చిన్న వయసులోనే మరణించిన టాలీవుడ్ నటులు : Tollywood actors who died at a young age

ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమకి (Tollywood actors) చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అకస్మాత్తుగా మృతిచెందడం చూస్తున్నాం.

చిన్న వయసులోనే మరణించిన టాలీవుడ్ నటులు : Tollywood actors who died at a young age

చిన్న వయసులోనే మరణించిన టాలీవుడ్ నటులు : Tollywood actors who died at a young age 

ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమకి (Tollywood actors) చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అకస్మాత్తుగా మృతిచెందడం చూస్తున్నాం. కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలోనే ఇలా జరగడం నిజంగా బాధాకరమైన విషయమే. ఆయా నటులు సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో హఠాత్తుగా మరణించడం అభిమానులను ఙిజంగా షాక్ కి గురి చేసిందని చెప్పవచ్చు. ఆలా అకస్మాత్తుగా మరణించిన నటీనటుల వివరాలను ఒకసారి చూద్దాం.

శ్రీహరి : Srihari 

స్టంట్ మాస్టర్ గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి 1986 లో అడుగుపెట్టారు శ్రీహరి. అనంతరం 1989 లో 'ధర్మక్షేత్రం' అనే తెలుగు సినిమా ద్వారా నటుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టారు. శ్రీహరి అటు విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా ఇలా పలు రకాలుగా తన ప్రతిభను చూపారు. 'పోలీస్' చిత్రంలోని ఆయన హీరోగా నటించారు. అది ఆయనకు ఎంతగానో పేరు తెచ్చి పెట్టింది. కృష్ణ జిల్లాలోని గుడివాడ దగ్గర ఉన్న ఎలమర్రు గ్రామం ఆయన సొంతూరు. అక్కడ శ్రీహరి సైకిల్ మెకానిక్ గా పనిచేసారు. అంతే కాకుండా సోదాలు కూడా అమ్మేవారు. 

హైదరాబాద్ కి వలస వచ్చాక శోభన్ థియేటర్ దగ్గర ఉన్న మెకానిక్ షెడ్ లో పనిచేస్తూనే చదువుకునేవారు. ప్రేయసి రావే చిత్రంలో శ్రీహరిలోని నటనను మరో కోణంలో ఆవిష్కరించింది. దీంతో దర్శకుడు చంద్ర మహేష్ ఆయనకు అయోధ్య రామయ్య, ఒక్కడే, హనుమంతు సినిమాలతో వరుస హిట్లు ఇచ్చాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఢీ, మగధీర వంటి సినిమాలు ఆయనకు మరింత పేరు తెచ్చిపెట్టాయి. ఎన్నో చిత్రాల్లో గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పే శ్రీహరి 2013 అక్టోబర్ 9 న తుదిశ్వాశ విడిచారు. ఆయన భార్య డిస్కో శాంతి మంచి డాన్సర్. 49 సంవత్సరాల వయస్సులోనే తుదిశ్వాశ విడిచిన శ్రీహరిని టాలీవుడ్ రియల్ స్టార్ అని పిలిచేది.

ఉదయ్ కిరణ్ : Uday Kiran 

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూనే వరుసగా మూడు సినిమాలతో హ్యటిక్ విజయాలు నమోదు చేసిన హీరో ఉదయ్ కిరణ్. తేజ దర్శకత్వంలో హీరోగా 'చిత్రం' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. తొలి చిత్రంతో నే ఘన విజయం అందుకున్నాడు. అనంతరం వచ్చిన నువ్వు నేను, మనసంతా నువ్వే రెండు చిత్రాలు సైతం సూపర్ హిట్ కావడంతో లవర్ బాయ్ గా ఇమేజ్ సంపాదించుకున్నాడు. 2001 లో ఫిలింఫేర్ అవార్డు అందుకున్న ఉదయ్ కిరణ్ ఆ తరువాత కలుసుకోవాలని, శ్రీరామ్, ఔనన్నా కాదన్నా, జై శ్రీరామ్ వంటి విజయవంతమైన చిత్రాల్లో తనలోని నటనా ప్రతిభను ప్రదర్శించాడు. అతి తక్కువ సమయంలోనే గొప్ప పేరు సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ తన 33 సంవత్సరాల వయస్సులో 2014 జనవరి 5 న ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఉదయ్ కిరణ్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఔనన్నా కాదన్నా సినిమాలో తన నటనతో కన్నీళ్లు పెట్టించాడు. శ్రీరామ్ సినిమాతో తనలోని నటుడి మరో కోణాన్ని ఆవిష్కరించాడు. ఉదయ్ కిరణ్ నీ స్నేహం, అబద్ధం, నీకు నేను నాకు నువ్వు, హోలీ వంటి చిత్రాల్లో కూడా నటించాడు.

వేణుమాధవ్ : Venu madhav 

కమెడియన్ వేణు మాధవ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, అలీ వంటి స్టార్ కామెడియన్లను సైతం చాన్నాళ్లు డామినేట్ చేసాడు. అగ్ర దర్శకులు రాజమౌళి, వీవీ వినాయక్ వంటి వారు కూడా వేణు మాధవ్ కాల్ షీట్స్ కోసం ఎదురు చూసేవారంటే ఎంతటి పేరు సంపాదించుకున్నాడో అర్ధం చేసుకోవచ్చు. అయితే అనారోగ్య సమస్యలతో 25 సెప్టెంబర్ 2019 న కన్ను మూశాడు. చనిపోవడానికి కొన్ని సంవత్సరాల ముందు అనారోగ్యం కారణంగా సినిమాలకి దూరమయ్యాడు.

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన మిమిక్రీ ఆర్టిస్ట్ వేణుమాధవ్ ఓ కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తుండగా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి చూసి తమ సినిమాలో నటించేందుకు ఆఫర్ ఇచ్చారు. అలా 1997 వ సంవత్సరంలో 'సంప్రదాయం' అనే సినిమాలో తొలిసారిగా నటించారు. అదే సంవత్సరం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా 'తొలి ప్రేమ' చిత్రంలో వేణు మాధవ్ చిన ఆర్నాల్డ్ పాత్ర ఎంతగానో పేరు తెచ్చింది. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. వెంకటేష్ హీరోగా వచ్చిన 'లక్ష్మి' చిత్రంలో వేణు మాధవ్ చేసిన టైగర్ సత్తి పాత్రకు గానూ నంది అవార్డు లభించింది. వేణు మాధవ్ కు సై, ఛత్రపతి, వెంకీ, తమ్ముడు చాలా పేరు తెచ్చిపెట్టాయి. దాదాపు 400 చిత్రాల్లో వేణు మాధవ్ నటించాడు.