేనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలతో కూడిన సంచలన తీర్పును వెల్లడించింది.
టీడీఎస్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు : Supreme Court comments on TDS
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మూలం వద్దనే మినహాయించి పన్ను (TDS) చెల్లించే విషయంలో ఆలస్యం చేసినంత మాత్రాన అపరాధ రుసుము అంటే జరిమానా (penalty) విధించకూడదని తన తీర్పులో స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను చట్టంలో (IT Act) పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా చెల్లింపులో విఫలమైనప్పుడు మాత్రమే జరిమానా విధించాలని స్పష్టంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. అందుకు తగ్గట్లుగానే పన్ను చెల్లించే వ్యక్తి గనుక టీడీఎస్ (TDS) చెల్లించడంలో విఫలమైనప్పుడు మాత్రమే జరిమానా విధించాలని, ఆలస్యం అయినంత మాత్రాన కాదని పేర్కొంది. కోర్టులో కేసు ఫైల్ చేసిన సదరు కంపెనీ తాము సేకరించిన టీడీఎస్ (TDS) లో కొంత మొత్తాన్ని చెల్లించడంలో ఆలస్యం చేసింది. దీనిని కారణంగా చూపుతూ ఆదాయపు పన్ను చట్టం సెక్షన్-271సి కింద రూ.1.10 కోట్లను సంబంధిత శాఖకు చెందిన అధికారులు జరిమానా విధించారు. ఈ మొత్తం కూడా కంపెనీ సేకరించిన టీడీఎస్ మొత్తానికి సమానం. 2019 లో కేరళ హైకోర్టు కూడా అధికారులు ఇచ్చిన ఈ ఉత్తర్వులనే సమర్ధించింది. అనంతరం సదరు కంపెనీ సర్వోన్నత న్యాయస్థానాన్ని (Supreme Court) ఆశ్రయించడంతో కంపెనీకి అనుకూలంగా న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
అసలు టీడీఎస్ (TDS) అంటే ఏమిటి? : What is the TDS
టీడీఎస్ అంటే మూలాధారం పన్ను మినహాయించడం (TDS) అని అర్ధం. ఇది అడ్వాన్స్‌డ్ ఇన్‌కమ్ ట్యాక్స్, 1961 చట్టం (Advanced Incomne Tax, 1961 Act) క్రిందకు వస్తుంది. దీనిని ప్రత్యక్ష పన్ను విధానంగా పరిగణిస్తారు. ఇందులో జీతాలు, కమీషన్లు, అద్దెలు, వడ్డీలు, ప్రొఫెషనల్ ఫీజులు వంటి చెల్లింపులు జరిగేటప్పుడు మినహాయించుకునే కొంత మొత్తాన్నే టీడీఎస్ గా పరిగణిస్తారు. ఆదాయ చెల్లింపుల సమయంలో పన్నులను వసూలు చేసేందుకు గానూ దీనిని ప్రవేశపెట్టారు. ఇలా వసూలు చేసిన టీడీఎస్ (TDS) మొత్తం కేంద్ర ప్రభుత్వానికి జమ చేస్తారు. చెల్లింపులు చేసే వారు చెల్లింపులు చేసే ముందే టీడీఎస్ ను తెసేయాల్సి ఉంటుందని ఆదాయపు పన్ను చట్టం చెబుతోంది. నిబంధనలకు అనుగుణంగా ఇది ప్రభుత్వానికి క్రెడిట్ అవుతుంది. పాన్ (PAN) అనేది శాశ్వత ఖాతా సంఖ్య అయితే టీడీఎస్ చెల్లింపు కోసం మాత్రం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 203A ప్రకారం తప్పనిసరిగా పన్ను మినహాయింపు ఖాతా సంఖ్య (TAN) ఉండాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో టీడీఎస్ ఆదాయపు పన్ను అనుకున్నదానికంటే అధికంగా ఉంటే గనుక సదరు వ్యక్తి ఫారమ్ 26AS సర్టిఫికేట్‌ను సమర్పించి సంబంధిత మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. ఒకవేళ సంబంధిత గ్రహీత (receiver) గనుక తన పాన్ కార్డును సమర్పించడంలో విఫలమైతే గనుక అతని ఆదాయంపై అధిక మొత్తంలో టీడీఎస్ పడేందుకు అవకాశం ఉంటుంది. అందుకే టీడీఎస్ డిపాజిట్ చేయడానికి టాన్ (TAN), పాన్ (PAN) తప్పనిసరి.
టీడీఎస్ లో వివిధ రకాల రిటర్న్ ఫారమ్స్ : Different TDS return forms
- ఫారమ్ 24Q: జీతాల నుండి మూలం వద్ద పన్ను తీసివేయబడడానికి దీనిని ఉపయోగిస్తారు.
- ఫారమ్ 26Q: జీతాలు కాకుండా అన్ని చెల్లింపులపై మూలం వద్ద పన్ను మినహాయించడానికి ఈ ఫారమ్ వినియోగిస్తారు
- ఫారమ్ 27Q: వడ్డీ, డివిడెండ్‌లు లేదా నాన్‌రెసిడెంట్‌లకు చెల్లించాల్సిన ఏదైనా ఇతర మొత్తానికి వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపు కోసం దీనిని ఉపయోగిస్తారు.
- ఫారమ్ 27EQ: మూలం వద్ద పన్ను వసూలు స్టేట్‌మెంట్ కోసం దీనిని వాడతారు.
టీడీఎస్ లో కొన్ని చెల్లింపు ధరలు (TDS Rates)
చెల్లింపు యొక్క విభాగం మరియు స్వభావం |
చెల్లింపుదారు |
వర్తించే రేటు |
సెక్షన్ 192, జీతం |
జీతం పొందిన వ్యక్తి |
వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్ |
సెక్షన్ 192A, EPF యొక్క ముందస్తు ఉపసంహరణ |
వ్యక్తిగత |
మొత్తం మొత్తంలో 10% |
సెక్షన్ 193, సెక్యూరిటీలపై వడ్డీ మొత్తం |
వ్యక్తిగత |
10% |
సెక్షన్ 194, డివిడెండ్స్ |
దేశీయ కంపెనీలు |
10% |
సెక్షన్ 194A, ఆస్తులు & సెక్యూరిటీలపై వడ్డీ |
పన్ను చెల్లింపుదారులు మరియు HUF మినహా వ్యక్తులు ఆడిట్‌కు బాధ్యత వహించాలి |
10% |
సెక్షన్ 194B, ఏదైనా పోటీ లేదా లాటరీ ద్వారా సంపాదించిన డబ్బుపై వర్తిస్తుంది |
వ్యక్తిగత |
30% |
సెక్షన్ 194BB, గెలుపొందిన గుర్రపు పందెంపై బహుమతి మొత్తం |
ఏదైనా వ్యక్తి |
30% |
సెక్షన్ 194C, కాంట్రాక్టర్లు |
పన్ను చెల్లింపుదారులు మరియు HUF మినహా వ్యక్తులు ఆడిట్‌కు బాధ్యత వహించాలి |
వ్యక్తులు మరియు HUF కోసం 1%, ఇతర పన్ను చెల్లింపుదారులకు 2% |
సెక్షన్ 194D, బీమా కమిషన్ |
బీమా అగ్రిగేటర్ |
వ్యక్తులు మరియు HUF కోసం 5% మరియు ఇతర ఏజెంట్లకు 10% |
సెక్షన్ 194DA, జీవిత బీమా పాలసీ |
వ్యక్తిగత |
1% |
సెక్షన్ 194E, నివాసేతర క్రీడాకారులకు చెల్లింపులు |
వ్యక్తిగత |
20% |
సెక్షన్ 194EE, NSS కింద డిపాజిట్ |
వ్యక్తిగత |
10% |
సెక్షన్ 194G, లాటరీ టిక్కెట్ విక్రయం నుండి కమీషన్ |
వ్యక్తిగత |
5% |
సెక్షన్ 194H, సంపాదించిన కమీషన్ లేదా బ్రోకరేజీపై TDS |
పన్ను చెల్లింపుదారులు మరియు HUF మినహా వ్యక్తులు ఆడిట్‌కు బాధ్యత వహించాలి |
5% |
సెక్షన్ 194I, అద్దెపై TDS |
పన్ను చెల్లింపుదారులు మరియు HUF మినహా వ్యక్తులు ఆడిట్‌కు బాధ్యత వహించాలి |
2% |