రేపు మహావీర్ జయంతి : Tomorrow is Mahavir Jayanti

జైన మతస్థులకు మహావీర్ జయంతి అత్యంత ప్రత్యేకమైనది. ధర్మాన్ని ప్రచారం చేసిన మహా గురువుగా మహావీరుడు ప్రఖ్యాతి చెందాడు. ఆయన జయంతి సందర్భంగా జైన మతస్థులు ప్రభాత్ ఫేరీ, ఊరేగింపు వంటి విశిష్ట కార్యక్రమాలను చేపడతారు. మానవునిగా జన్మించిన వారు మోక్షాన్ని పొందేందుకు అవసరమైనటువంటి ఐదు ముఖ్యమైన సూత్రాలను మహావీరుడు వివరించాడు.

రేపు మహావీర్ జయంతి : Tomorrow is Mahavir Jayanti

రేపు మహావీర్ జయంతి : Tomorrow is Mahavir Jayanti

జైన మతస్థులకు మహావీర్ జయంతి అత్యంత ప్రత్యేకమైనది. ధర్మాన్ని ప్రచారం చేసిన మహా గురువుగా మహావీరుడు ప్రఖ్యాతి చెందాడు. ఆయన జయంతి సందర్భంగా జైన మతస్థులు  ప్రభాత్ ఫేరీ, ఊరేగింపు వంటి విశిష్ట కార్యక్రమాలను చేపడతారు. మానవునిగా జన్మించిన వారు మోక్షాన్ని పొందేందుకు అవసరమైనటువంటి ఐదు ముఖ్యమైన సూత్రాలను మహావీరుడు వివరించాడు. దీనినే పంచ సిద్ధాంతమని అంటారు. అహింస, అస్తేయ, బ్రహ్మచర్యం, సత్యం, అపరిగ్రహం... ఇవే పంచ సూత్రాలు. మహావీర్ జయంతి రోజున జైనులతో పాటు మిగిలిన సమాజానికి చెందిన వారు సైతం ఐదు సూత్రాలను స్మరించుకుంటూ రోజున నిర్వహించే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి ఒక్కరో మహావీరుడు బోధించిన పంచ సూత్రాలను ఆచరించాలని ప్రచారం చేస్తారు. పవిత్రమైన రోజున కఠిన ఉపవాస వ్రతం చేస్తారు.

 

మహావీర్ జయంతి శుభ ముహూర్తం

హిందూ పంచాంగం ప్రకారం... ఛైత్ర మాసంలో శుక్ల పక్షం త్రయోదశి తిథి నాడు అనగా 3 ఏప్రిల్ 2023 ఉదయం 6:24 గంటలకు ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు అంటే 4 ఏప్రిల్ 2023 మంగళవారం ఉదయం 8:05 గంటలకు ముగుస్తుంది. ద్వాదశ తిథి సోమవారం ఉదయమే ముగిసింది. అందుకే ఏప్రిల్ 4 తేదీ తిథిని పరిగణనలోకి తీసుకుని మహావీర్ జయంతిని జరుపుకోనున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం 3 తేదీనే మహావీర్ జయంతిని జరుపుకుంటున్నారు.

మహావీరుడు ఎవరు : Who is Mahaveer?

బీహార్లోని వైశాలికి సమీపంలోని కుండల గ్రామంలో లార్డ్ మహావీర్ రాజు సిద్ధార్థ, రాణి త్రిసాల దంపతులకు క్రీస్తు పూర్వం 599 BC కాలంలో మహావీర్ (వర్థమాన్) జన్మించినట్లు చెబుతారు. తన 28 సంవత్సరాల వయసులో తండ్రి మరణించాడు. సమయంలో యశోధర అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమార్తె పుట్టింది. రాజ కుటుంబంలో పుట్టిన మహావీర్ (వర్థమాన్) కి విలాసాలు, సౌకర్యాలకు మాత్రం లోటు ఉండేది కాదు. అయితే మహావీర్ ఎప్పుడూ కూడా అటువంటి వాటిని కోరుకోలేదు, వాటిపైన వ్యామోహ పడలేదు. తనను ఖరీదైనవి ఏవీ ఆకర్షించలేదు. అందుకే తానేంటి? తన ఉనికి ఏంటి అనే దానిని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. అందుకే తన 36 సంవత్సరాల వయసులో రాజ్యాన్ని, తన కుటుంబాన్ని, ప్రాపంచిక విధులను వదిలి పెట్టి మనఃశాంతి, ప్రశాంతత కోసం అడవుల బాట పట్టదు. మోక్షం పొందడానికి దాదాపు 12 సంవత్సరాల పాటు వర్థమాన్  తపస్సు చేశాడు. అనంతరం తనకు పూర్తిగా జ్ఞానోదయం కలిగింది. తర్వాత ఆయన మహావీరుడిగా మారాడు. మగధ రాజ్యంతో సహా తూర్పు దిక్కులో ఉన్న ప్రదేశాలకు వెళ్లి తన సిద్ధాంతాలను బోధించాడు. బింబిసారుడు, అజాత శత్రువు వంటి రాజులను సైతం కలుసుకున్నాడు.

 

మహావీరుడు బోధించిన పంచ సిద్ధాంతాలు

మిమ్మల్ని మీరు జయించండి. ఎందుకంటే కోటి మంది శత్రువులను జయించడం కంటే ఒక్కటి ఉత్తమ విషయం.

ప్రతి ఆత్మ తనంతట తాను ఆనందమయుడు, సర్వజ్ఞుడు. ఆనందం అనేది మనలోనే ఉంటుంది. దాన్ని బయట వెతుక్కునేందుకు ప్రయత్నించొద్దు.

దేవునికి ప్రత్యేక ఉనికి అంటూ ఏమీ లేదు. మనం సరైన ప్రయత్నాలు చేస్తే దైవత్వాన్ని పొందొచ్చు.

అన్ని జీవుల పట్ల అహింసా వాదంతో ఉండాలి. మనసుతో, మాటతో, శరీరంతో ఎవరినీ హింసించకపోవడమే నిజమైన ఆత్మ నిగ్రహం.

విజయం సాధిస్తే పొంగిపోవద్దు.. ఓటమి వల్ల కుంగిపోవద్దు.. భయాన్ని జయించిన వారు మాత్రమే ప్రశాంతంగా జీవించగలరు.

72 ఏట తుది శ్వాస విడిచిన మహావీరుడు

మహావీరుడు తన 72 ఏట తుది శ్వాస విడిచారు. అప్పటికే 23 మంది తీర్థంకరులు ఉన్నప్పటికీ మహావీరుని హయాంలో జైన మతానికి విశేష ప్రాధాన్యత లభించింది. జైన మతం భారతదేశం నలుదిక్కులా వ్యాపించింది. 32 ఏళ్ల పాటు అహింస, ధర్మం గురించి ప్రచారం చేసిన మహావీరుడు జైనులకు ఆరాధ్య దైవమయ్యాడు. అందుకే ఆయన జయంతిని ప్రతి ఏటా ఛైత్ర మాసంలో జరుపుకుంటారు.