7 శివాలయాలకు, జ్యోతిర్లింగాలకు ఉన్న సంబంధం ఏమిటి? : What is the relationship between 7 Shiva temples and Jyotirlingas?
హిందువులైన ప్రతి ఒక్కరికి పరమ శివుడు అంటే మహా ప్రీతి. మన దేశంలో దేశంలో వేలాది శివాలయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జ్యోతిర్లింగాలతో సంబంధం కలిగి ఉండడం విశేషం.
హిందువులైన ప్రతి ఒక్కరికి పరమ శివుడు అంటే మహా ప్రీతి. మన దేశంలో దేశంలో వేలాది శివాలయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జ్యోతిర్లింగాలతో సంబంధం కలిగి ఉండడం విశేషం. అంతేకాకుండా రామేశరం నుండి కేదార్‌నాథ్ మధ్య ఉన్న ఏడు శివాలయాలు ఒకే సరళ రేఖపై ఉండడం మరింత విశేషం. ఈ ఏడు శివాలయాలు, జ్యోతిర్లింగాలు మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం.
భారతదేశం అంటేనే సనాతన హిందూ ధర్మానికి ప్రతీక. విదేశీయులు సైతం మన హిందూ ధర్మాన్ని ఆచరించేవారు ఎందరో ఉన్నారు. ఇక్కడ ఎన్నో పురాతన ఆలయాలు వెలసి ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఆయా ఆలయాల నిర్మాణాలు, అందులో నిగూఢమై ఉన్న కొన్ని రహస్యాలు ఇప్పటికీ మర్మంగానే (mystery) మిగిలిపోయాయి. వీటిలో శివాలయాలు, జ్యోతిర్లింగాల్లో దాగున్న రహస్యాలు అంతులేనివి. ఉత్తర భారత దేశంలోని జమ్మూ కాశ్మీర్ హిమాలయ పర్వత సానువుల్లో కొలువై ఉన్న కేదార్‌నాథ్ ఆలయం వద్ద నుంచి దక్షిణ భారత దేశంలోని రామేశ్వరం మధ్యలో ఎన్నో రహస్యాలు నిక్షిప్తమై ఉన్నట్లు చెబుతారు. రామేశ్వరం, కేదార్‌నాథ్ రెండూ కూడా శివాలయాలే.
ఈ రెండు జ్యోతిర్లింగాల మధ్య దూరం 2382 మీలోమీటర్లు ఉండడంతో పాటుగా వీటి మధ్యన ఏడు శివాలయాలు ఉన్నాయి. ఈ ఏడు శివాలయాలు కూడా ఒకే సరళ రేఖలో ఉండడం నిజంగా విశేషమైన అంశం. ఈ శివాలయాలు ఒకే సరళ రేఖలో ఉండడం యాదృచ్ఛికం మాత్రం కాదు. ఎందుకంటే ఇవి 4 వేల సంవత్సరాల క్రితమే నిర్మించబడ్డాయి. అప్పట్లో వీటిని నిర్మించే సమయంలో ఒక ప్రదేశం యొక్క అక్షాంశ, రేఖాంశాలను కొలిచే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. అయినప్పటికీ ఈ ఆలయాలను స్పష్టమైన సరళ రేఖలో నిర్మించారు. ఈ ఏడు ఆలయాలు కూడా ఒకే వరుసలో ఉన్నాయి. ఈ ఏడు శివాలయాలను అక్షాంశ, రేఖాంశాలను బట్టి 'శివశక్తి రేఖ' అని పిలిచేవారు. ఈ శివశక్తి రేఖకు ఉత్తరాన కేదార్‌నాథ్, దక్షిణాన రామేశ్వరం ఆలయాలు ఉన్నాయి. ఈ రేఖ ఉత్తరాన్ని దక్షిణాన్ని కలుపుతుంది.
కేదార్‌నాథ్ : Kedarnath
ఉత్తర భారత్ లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్ర ప్రయాగ్ జిల్లాలో కేదార్‌నాథ్ ఆలయం ఉది. జనమేజయుడు కేదార్‌నాథ్ ఆలయాన్ని నిర్మించాడని, ఆది శంకరాచార్య దీనిని పునర్నిర్మించాడని చెబుతారు. సంవత్సరంలో 6 నెలలపాటు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించేందుకు అనుమతిస్తారు. మిగిలిన కాలమంతా ఈ ఆలయాన్ని మూసి ఉంచుతారు. 79.0669 డిగ్రీల రేఖాంశంలో (in longitude 79.0669 degrees) కేదార్‌నాథ్ ఆలయం ఉంటుంది.
కాళేశ్వరం : Kaleshwaram
దక్షిణ భారత దేశంలోని తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరి నదీతీరంలో కాళేశ్వరాలయం ఉంది. ఇక్కడ ఈశ్వరుడు త్రిలింగదేశంగా పూజలను అందుకుంటున్నాడు. త్రిలింగదేశం అంటే మూడు లింగాల భూమి అని అర్ధము. ఇందులో రెండు శివ లింగాలు శివుడి చిహ్నంగానూ, మూడో లింగం యమ చిహ్నంగానూ పరిగణిస్తారు. 79.54‘23’E రేఖాంశంలో కాళేశ్వరాలయం నెలకొంది.
శ్రీకాళహస్తి : Srikalahasti
దక్షిణ భారత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయం అగ్ని, వాయు, నీరు, భూమి, ఆకాశం పంచ భూతాల్లో వాయు మూలకానికి ప్రసిద్ధి చెందడంతో పాటు 79.6983E రేఖాంశంలో ఉంది.
ఏకాంబరేశ్వర ఆలయం : Ekambareswara Temple
ఏకాంబరేశ్వర దేవాలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించి ఉన్నాయి. ఇక్కడ భూమి మూలక రూపంలో పరమేశ్వరుడు పూజలందుకుంటుంటాడు. ఈ ఆలయాన్ని పల్లవ రాజులు నిర్మించినట్లు చరిత్రలో లిఖించబడి ఉంది. అనంతరం చోళులు, విజయనగర రాజులు ఏకాంబరేశ్వర ఆలయాన్ని అభివృద్ధి పరిచారు. 79.42‘00’E రేఖాంశంలో ఏకాంబరేశ్వర ఆలయం ఉంది.
అరుణాచలేశ్వరుని ఆలయం : Arunachaleshwar Temple
తమిళనాడులోని అరుణాచలంలో అరుణాచలేశ్వరుని ఆలయాన్ని చోళవంశస్తులు నిర్మించారు. అరుణాచలేశ్వరుని ఆలయం 79.0677E డిగ్రీల రేఖాంశంలో ఉంది, ఈ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయంటారు. అంతేకాకుండా ఇక్కడ శివుడిని పూజిస్తే అంతా శుభం జరుగుతుందని చెబుతారు. పౌర్ణమి తిథిలో ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.
నటరాజ ఆలయం : Nataraja Temple
తమిళనాడులోని చిదంబరంలో ఉన్న నటరాజ ఆలయం ఖగోళ మూలకానికి ప్రసిద్ధి చెందింది. పరమ శివుడిని ఇక్కడ నటరాజ రూపంలో కొలుస్తారు. నటరాజ ఆలయం 79.6935E డిగ్రీల రేఖాంశంలో ఉంది.
రామేశ్వరం : Rameshwaram
తమిళనాడులోని రామేశ్వరంలోని ఈ ఆలయంలో శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించినట్లు, ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. రామేశ్వరం ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయం 79.3174E డిగ్రీల రేఖాంశంలో ఉంది.