నేడు ఐపీఎల్ లో ఆడనున్న చెన్నై vs లక్నో : CSK vs LSG to be played in IPL today
ఒకరు నాలుగు సార్లు ఐపీఎల్ (IPL) ట్రోఫీ విజేత... తాను ఆడిన మొదటి మ్యాచ్లో పరాజయం... ఇంకొకరు... గత సీజన్లోనే ఐపీఎల్ లో అడుగుపెట్టిన జట్టు. ఈ సీజన్లో మొదటి మ్యాచ్లో ఘన విజయం సాధించిన జట్టు.
నేడు ఐపీఎల్ లో ఆడనున్న చెన్నై vs లక్నో : CSK vs LSG to be played in IPL today
ఒకరు నాలుగు సార్లు ఐపీఎల్ (IPL) ట్రోఫీ విజేత... తాను ఆడిన మొదటి మ్యాచ్లో పరాజయం... ఇంకొకరు... గత సీజన్లోనే ఐపీఎల్ లో అడుగుపెట్టిన జట్టు. ఈ సీజన్లో మొదటి మ్యాచ్లో ఘన విజయం సాధించిన జట్టు. ఇందులో పరాజయం చెందింది చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు కాగా... విజయాన్ని అందుకున్న జట్టు లక్నో సూపర్ జెయింట్స్ (LSG). ఈ రెండు జట్లూ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), లక్నో సూపర్ జెయింట్స్ 16 వ సీజన్లో నేడు 6 వ మ్యాచ్ (6th match) లో తలపడనున్నాయి.
విజయమే లక్ష్యంగా చెన్నై : CSK aim to win today match
ఐపీఎల్ (IPL) 16 వ సీజన్లో ఆడిన మొదటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో పరాజయాన్ని మూటకట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ నేడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో జరగనున్న మ్యాచ్లో విజయం సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగనుంది. గత ఏడాది ఐపీఎల్ విజేత (defending champion) గుహరత్ టైటాన్స్ (GT) తో జరిగిన మొదటి మ్యాచ్లో చెన్నై జట్టు ఓటమి చెందింది.
బ్యాట్స్మెన్లు రాణిస్తారా : Will the batsmen perform?
ఎన్నో ఆశలు పెట్టుకుని కోట్లు కుమ్మరించి సొంతం చేసుకున్న ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (All-rounder Ben Stokes) ఫిట్నెస్ సమస్యతో లీగ్ మొత్తానికి బౌలింగ్ కి (bowling) దూరమయ్యాడు. మొదటి మ్యాచ్లో బ్యాటింగ్ లో సైతం స్టోక్స్ నిరాశ పరిచాడు. మొదటి మ్యాచ్లో ఆశించిన మేరకు బ్యాట్స్మెన్లు రాణించలేదు. గుజరాత్తో (GT) జరిగిన ఆరంభ పోరులో కాన్వే, స్టోక్స్, రాయుడు, శివమ్ దూబే బ్యాటింగ్ లో పూర్తిగా నిరాశపరిచారు. రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మొదటి మ్యాచ్ ఓటమి తరువాత టీమ్ కెప్టెన్ MS ధోని (MS Dhoni) ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఈరోజు లక్నోతో (LSG) జరగనున్న మ్యాచ్లో బ్యాట్స్మెన్లు (Batsmens) రాణించి విజయాన్ని అందుకోవాలని ధోని ఆశాభావం వ్యక్తం చేసాడు. ఐపీఎల్ లో ఇరుజట్లూ ఒకసారి తలపడగా చెన్నై జట్టు విజయం సాధించింది.
ఇక నేడు సొంత మైదానంలో (home ground) మ్యాచ్ జరగనుండడం చెన్నై జట్టుకు కలిసివచ్చే అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే చెన్నై జట్టుకు ఉన్నంత ఫాలోయింగ్ (fan following) మిగిలిన జట్లకు లేదనడం అతిశయోక్తి కాదు. మొదటి మ్యాచ్లో ధోని గాయపడినట్లు (Dhoni injured nes) వార్తలొచ్చినప్పటికే జట్టు కోచ్ మాత్రం అటువంటిది ఏమీ లేదని ప్రకటించడం చెన్నై టీమ్ అభిమానులకు ఊరటనిచ్చింది. చెన్నై బౌలర్లు (CSK bowlers) కూడా రాణించాల్సిన అవసరం ఉంది. మొయిన్ అలీ (Moeen Ali), రవీంద్ర జడేజా (Jadeja) తమ అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే చెన్నై మిగిలిన మ్యాచ్ల్లో గెలిచేందుకు అవకాశం ఉంటుంది. జట్టులో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలో దిగి బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన రాజ్యవర్ధన్ హంగార్గేకర్ (bowler Rajyavardhan Hangargekar) కి తోడుగా జడేజా విజృంభిస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మరో విజయం కోసం లక్నో : Lucknow looking for another win
గత 15 వ సీజన్లోనే అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లోనే అదరగొట్టింది. ఢిల్లీ జట్టును (DC) మట్టికరిపించి విజయాన్ని అందుకుంది. ఢిల్లీపై భారీ విజయం సాధించిన లక్నో అదే జోరును కొనసాగించి చెన్నై టీమ్ (CSK) ని ఓడించాలని చూస్తోంది. టీమ్ కి చెందిన కైల్ మేయర్స్, కేఎల్ రాహుల్, పూరన్, స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోనితో బ్యాటింగ్ దళం పటిష్టంగా ఉంది. తొలి మ్యాచ్లో నిరాశపర్చిన కేఎల్ రాహుల్ (KL Rahul) పుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. లక్నో బౌలింగ్ దళం కూడా బలంగానే ఉంది. ప్రధానంగా తొలి మ్యాచ్లోనే మార్క్ వుడ్ 5 వికెట్ల (Mark wood 5 wickets) ప్రదర్శనతో ఉత్తమ గణాంకాలు నమోదు చేసాడు. మార్క్వుడ్ తో పాటు అవేశ్ ఖాన్, స్పిన్నర్లు రవి బిష్ణోయ్ (Bishnoi), గౌతమ్ (Gowtham) మంచి ఫామ్లో (in form) ఉండడం లక్నోకి కలిసి వచ్చే అంశమని చెప్పవచ్చు.
చెన్నై ప్రాబబుల్ ప్లేయింగ్ XI : CSK probable playing XI
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, MS ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్, మరియు రాజవర్ధన్ హంగర్గేకర్.
చెన్నై ఫుల్ స్క్వాడ్ : CSK full squad
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), శివమ్ దూబే, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ఆర్ఎస్ హంగర్గేకర్, తుషార్ దేశ్పాండే, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, అజింక్యా రహానే, నిశాంత్ సింధు, డ్వైన్ ప్రిటోరియస్, అజయ్ జాదవ్ మండల్, ప్రశాంత్ సోలంకి, సిమర్జీత్ సింగ్, ఆకాష్ సింగ్, భగత్ వర్మ
లక్నో ప్రాబబుల్ ప్లేయింగ్ XI
లక్నో: కెఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ మరియు జయదేవ్ ఉనద్కత్.
లక్నో ఫుల్ స్క్వాడ్ : LSG full squad
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), ఆయుష్ బడోని, మార్క్ వుడ్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, ప్రేరక్ మంకాడ్ స్వప్నిల్ సింగ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్, డేనియల్ సామ్స్, రొమారియో షెపర్డ్, యుధ్వీర్ సింగ్ చరక్, కరణ్ శర్మ, మయాంక్ యాదవ్, అమిత్ మిశ్రా, మనన్ వోహ్రా
మ్యాచ్ వివరాలు : Match details
మ్యాచ్ (match) : (CSK vs LSG) ఐపీఎల్ మ్యాచ్ 6 (IPL match 6)
వేదిక (Ground) : ఎంఏ చిదంబరం స్టేడియం (MA Chidambaram stadium)
లైవ్ స్ట్రీమింగ్ (live streaming) : జియో సినిమా (Jio cinema)
ఐపీఎల్ (IPL) 2023 16 వ సీజన్లో (16th season) ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ల పాయింట్లు (Points), గణాంకాలు (Match statistics)
టీమ్ |
మ్యాచ్లు (Matches) |
గెలిచినవి (Wins) |
ఓడినవి (Lost) |
టై (Tie) |
ఫలితం తేలనివి (No Result) |
పాయింట్లు (Points) |
నెట్ రన్ రేట్ (Net Run Rate) |
రాజస్థాన్ రాయల్స్ (RR) |
1 |
1 |
0 |
0 |
0 |
2 |
+3.600 |
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) |
1 |
1 |
0 |
0 |
0 |
2 |
+2.500 |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) |
1 |
1 |
0 |
0 |
0 |
2 |
+1.981 |
గుజరాత్ టైటాన్స్ (GT) |
1 |
1 |
0 |
0 |
0 |
2 |
+0.514 |
పంజాబ్ కింగ్స్ (PBKS) |
1 |
1 |
0 |
0 |
0 |
2 |
+0.438 |
కోల్కతా నైట్ రైడర్స్ (KKR) |
1 |
0 |
1 |
0 |
0 |
0 |
-0.438 |
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) |
1 |
0 |
1 |
0 |
0 |
0 |
-0.514 |
ముంబై ఇండియన్స్ (MI) |
1 |
0 |
1 |
0 |
0 |
0 |
-1.981 |
ఢిల్లీ క్యాపిటల్స్ (DC) |
1 |
0 |
1 |
0 |
0 |
0 |
-2.500 |
సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) |
1 |
0 |
1 |
0 |
0 |
0 |
-3.600 |