రేపు హనుమజ్జయంతి : Tomorrow is Hanuman Jayanthi

అంజనీ పుత్రుడు, శ్రీరాముడి (Sriram) బంటు, ధైర్యానికి ప్రతీక, స్వామి విధేయుడిగా పేరొందిన రామ భక్తుడు హనుమాన్ జయంతి (Hanuman Jayanthi) రేపు అనగా గురువారం (6th April) హిందువులు జరుపుకోనున్నారు.

రేపు హనుమజ్జయంతి : Tomorrow is Hanuman Jayanthi

రేపు హనుమజ్జయంతి : Tomorrow is Hanuman Jayanthi

అంజనీ పుత్రుడు, శ్రీరాముడి (Sriram) బంటు, ధైర్యానికి ప్రతీక, స్వామి విధేయుడిగా పేరొందిన రామ భక్తుడు హనుమాన్ జయంతి (Hanuman Jayanthi) రేపు అనగా గురువారం (6th April) హిందువులు జరుపుకోనున్నారు.

 

హిందువుల క్యాలెండర్ ప్రకారం (According to Hinndu calendar) ... చైత్ర మాసంలోని పౌర్ణమి రోజున హనుమంతుడి జయంతి అనగా హనుమజ్జయంతి (Hanuman Jayanthi) జరుపుకుంటారని శాస్త్రాల్లో రాసి ఉంది. శ్రీరాముడి పరమ భక్తుడిగా హనుమంతుడిని ప్రతి ఒక్క హిందువూ (every Hindu) కీర్తించి పూజిస్తారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఉపవాసాలు కూడా ఉంటారు. హిందువులు హనుమంతుడి ఆలయాలను (Hanuman temple) సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అంతే కాకుండా ఆయనకు ప్రీతి పాత్రమైన సుందర కాండను పఠిస్తారు.

 

హనుమాన్ జయంతి, హనుమంతుని జన్మోత్సవం, భజరంగబలి (Bajrang Bali) జయంతి ఇలా అనేక పేర్లతో భారత దేశంలో (India) జరుపుకుంటారు. యావత్ భారత దేశం పండుగను జరుపుకుంటుంది. హనుమంతుడి ఆలయాలు రోజున క్రిక్కిరిసి ఉంటాయి. వాస్తవానికి పొర్ణమి తిథి ఏప్రిల్ 5 తేదీ ఉదయం 9:19 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 6 తేదీ ఉదయం 10:04 గంటలకు ముగుస్తుంది. కొద్దీ గంటల సమయాన్ని పవిత్రమైనదిగానూ, శుభముహూర్త వేళలుగానూ హిందువులు (Hindus) పరిగణిస్తారు. సమయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో హనుమంతుడిని పూజించి తరిస్తారు.

హనుమంతుని జన్మం : Birth of Hanuman

సుమేరు రాజ్యానికి రాజుగా ఉన్న కేసరి (Kesari), అంజనీ దేవిలకు (Anjani Devi) హనుమంతుడు పుట్టినట్లు పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఆయన శివుని అవతారంగా (incarnation of Shiva) కూడా పేర్కొంటారు. శ్రీరాముడికి సేవ చేసేందుకు గానూ శివుడు హనుమంతుడి అవతారంలో పుట్టాడని పండితులు చెబుతారు. హనుమంతుడిని వివిధ రకాల పేర్లు భజరంగబలి, మారుతి నందన్ (Maruti Nandan), పవన పుత్ర (Pavana putra), అంజనీ పుత్ర, సంకట మోచన్ (Sankata Mochan) అని కూడా పిలుస్తారు. భక్తులు తమ కష్టాలను, ఇబ్బందులను తొలగించే హనుమంతుడిని సంకట మోచనుడిగా పిలుస్తారు.

 

హనుమజ్జయంతి (Hanuman Jayanthi) రోజున హనుమంతుడి విగ్రహాలను ఊరేగిస్తారు. ఈసారి హనుమజ్జయంతిని హర్ష యోగంలో నిర్వహించనుండడం ప్రత్యేకత. పవిత్రమైన రోజున హస్తా, చిత్ర నక్షత్రాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. హనుమాన్ చాలిసాను (Hanuman Chalisa) 11 సార్లు పఠించడం వల్ల శని దోషం తొలగి సుఖ శాంతులతో ఉంటారని భక్తుల నమ్మకం.

హనుమాన్ చాలీసా : Hanuman Chalisa

 

దోహా

శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి

వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి

బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార

బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార

 

ధ్యానం

గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్

రామాయణ మహామాలా రత్నం వందే-()నిలాత్మజమ్

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్

భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్

 

చౌపాఈ

జయ హనుమాన జ్ఞాన గుణ సాగర

జయ కపీశ తిహు లోక ఉజాగర 1

 

రామదూత అతులిత బలధామా

అంజని పుత్ర పవనసుత నామా 2

 

మహావీర విక్రమ బజరంగీ

కుమతి నివార సుమతి కే సంగీ 3

కంచన వరణ విరాజ సువేశా

కానన కుండల కుంచిత కేశా 4

 

హాథవజ్ర ధ్వజా విరాజై

కాంథే మూంజ జనేవూ సాజై 5

 

శంకర సువన కేసరీ నందన

తేజ ప్రతాప మహాజగ వందన 6

 

విద్యావాన గుణీ అతి చాతుర

రామ కాజ కరివే కో ఆతుర 7

 

ప్రభు చరిత్ర సునివే కో రసియా

రామలఖన సీతా మన బసియా 8

 

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా

వికట రూపధరి లంక జలావా 9

 

భీమ రూపధరి అసుర సంహారే

రామచంద్ర కే కాజ సంవారే 10

 

లాయ సంజీవన లఖన జియాయే

శ్రీ రఘువీర హరషి ఉరలాయే 11

రఘుపతి కీన్హీ బహుత బడాయీ

తుమ మమ ప్రియ భరత సమ భాయీ 12

 

సహస్ర వదన తుమ్హరో యశగావై

అస కహి శ్రీపతి కంఠ లగావై 13

 

సనకాదిక బ్రహ్మాది మునీశా

నారద శారద సహిత అహీశా 14

 

యమ కుబేర దిగపాల జహాం తే

కవి కోవిద కహి సకే కహాం తే 15

 

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా

రామ మిలాయ రాజపద దీన్హా 16

 

తుమ్హరో మంత్ర విభీషణ మానా

లంకేశ్వర భయే సబ జగ జానా 17

 

యుగ సహస్ర యోజన పర భానూ

లీల్యో తాహి మధుర ఫల జానూ 18

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ

జలధి లాంఘి గయే అచరజ నాహీ 19

 

దుర్గమ కాజ జగత కే జేతే

సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే 20

 

రామ దుఆరే తుమ రఖవారే

హోత ఆజ్ఞా బిను పైసారే 21

 

సబ సుఖ లహై తుమ్హారీ శరణా

తుమ రక్షక కాహూ కో డర నా 22

 

ఆపన తేజ సమ్హారో ఆపై

తీనోం లోక హాంక తే కాంపై 23

 

భూత పిశాచ నికట నహి ఆవై

మహవీర జబ నామ సునావై 24

 

నాసై రోగ హరై సబ పీరా

జపత నిరంతర హనుమత వీరా 25

సంకట సే హనుమాన ఛుడావై

మన క్రమ వచన ధ్యాన జో లావై 26

 

సబ పర రామ తపస్వీ రాజా

తినకే కాజ సకల తుమ సాజా 27

 

ఔర మనోరధ జో కోయి లావై

తాసు అమిత జీవన ఫల పావై 28

 

చారో యుగ ప్రతాప తుమ్హారా

హై ప్రసిద్ధ జగత ఉజియారా 29

 

సాధు సంత కే తుమ రఖవారే

అసుర నికందన రామ దులారే 30

 

అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా

అస వర దీన్హ జానకీ మాతా 31

 

రామ రసాయన తుమ్హారే పాసా

సదా రహో రఘుపతి కే దాసా 32

 

తుమ్హరే భజన రామకో పావై

జన్మ జన్మ కే దుఖ బిసరావై 33

 

అంత కాల రఘుపతి పురజాయీ

జహాం జన్మ హరిభక్త కహాయీ 34

ఔర దేవతా చిత్త ధరయీ

హనుమత సేయి సర్వ సుఖ కరయీ 35

 

సంకట ()టై మిటై సబ పీరా

జో సుమిరై హనుమత బల వీరా 36

 

జై జై జై హనుమాన గోసాయీ

కృపా కరహు గురుదేవ కీ నాయీ 37

 

జో శత వార పాఠ కర కోయీ

ఛూటహి బంది మహా సుఖ హోయీ 38

 

జో యహ పడై హనుమాన చాలీసా

హోయ సిద్ధి సాఖీ గౌరీశా 39

 

తులసీదాస సదా హరి చేరా

కీజై నాథ హృదయ మహ డేరా 40

 

దోహా

పవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్

రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్

సియావర రామచంద్రకీ జయ పవనసుత హనుమానకీ జయ బోలో భాయీ సబ సంతనకీ జయ।