ఫిబ్రవరి 18న మహాశివరాత్రి : Mahashivratri on February 18
హిందువులకు అతి పవిత్రమైన విశిష్టమైన పండుగల్లో మహా శివరాత్రి (Mahashivratri) ఒకటి. హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది 2023 ఫిబ్రవరి 18వ తేదీ శనివారం మహా శివరాత్రి పండుగను (Festival) జరుపుకోనున్నారు.
ఫిబ్రవరి 18న మహాశివరాత్రి : Mahashivratri on February 18
హిందువులకు అతి పవిత్రమైన విశిష్టమైన పండుగల్లో మహా శివరాత్రి (Mahashivratri) ఒకటి. హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది 2023 ఫిబ్రవరి 18వ తేదీ శనివారం మహా శివరాత్రి పండుగను (Festival) జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా (World wide) ఉన్న అన్ని శివాలయాల్లో (Shiv Mandir) శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పగలు ఉపవాస దీక్ష : Morning Initiation of Fasting
శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం (Fasting) ఉంటారు. మనస్సులో శివనామ స్మరణ చేస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కోసం నిదర పోకుండా జాగరణ (Jagran) తో మేలుకొని ఉండి భక్తిశ్రద్ధలతో (Devotedly) శివునికి అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. ఈ పండుగ హిందువులకు ముఖ్యంగా,శైవులకు అత్యంత పుణ్య ప్రదమైన రోజు (The most auspicious day for Shaivites). మహశివరాత్రిని హిందువులు ఏంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివున్ని కొలుస్తూ తరిస్తారు.
హిందూ మతంలో మహా శివరాత్రి పండుగకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. ప్రతి ఏడాది (Every Year) మాఘ మాసంలో చతుర్దశి, అమావాస్య తిథుల మధ్య మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడికి అత్యంత శ్రద్దాభక్తితో (Devotional) పూజలు చేస్తారు. ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. మహా శివరాత్రి రోజునే శివపార్వతుల కళ్యాణం జరిగినట్లు హిందూ పురాణాలు (Hindu Myths) చెబుతున్నాయి. శివరాత్రి నాడే లింగోద్భవం జరిగిందని చాలా మంది భక్తులు నమ్ముతారు. ఈ పర్వదినాన శైవ క్షేత్రాలతో పాటు, పరమేశ్వరుని ఆలయాల్లో ఆయన దర్శనం కోసం భక్తుల రద్దీ (Congestion of devotees) ఎక్కువగా ఉంటుంది.
మహాశివరాత్రి పర్వదినాన మాలలు ధరించిన శివస్వాములతో పాటు సాధారణ భక్తులు కూడా శివాలయాలను సందర్శిస్తారు. మన దేశంలో (In India) మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాల్లో ప్రత్యేక వేడుకలు (Special celebrations) నిర్వహించడం ఎన్నో ఏళ్ల నుంచి సాంప్రదాయంగా వస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలంలో మల్లిఖార్జున స్వామి (Srisailam Mallikharjuna Swamy) బ్రహ్మోత్సవాలు, విజయవాడలో ప్రత్యేక కార్యక్రమాలు, కోటప్ప కొండలోని త్రికోటేశ్వర ఆలయంలో (Kotappakonda Trikotesvara Temple), అమరావతిలోని అమరేశ్వర ఆలయంలో, వేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా శివరాత్రి వేడుకలను నిర్వహిస్తారు. వీటితో పాటు దేశంలో ఉన్న అన్ని శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలను విభిన్నంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి వేళ భారతదేశంలో ఉన్న ప్రముఖ శివాలయాలు, వాటి విశిష్టతలు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
శ్రీశైలం మల్లికార్జున స్వామి : Srisailam Mallikharjuna Swamy
భారతదేశంలో కొలువై ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో (Dwadasa Jyotirlingas) శ్రీశైలం (Srisailam) ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొలువై ఉన్న శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 11 నుంచి 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు (Brahmotsav) నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక దేవిని పురవీధుల్లో ఊరేగించి, ఆలయ ప్రాంగణంలో (temple Premises) ప్రత్యేక వాహన సేవల ద్వారా పూజలు చేస్తారు. మహాశివరాత్రి వేళ జరిగే ఈ వేడుకలను తిలకించేందుకు ఆంధ్రా, తెలంగాణతో పాటు కర్నాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాది (Lacs of Devotees) మంది భక్తులు తరలివస్తారు. శ్రీశైలం క్షేత్రాన్ని చేరుకోవడానికి ఆంధ్రా, తెలంగాణ నుంచి రోడ్డు మార్గం అందుబాటులో ఉంది.
ఉమానంద ఆలయం, అస్సాం : Umananda Temple Assam
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోని గౌహతిలో ఉన్న ఉమానంద ఆలయంలో (Assam Umananda Temple) మహా శివరాత్రి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. బ్రహ్మపుత్ర నదిలోని (Brahmaputra River) పీకాక్ ద్వీపంలో ఈ ఆలయం నిర్మించబడింది. ఇక్కడ శివరాత్రి వేడుకలను (Sivaratri Celebrations) చూసేందుకు లక్షలాది మంది భక్తులు గౌహతి నగరానికి తరలి వెళ్తారు.
భావనాథ్ గుజరాత్ : Bhavanath Gujarat
గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ గిర్ జతీయ ఉద్యానవనానికి (Gir National Park) ప్రసిద్ధి చెందిందనే విషయం చాలా మందికి తెలుసు. అయితే గిర్ అడవిలో నివసించే సాధువులు, భావనాథ్ మహాదేవ్ (Bhavnath Mahadev) తలేటికి 200 ఏళ్ళ నుంచి నిలయంగా ఉంది. మహాశివరాత్రి సమయంలో జునాగఢ్ లో జరిగే శివరాత్రి సంబరాలను చూసేందుకు దేశ నలమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ ప్రాంతానికి తరలివస్తారు. ఇక్కడ ప్రతి ఏటా జరిగే వేడుకలు మహాశివరాత్రికి 5 రోజుల ముందు నుంచే ప్రారంభమవుతాయి. పండుగ రోజున ఈ వేడుకలు ముగుస్తాయి.
భూతనాథ్ ఆలయం, హిమాచల్ ప్రదేశ్ : Bhutanath Temple Himachal Pradesh
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని (Himachal Pradesh) మండి అనే చిన్న పట్నంలో మహాశివరాత్రి వేడుకలు జరిగే కొన్ని ఉత్తమమైన ప్రదేశాలలో ఇది ఒకటిగా చెబుతారు. ఇక్కడి భూత్ నాథ్ ఆలయంలో (Bhutanath Temple) శివరాత్రి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. జానపథ కథల్లో తెలిపిన ప్రకారం, క్రీ.శ.5వ శతాబ్దంలో మండి రాజకుటుంబం వంశస్తులు ప్రతి ఏడాది వారం రోజుల పాటు ఈ మహాశివరాత్రి ఉత్సవాలనునిర్వహిస్తున్నారని వ్రాయబడి ఉంది.
మహాకాళేశ్వర ఆలయం, ఉజ్జయిని : Mahakaleshvar Temple Ujjain
ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి గాంచిన జ్యోతిర్లింగాలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొలువై ఉన్న మహాకాళేశ్వర్ ఆలయం (Mahakaleshvar Temple) ఒకటి. ఇక్కడ మహా శివరాత్రి వేడుకలను షిప్రా నది (Shipra River) ఒడ్డున జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, దూషణ అనే పేరుగల రాక్షసుడు (A demon named Dushana) అవంతి నగరంలో నివసించే ప్రజలను హింసించేవాడు. అప్పుడు పరమేశ్వరుడు (Eshwar) భూమి నుంచి ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని వధించాడు. అప్పుడు అవంతి ప్రజల కోరిక మేరకు పరమేశ్వరుడు మహాకాళేశ్వర జ్యోతిర్లింగ (Mahakaleshwar Jyotirling) రూపంలో ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు.
నీలకంఠస్వామి, రిషికేష్ : Neelkanth Rishikesh
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ (Rishikesh, Uttarakhand) ఎన్నో ఘాట్లకు ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ కొలువై ఉన్న నీలకంఠ (Neelkanth) మహాదేవుని ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి రోజున భోలేనాథుని (Bholenath) దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో తరలివస్తారు. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడికొచ్చే భక్తులకు ఆహ్లాదం కోసం రివర్ రాఫ్టింగ్ (River Rafting) వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
శ్రీ సోమనాథ జ్యోతిర్లింగ దేవాలయం, గుజరాత్ : Sri Somnath Jyotirlinga Gujarat
గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ రాత్రి వేళలో ఎల్ఈడీ లైట్లు (LED lights), పండ్లతో (Fruit decoration) ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ పవిత్రమైన రోజున సోమనాథేశ్వరునికి పాలు, తేనే, పంచదార, నెయ్యి, పెరుగు, నీటితో (Shivling Puja with milk, honey, sugar, ghee, curd and water) శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
లింగాష్టకం: Lingashtakam
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసితశోభిత లింగం ।
జన్మజదుఃఖవినాశక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 1 ॥
దేవమునిప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం ।
రావణదర్పవినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 2 ॥
సర్వసుగన్ధిసులేపిత లింగం
బుద్ధివివర్ధనకారణ లింగం ।
సిద్ధసురాసురవన్దిత లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 3 ॥
కనకమహామణిభూషిత లింగం
ఫనిపతివేష్టిత శోభిత లింగం ।
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 4 ॥
కుంకుమచందనలేపిత లింగం
పంకజహారసుశోభిత లింగం ।
సంచితపాపవినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 5 ॥
దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగం ।
దినకరకోటిప్రభాకర లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 6 ॥
అష్టదలోపరివేష్టిత లింగం
సర్వసముద్భవకారణ లింగం ।
అష్టదరిద్రవినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 7 ॥
సురగురుసురవరపూజిత లింగం
సురవనపుష్ప సదార్చిత లింగం ।
పరమపదం పరమాత్మక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 8 ॥
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥
ఇతి శ్రీ లింగాష్టకం ||