జగన్నాథుని రథయాత్రకు సర్వం సిద్ధం : Everything is ready for Jagannath's chariot journey

ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Puri Jagannath's Ratha Yatra) కోసం సర్వం సిద్ధమైంది. ప్రతి ఏడాది ఆషాడ శుద్ధ తదియ రోజున ఈ రథయాత్ర ప్రారంభం అవుతుంది.

జగన్నాథుని రథయాత్రకు సర్వం సిద్ధం : Everything is ready for Jagannath's chariot journey

జగన్నాథుని రథయాత్రకు సర్వం సిద్ధం : Everything is ready for Jagannath's chariot journey 

ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Puri Jagannath's Ratha Yatra) కోసం సర్వం సిద్ధమైంది. ప్రతి ఏడాది ఆషాడ శుద్ధ తదియ రోజున ఈ రథయాత్ర ప్రారంభం అవుతుంది. దీనిని వీక్షించి తరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ రథయాత్ర కోసం ఒడిశా ప్రభుత్వం (Odisha government) పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను ఇప్పటికే ఏర్పాటు చేసింది. 

నేటి (మంగళవారం) ఉదయం బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠిస్తారు. అనంతరం మంగళ హారతి ఇస్తారు. పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు విగ్రహాలను ప్రతిష్ఠించిన రథాలపై బంగారు చీపురుతో ఊడ్చిన (swept with a golden broom) తరువాత రథయాత్ర ప్రారంభం అవుతుంది. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు భక్తులు రథాలను లాగడం ప్రారంభిస్తారు. ఈ రథాలు నేటి సాయంత్రం గుండిచా మందిరం (Gundicha Temple) వద్దకు చేరుకునేలా ఏర్పాట్లను చేసారు. ఈ ఏడాది జగన్నాథుని రథయాత్రకు సుమారు 10 లక్షల మంది వరకూ వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లను పూర్తి చేశారు. నిన్నటి సాయంత్రం (సోమవారం) 6.30 గంటలకు నందిఘోష్‌, తాళధ్వజ, దర్పదళన్‌ అనే మూడు రథాలు (Three chariots) ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన కార్డన్ (Cordon) వద్దకు చేరుకున్నాయి. దీనికి ముందుగా ఆలయ అర్చకులు ఆలయంలోని జగన్నాథుడి మెడలోని పూల మాలలు తీసుకుని వచ్చి నందిఘోష్‌, తాళధ్వజ, దర్పదళన్‌ రథాల మధ్యన ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు, పోలీసులు అందరూ కలిసి హరిబోల్ (జై జగన్నాథ్) నినాదాల మధ్య రథాలను శ్రీక్షేత్ర కార్యాలయం నుంచి జగన్నాథుని సన్నిధి వరకు లాక్కుని వెళ్లారు.

 గుండిచాదేవి మందిరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. జగన్నాథుడు భక్తుల మధ్యకు రథాలపై వచ్చి తనను పెంచిన గుండిచాదేవి ఆలయానికి భక్తుల మధ్య నుంచి వెళ్తాడు. తనని పెంచిన తల్లి పెట్టే గోరుముద్దలు జగన్నాథుడు ఆరగిస్తారు. ఈ రథయాత్రను దివి నుంచి దేవతలూ వీక్షిస్తారని అందరూ విశ్వసిస్తారు. పురుషోత్తముని నిలయమైన పూరీని సాక్షాత్ వైకుంఠపురంగా భక్తులు విశ్వసిస్తారు. జగన్నాథుడు తన సోదరుడైన బలభద్ర, సోదరి సుభద్రలతో పూరీ దేవాలయంలోని గర్భగుడిలో కొలువుదీరి ఉంటాడు. ఈ ముగ్గురు మూర్తులకు కొద్దీ దూరంలోనే మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది. జగన్నాథుడు రథయాత్రలో తనతో పాటు మహాలక్ష్మిని తీసుకుని వెళ్ళడు. కానీ తన సోదరి, సోదరుడిని మాత్రం రథయాత్రలో తీసుకుని వెళ్తాడు. అందుకే భక్తులు దీనిని అన్నా చెల్లెళ్ళ అనుబంధమని, రక్తసంబంధం విలువను మానవాళికి తెలియపరచడమే జగన్నాథ స్వామి ఉద్దేశ్యమని భక్తుల నమ్మకం. శ్రీమన్నారాయణుడే జగన్నాథుడని, శివుడే బలబధ్రుడని, దేవీ సుభద్ర బ్రహ్మ స్వరూపమని కొందరు తత్వవేత్తలు చెబుతారు. అదేవిధంగా దేవీ సుభద్రను ఆదిపరాశక్తిగాను పేర్కొంటారు. 

పూరీ జగన్నాథుని చరిత్ర : History of Puri Jagannath 

పురాణకాలం నుండీ భారతదేశంలో పూరీ పట్టణం ప్రసిద్ధి చెందింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ కి 60 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంది. పూరీని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీ క్షేత్రమని కూడా పిలిచేవారని చెబుతారు. ఇక్కడ మహా విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై ఉండి పూజలందుకుంటున్నాడు. హిందువులు అత్రి పవిత్రంగా భావించే చార్ ధామ్ పుణ్యక్షేత్రాల్లో పూరీ కూడా ఒకటిగా ఉంది.అంతే కాకుండా వైష్ణవ దివ్యదేశాల్లో ఆ ఆలయం ప్రముఖమైనది. ఈ ఆలయాన్ని కళింగ దేశ పరిపాలకుడు అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించగా ఇది ఆయన మనవడు రాజా అనంగ భీమదేవ్‌ పాలనలో పూర్తయింది. అయితే అంతకు ముందు అక్కడ ఉన్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని కూడా చెబుతుంటారు. దీని వెనుక కూడా ఒక కథ ఉందని చెబుతారు.

పూరీలో కొలువై ఉన్న విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చేతులూ కాలంలో లేకుండా సగం చెక్కిన శిల్పాలు మాత్రమే దర్శనమిస్తాయి. రాజు పశ్చాత్తాపంతో బ్రహ్మ దేవుడిని ప్రార్ధించగా... ఆయన ప్రత్యక్షమై ఇకమీదట విగ్రహాలు అదే రూపంలో పూజలు అందుకుంటాయని ఆనతి ఇచ్చి ఆయనే స్వయంగా విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందువల్లే ఇక్కడి ఆలయంలోని మూర్తులకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. అయితే కళ్ళు మాత్రం చతుర్దశ భువనాలను వీక్షించడానికా అన్నట్లు ఇంతేసి ఉంటాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా 8 నుంచి 12 లేదా 19 సంవత్సరాలకి (8-12 or 19 years) ఒకసారి ఈ దారు దేవతా మూర్తులను మార్చి ప్రతిష్ఠిస్తుంటారు. ఇలా మూర్తులను మార్చినప్పుడు నవ కళేబర ఉతసవంగా దీనిని నిర్వహిస్తారు. పూరీ ఆలయంలో జరిగే ఉత్సవాలలో ప్రాముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. ఈటా జరిగే ఈ రథ యాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు ప్రపంచం నలుమూల నుంచి వస్తుంటారు.

ఏ హిందూ దేవాలయంలో అయినా 12 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించడం జరగదు. ఊరేగింపు కోసం ఉత్సవ విగ్రహాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఊరేగింపు కోసం ప్రతి ఏడాది ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా జరిగేదే. అయితే పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో మాత్రం ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఉంది. బలభద్ర, సుభద్రలతో పాటుగా ఆలయంలో కొలువై ఉన్న జగన్నాథుడిని ప్రతి ఏటా ఒకసారి గుడి లోనుంచి బయటికి తీసుకొచ్చి భక్తులకు దర్శన భాగ్యం కలిగింపజేస్తారు. మూర్తులను ఊరేగించేందుకు ప్రతి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. అందువల్లే భక్తులు జగన్నాథుని రథయాత్రను అపురూపంగా భావిస్తారు. ప్రతి ఏడాది ఆషాడ శుధ్ధ విధియ రోజున ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయం వరకు ఈ రథయాత్ర సాగుతుంది. బలభద్ర, సుభద్రల సామెత జగన్నాథుని ఉత్సవ మూర్తులు బహుదా యాత్ర పేరిట పూరీ ఆలయానికి తిరిగి చేరడంతో ఈ రథయాత్ర ముగుస్తుంది. ఈ రథయాత్ర కోసం జరిగే ఏర్పాట్లు దాదాపు రెండు నెలల ముందు నుంచే మొదలవుతాయి.

జగన్నాథుడి రథం 45 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిని "నందిఘోష" రథం అంటారు. నందిఘోష 16 చక్రాలు కలిగి ఉంటుంది. మిగతా రెండు రథాల కన్నా నందిఘోష పెద్దగా ఉంటుంది. ఎర్రటి చారలు కలిగిన పసుపు వస్త్రంతో జగన్నాథుడి 'నందిఘోష' రథాన్ని అలంకరిస్తారు. బలభద్రుడి 'తాళధ్వజం' రథం 44 అడుగుల ఎత్తులో 14 చక్రాలు కలిగి ఉంటుంది. తాళధ్వజం రథాన్ని ఎర్రటి చారలున్న నీలి రంగు వస్త్రంతో కప్పుతారు. సుభద్రాదేవి రథాన్ని 'పద్మధ్వజం' అని పిలుస్తారు. ఈ రథం ఎత్తు 43 అడుగులు కాగా దీనికి 12 చక్రాలు ఉంటాయి. పద్మధ్వజం రథాన్ని ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో అలంకరిస్తారు. 250 అడుగుల పొడవూ ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను ప్రతి రథానికీ కడతారు. ఈ మూడు రధాలనీ ఆలయ తూర్పు భాగంలో ఉన్న సింహద్వారానికి ఎదురుగా నిలబెడతారు.

జగన్నాథ రథ రూపం : Jagannatha's chariot form 

పూరీ రాజు వైశాఖ బహుళ విదియనాడు రథం నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు. దీనికోసం అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా చేసి పూరీ ఆలయానికి తరలిస్తారు. ఆలయ ప్రధాన పూజారి, 9 మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు, ఇంకా మరో 125 మంది కలిసి రథ నిర్మాణాన్ని అక్షయ తృతీయనాడు మొదలు పెడతారు. రథ నిర్మాణానికి తెచ్చిన 102 వృక్ష భాగాలను రథ నిర్మాణానికి అనువుగా ఉండేలా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వీటిలో జగన్నాథుడి రథం తయారీకి 832 ముక్కలు, బలరాముడి రథనిర్మాణానికి 763 కాండాలు, సుభద్రాదేవి రథ నిర్మాణానికి 593 భాగాలను వినియోగిస్తారు. 

జగన్నాథుడి రథం లక్షలాది మంది భక్తుల నడుమ అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. ఈ రథయాత్రను ఘోషయాత్ర అంటారు. యాత్రలో భక్తుల మధ్య జరిగే తొక్కిసలాటలో ఒకవేళ ఎవరైనా రథ చక్రాల క్రింద పడితే రథయాత్ర మాత్రం ఆగదు. అంతేకాకుండా రథయాత్ర వెళ్లే దారిలో దుకాణాలు అడ్డు వచ్చిన వాటిని కూలగొట్టి అయినా సరే రథాన్ని ముందుకి నడిపిస్తారు. ఈ రథయాత్ర ఎంతో నెమ్మదిగా సాగుతుంది. ఎంత నెమ్మదిగా అంటే జగన్నాథుడి ఆలయం నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. ఆలయం చేరుకున్న అనంతరం ఆ రాత్రికి మూలవిరాట్లకు రథల్లోనే విశ్రాంతి ఇస్తారు. మరుసటి రోజు ఉదయం మేళతాళాలతో మూర్తులను ఆలయంలోకి తీసుకుని వెళతారు. గుండీచాదేవి ఆతిథ్యన్ని వరం రోజులపాటు స్వీకరించిన తరువాత దశమి రోజున మొదలయ్యే తిరుగు ప్రయాణాన్ని 'బహుదాయాత్ర' అంటారు. ఆరోజు మధ్యాహ్నం వేళ ఈ మూడు రథాలూ జగన్నాథుడి ఆలయానికి చేరుకొని గుడి బైటనే ఉండిపోతాయి.