తిరుపతి నిర్మించి 893 సంవత్సరాలు : Tirupati built 893 years ago
భక్తులకు కొంగు బంగారంగా నెలవైన శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateshwara) కొలువై ఉన్న తిరుపతి (Tirupati) ఏర్పడి ఈ నెల 24వ తేదీ (February 24th) నాటికి 893 సంవత్సరాలు (893 years will complete) పూర్తి కావస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఇక్కడ జరగనున్నాయి.
తిరుపతి నిర్మించి 893 సంవత్సరాలు : Tirupati built 893 years ago
భక్తులకు కొంగు బంగారంగా నెలవైన శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateshwara) కొలువై ఉన్న తిరుపతి (Tirupati) ఏర్పడి ఈ నెల 24వ తేదీ (February 24th) నాటికి 893 సంవత్సరాలు (893 years will complete) పూర్తి కావస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరగనున్నాయి.
సౌమ్య నామ సంవత్సరం ఉత్తరా నక్షత్ర ఫాల్గుణ పౌర్ణమి సోమవారం రోజున రామానుజులు గోవిందరాజుల పీఠాధిపతిని ప్రతిష్టించి, నిత్య కైంకర్యములు చేసి, నాలుగు మాడ వీధులను అగ్రహారాలతో కలిపి తిరుపతిని నిర్మించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత దేవాలయం చుట్టూ ఉన్న ఇతర సంఘాలు అన్నీ కలిసి తిరుపతిగా మారాయి.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి : Holy Shrine Tirupati
హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతి (Sacred Ancient place Tirupati). ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది నిత్యం కలియుగ వేంకటేశ్వరుని (Lord Venkateshwara) దర్శించుకునేందుకు వస్తుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆధ్యాత్మిక రాజధాని (Andhra Pradesh Spiritual capital) అని అంటారు. శ్రీ మహా విష్ణువు స్వయంభుగా అవతరించిన ఎనిమిది క్షేత్రాలలో తిరుపతి కూడా ఒకటి. రామానుజాచార్యులు కొండ కింద గోవిందరాజస్వామి (Govindarja swamy) ఆలయాన్ని ఏర్పాటు చేయడంతో తిరుపతి చరిత్రకు బీజం పడింది. ఈ చారిత్రక నగరం (Historical City) మరో రెండు రోజుల్లో ఫిబ్రవరి 24న (February 24th) పుట్టిన రోజుని జరుపుకోనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాము.
తిరుపతి నగరం క్రీ.శ.1130 ఫిబ్రవరి 24న ఏర్పడినట్లుగా చారిత్రక సంబంధమైన ఆధారాలున్నాయి (Historical proofs). ఈ నేపథ్యంలో తిరుపతి నగరం ఫిబ్రవరి 24, శుక్రవారం (Formation Day) నాడు తన 893వ పుట్టినరోజును జరుపుకోనుంది. 893 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 24వ తేదీన శ్రీ వైష్ణవ సన్యాసి భగవద్ రామానుజాచార్యులు ప్రస్తుతం నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజ స్వామి ఆలయానికి పునాది వేశారు. ఈ నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా (Spiritual Center) మార్చారు. తిరుపతి పట్టణ అభివృద్ధికి నాంది పలికారు.
గత ఏడాది ఫిబ్రవరి 20న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి పురాతన శాసనాలను (Old Statutes) ఇక్కడకు తెప్పించారు. ఈ శాసనాల్లో తిరుపతికి 1130 ఫిబ్రవరి 24న రామానుజాచార్యుల వారు శంకుస్థాపన (Foundation Stone laid by Sri Ramanujacharyulu) చేసినట్లుగా రుజువులు దొరికాయి. ఈ ఆధారాలు (Evidences) టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న గోవిందరాజ ఆలయంలో వెలుగులోకి వచ్చాయి.
సౌమ్య నామ సంవత్సరం ఉత్తరా నక్షత్ర సోమవరం ఫాల్గుణ పౌర్ణమి నాడు రామానుజాచార్యుల వారు గోవిందరాజుల పీఠాధిపతిని ప్రతిష్టించి, నిత్య కైంకర్యములు చేసి, నాలుగు మాడ వీధులను (Four Maada Streets) అగ్రహారాలతో తిరుపతిని నిర్మించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత దేవాలయం చుట్టూ ఉన్న ఇతర చిన్న చిన్న సంఘాలు అన్నీ కలిపి తిరుపతిగా మారాయి. ఈ క్షేత్రం నేడు భారతదేశంలో హిందువులకు పుణ్య క్షేత్రంగా మారింది. ఈ ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనికమైన పుణ్యక్షేత్రాల్లో (One of the Richest Temple in the World) ఒకటిగా ఉంది. అంతేకాదు… రామానుజుల రాకకు ముందు తిరుపతి లేదన్నారు. తిరుచానూరులో శ్రీవారి ఉత్సవాలు (Srivari Utsavam in Tiruchanur) వైభవంగా జరిగాయి. పండుగల కోసం అనేక ప్రదేశాలు ఉన్నాయి… కానీ మరే ఇతర నగరంలో కూడా ఆ నగర స్థాపనకు ఖచ్చితమైన తేదీ లేదు,” (remaining Cities there is no proofs for formation date) అని చెప్పారు.
తిరుమల ఆలయంలో సమతా ధర్మాన్ని (Samata Dharmam) స్థాపించి, పూజా కైంకర్యములను రూపొందించిన భగవద్ రామానుజులు (Bhagavad Ramanujulu) తిరుపతి నగరానికి మూలకర్త. క్రమంగా చుట్టూ అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు పేరిట రామానుజ పురం (Ramanuja Puram) అని నామకరణం చేశారు. అందుకే ఇది చాలా కాలం పాటు రామానుజ పురంగా (Before called Ramanujapuram) గౌరవించబడింది. ఈ పట్టణాన్ని మొదట గోవిందరాజ పట్టణం అని, తరువాత రామానుజ పురం అని పిలిచేవారు.
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ (Tirupati Municipal Corporation) ఆధ్వర్యంలో గోవిందరాజ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ రామానుజాచార్యుల విగ్రహానికి ప్రత్యేక పూజలు (Special Puja for Ramanujacharyulu) నిర్వహించి, నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపును (Procession) నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పౌర సంఘం అనేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను (Cultural Activities) కూడా ప్లాన్ చేసింది.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆస్తుల వివరాలు : Sri Venkateshwara Swamy's Assets
- దేశవ్యాప్తంగా మొత్తం రూ.85,705 కోట్ల విలువైన 960 రకాల ఆస్తులు (Rs. 85,705 Crores)
- వీటి మార్కెట్ విలువ దాదాపు 2 లక్షల కోట్లు (Market Value is Rs. 2 Lac Crores)
- దేశవ్యాప్తంగా మొత్తం 7,123 ఎకరాల భూమి (7,123 Acres Land)
- బ్యాంకుల్లో 14 వేల కోట్ల రూపాయలకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు (Fixed deposits above 14K Crores)
- 14 టన్నుల బంగారం నిల్వలు (14 Tons of Gold)
గోవింద నామాలు : Govinda Namalu
శ్రీ శ్రీనివాసా గోవిందా |
శ్రీ వేంకటేశా గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
భక్తవత్సలా గోవిందా |
భాగవత ప్రియ గోవిందా |
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా |
నిత్యనిర్మలా గోవిందా |
నీల మేఘశ్యామ గోవిందా |
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా |
పురాణ పురుషా గోవిందా |
పుండరీకాక్ష గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా |
నందనందనా గోవిందా |
నవనీతచోర గోవిందా |
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా |
పశుపాలక శ్రీ గోవిందా |
పాపవిమోచన గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా |
దుష్టసంహార గోవిందా |
దురిత నివారణ గోవిందా |
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా |
శిష్టపరిపాలక గోవిందా |
కష్టనివారణ గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
వజ్రమకుటధర గోవిందా |
వరాహమూర్తి గోవిందా |
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
గోపీ లోల గోవిందా |
గోవర్ధనోద్ధార గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
దశరథనందన గోవిందా |
దశముఖమర్దన గోవిందా |
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
పక్షివాహన గోవిందా |
పాండవప్రియ గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
మధుసూదన హరి గోవిందా |
మహిమ స్వరూప గోవింద ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
వేణుగానప్రియ గోవిందా |
వేంకటరమణా గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
సీతానాయక గోవిందా |
శ్రితపరిపాలక గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
అనాథరక్షక గోవిందా |
ఆపద్బాంధవ గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
శరణాగతవత్సల గోవిందా |
కరుణాసాగర గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
కమలదళాక్ష గోవిందా |
కామితఫలదా గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
పాపవినాశక గోవిందా |
పాహి మురారే గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
శ్రీముద్రాంకిత గోవిందా |
శ్రీవత్సాంకిత గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
ధరణీనాయక గోవిందా |
దినకరతేజా గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా |
పద్మావతిప్రియ గోవిందా |
ప్రసన్నమూర్తీ గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
అభయ మూర్తి గోవింద |
ఆశ్రీత వరద గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
శంఖచక్రధర గోవిందా |
శార్ఙ్గగదాధర గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
విరజాతీర్థస్థ గోవిందా |
విరోధిమర్దన గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
సాలగ్రామధర గోవిందా |
సహస్రనామా గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
లక్ష్మీవల్లభ గోవిందా |
లక్ష్మణాగ్రజ గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
కస్తూరితిలక గోవిందా |
కాంచనాంబర గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
వానరసేవిత గోవిందా |
వారధిబంధన గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
అన్నదాన ప్రియ గోవిందా |
అన్నమయ్య వినుత గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
ఆశ్రీత రక్షా గోవింద |
అనంత వినుత గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
ధర్మసంస్థాపక గోవిందా |
ధనలక్ష్మి ప్రియ గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
ఏక స్వరూపా గోవింద |
లోక రక్షకా గోవింద ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
వెంగమాంబనుత గోవిందా
వేదాచలస్థిత గోవిందా
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
రామకృష్ణా హరి గోవిందా |
రఘుకులనందన గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
వజ్రకవచధర గోవిందా |
వసుదేవ తనయ గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
బిల్వపత్రార్చిత గోవిందా |
భిక్షుకసంస్తుత గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
బ్రహ్మాండరూపా గోవిందా |
భక్తరక్షక గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
నిత్యకళ్యాణ గోవిందా |
నీరజనాభ గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
హథీరామప్రియ గోవిందా |
హరిసర్వోత్తమ గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
జనార్దనమూర్తి గోవిందా |
జగత్సాక్షిరూప గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
అభిషేకప్రియ గోవిందా |
ఆపన్నివారణ గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
రత్నకిరీటా గోవిందా |
రామానుజనుత గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
స్వయంప్రకాశా గోవిందా |
సర్వకారణ గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
నిత్యశుభప్రద గోవిందా |
నిఖిలలోకేశ గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
ఆనందరూపా గోవిందా |
ఆద్యంతరహితా గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
ఇహపరదాయక గోవిందా |
ఇభరాజరక్షక గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
గరుడాద్రి వాసా గోవింద |
నీలాద్రి నిలయా గోవింద ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
అంజనీద్రీస గోవింద |
వృషభాద్రి వాసా గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
తిరుమలవాసా గోవిందా |
తులసీమాల గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
శేషాద్రినిలయా గోవిందా |
శ్రేయోదాయక గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
పరమదయాళో గోవిందా |
పద్మనాభహరి గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
గరుడవాహన గోవిందా |
గజరాజరక్షక గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
సప్తగిరీశా గోవిందా |
ఏకస్వరూపా గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
ప్రత్యక్షదేవా గోవిందా |
పరమదయాకర గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
వడ్డికాసులవాడ గోవిందా |
వసుదేవతనయా గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
స్త్రీపుంరూపా గోవిందా |
శివకేశవమూర్తి గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
శేషసాయినే గోవిందా |
శేషాద్రినిలయా గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
అన్నదాన ప్రియ గోవిందా |
ఆశ్రితరక్షా గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
వరాహ నరసింహ గోవిందా |
వామన భృగురామ గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
బలరామానుజ గోవిందా |
బౌద్ధకల్కిధర గోవిందా |
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
దరిద్రజనపోషక గోవిందా |
ధర్మసంస్థాపక గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా |
వజ్రమకుటధర గోవిందా |
వైజయంతిమాల గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా |
శ్రీనివాస శ్రీ గోవిందా |
శ్రీ వేంకటేశా గోవిందా ||
గోవిందా హరి గోవిందా |
గోకుల నందన గోవిందా ||
శ్రీ వెంకటేశ్వర గోవింద నామావళి సంపూర్ణం ||