కోహ్లీకి వెయ్యి కోట్ల ఆస్తులు : Kohli has thousand crore assets
కింగ్ కోహ్లీ... రన్ మెషిన్... ఇలా కోట్లాది మనది అభిమానులు ముద్దుగా పిలుచుకునే క్రికెటర్ విరాట్ కోహ్లీ. కోహ్లీ తన ఆట తీరుతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
కోహ్లీకి వెయ్యి కోట్ల ఆస్తులు : Kohli has thousand crore assets
కింగ్ కోహ్లీ... రన్ మెషిన్... ఇలా కోట్లాది మనది అభిమానులు ముద్దుగా పిలుచుకునే క్రికెటర్ విరాట్ కోహ్లీ. కోహ్లీ తన ఆట తీరుతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తన బ్యాటింగ్ విన్యాసాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న కోహ్లీ... ఇన్స్టాగ్రామ్ (Instagram) లో కోహ్లీకి 252 మిలియన్లకు (252 million followers) పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల కోహ్లీ ఆస్తుల విలువపై స్టాక్ గ్రో (Stock Gro) అనే కంపెనీ ఒక నివేదికను వెల్లడించింది. కోహ్లీ ఆస్తులు దాదాపు రూ.1000 కోట్లకు పైగా ఉంటాయని ఆ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న క్రికెటర్లలో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ వివిధ మార్గాల్లో అంటే బీసీసీఐ కాంట్రాక్టు (BCCI contract), ఐపీఎల్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (IPL RCB Team), యాడ్స్, స్టార్ట్అప్స్ (startups)లో పెట్టుబడులు ఇలా అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. కోహ్లీకి వస్తున్న ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి.
బీసీసీఐ భారత క్రికెటర్లకు కాంట్రాక్టును గ్రేడ్స్ ప్రకారం చెల్లిస్తుంది. ఈ కాంట్రాక్టులో కోహ్లీ ఏ గ్రేడ్ లో ఉన్నాడు. దీంతో బీసీసీఐ కోహ్లీకి ప్రతి ఏడాది రూ.7 కోట్లను చెల్లిస్తుంది. కోహ్లీ ఆడే ప్రతి టెస్టు మ్యాచ్ కి 15 లక్షలు చెల్లిస్తుంది. అంతే కాకుండా వన్డే కి రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్ కి 3 లక్షల రూపాయలను చెల్లిస్తుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కి ప్రాతినిధ్యం వహిస్తూ ఏడాదికి 15 కోట్ల రూపాయలను (15 Crores) సంపాదిస్తున్నాడు.
విరాట్ బ్లూట్రైబ్ (blue tribe), యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్ (Universal Sports Bizz), ఎంపీఎల్ (MPL), స్పోర్ట్స్ కాన్వో (Sports Canvo) లాంటి ఏడు స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టాడు.
కోహ్లీ ఒక్కో యాడ్ లో నటించేందుకు రూ.7.50 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల వరకూ తీసుకుంటాడు. విరాట్ దాదాపు 18 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నాడు. దీని ప్రకారం ఒక్క యాడ్స్ ద్వారానే కోహ్లీ దాదాపు రూ.175 కోట్లను సంపాదిస్తున్నాడు.
సోషల్ మీడియాలో సైతం ఒక్కో పోస్ట్ కోసం కోట్లలోనే వసూలు చేస్తున్నాడు. ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్ కోసం రూ.8.9 కోట్లు (for Instagram post Rs.8.9 Crores), ట్విట్టర్‌లో ఒక్క పోస్ట్ కోసం రెండున్నర కోట్లు (Rs.2.5 Crores) తీసుకుంటున్నాడు.
ముంబైలో రూ.34 కోట్ల విలువైన లగ్జరీ హౌస్, గురుగ్రామ్‌లో రూ.80 కోట్ల ఖరీదు చేసే మరో ఇళ్లు సైతం ఉంది.
కోహ్లీ దగ్గర దాదాపు రూ.31 కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నట్లు స్టాక్ గ్రో (Stock Gro) నివేదిక వెల్లడించింది. వీటిల్లో రూ. 4.04 కోట్ల విలువ చేసే బెంట్లీ కాంటినెంటల్ GT, రూ. 3.41 కోట్ల విలువైన బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, రూ. 2.97 కోట్ల విలువ చేసే ఆడి R8 LMX లిమిటెడ్ ఎడిషన్, రూ. 2 కోట్ల విలువైన ఆడి R8 V10, రూ. 1.87 కోట్లు విలువ చేసే ఆడి A8L W12 క్వాట్రో వంటి కార్లు ఉన్నాయి.
అంతే కాకుండా కోహ్లీకి FC గోవా (FC Goa) ఫుట్ బాల్ క్లబ్, UAE రాయల్స్ (The UAE Royals) టెన్నిస్ టీమ్, బెంగళూరు యోధాస్ (Bangalore Yodhas) అనే ప్రో రెజ్లింగ్ జట్లకు కో-ఫౌండర్ గా ఉన్నాడు.