ఆస్కార్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ : RRR wins Oscar
130 కోట్ల భారతీయుల కలలను నెరవేరుస్తూ ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంలోని 'నాటు నాటు' (Naatu Naatu) పాటకు విశ్వవిఖ్యాత ప్రసిద్ధి చెందిన ఆస్కార్ అవార్డు (Oscar Award) వరించింది. దీంతో ప్రతి భారతీయుడి (every Indian) హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయింది.
ఆస్కార్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ : RRR wins Oscar
130 కోట్ల భారతీయుల కలలను నెరవేరుస్తూ ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంలోని 'నాటు నాటు' (Naatu Naatu) పాటకు విశ్వవిఖ్యాత ప్రసిద్ధి చెందిన ఆస్కార్ అవార్డు (Oscar Award) వరించింది. దీంతో ప్రతి భారతీయుడి (every Indian) హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయింది.
ఆస్కార్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ : RRR wins Oscar
130 కోట్ల భారతీయుల కలలను నెరవేరుస్తూ ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంలోని 'నాటు నాటు' (Naatu Naatu) పాటకు విశ్వవిఖ్యాత ప్రసిద్ధి చెందిన ఆస్కార్ అవార్డు (Oscar Award) వరించింది. దీంతో ప్రతి భారతీయుడి హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయింది. యావత్ భారతదేశం సంతోషంతో పులకరించి పోయింది. కోట్లాది మంది ఆశలను మోసుకుని లాస్ ఏంజిల్స్లో అడుగు పెట్టిన ఆర్ఆర్ఆర్ (RRR)... చిత్రం తన ‘నాటు నాటు’ పాటకు (Naatu Naatu) ఆస్కార్ విజేతగా నిలిచింది. 80 ఏళ్ళ తెలుగు సినీ ప్రపంచ చరిత్రలో (Telugu Film History) ఇంతవరకూ కనీవినీ ఎరుగని రికార్డును ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రం సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు (Above 1000 crores) పైగా వసూళ్లు రాబట్టిన ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రం ఇప్పటికే 5 అంతర్జాతీయ అవార్డులను (International Awards) సొంతం చేసుకుంది. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ (Indian feature film) కూడా ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రమే కావడం విశేషం.
నాటు నాటు : Naatu Naatu
ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రం గత ఏడాది మార్చి 24, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయి సంచలనం సృష్టించింది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటించారు, ఈ పాటకి ఈ ఇద్దరు హీరోలు తమ అద్భుతమైన డాన్స్ తో అందరి హృదయాలను కొల్లగొట్టారు. వీరిద్దరూ అమెరికా (USA) వెళ్లి ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా కోసం ప్రచారం చేశారు. అక్కడ టాక్ షో (Talk show), రేడియోలో (Radio) వీరిద్దరూ తమ భావాలను అక్కడ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర దర్శకుడు రాజమౌళి (Director Rajamouli) అయితే అమెరికా లో కొద్దినెలల ఉంది ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాని ప్రమోట్ చేశారు. స్టీవెన్ స్పెల్ బెర్గ్ (Steven Spielberg), క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan), జేమ్స్ కామెరాన్ (James Cameron) లాంటి హాలీవుడ్ దర్శకులని కలిసి వాళ్ళకి ఆర్ఆర్ఆర్ సినిమా చూపించారు. ఈ దిగ్గజ దర్శకులు సైతం ఈ ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రాన్ని ఎంతగానో ప్రశంసించారు. ఏకంగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ లభిస్తుందని అనుకున్నారు. అయితే ఈ చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు కోసం నామినేట్ అయింది.
మొట్టమొదటి భారతీయ చలనచిత్రం : 1st Indian Feature film
ఇప్పటివరకూ బాలీవుడ్ సినిమాలు (Bollywood), లేదా షార్ట్ ఫిలిమ్స్ (Short films) మాత్రమే ఆస్కార్ రేసులో నిలిచాయి. అయితే దక్షిణ భారతానికి (South Indians) చెందిన తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR) మొట్ట మొదటిసారిగా ఆస్కార్ బరిలో నిలిచి అందరినీ ఆశ్చర్యంలో నింపింది. ఆర్ఆర్ఆర్ (RRR) చిత్ర దర్శకుడు SS రాజమౌళి (Director SS Rajmouli), చిత్రానికి సంగీతాన్ని అందించిన కీరవాణి (Music Director MM Keeravani), గీత రచయిత చంద్రబోస్ (Lyric writer Chandra Bose), హీరోలు ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) ఇంకా చిత్రానికి పనిచేసిన అందరూ ఈ అవార్డుకి అర్హులు. ఈ పాటకు ప్రేమ్రక్షిత్ కొరియోగ్రాఫర్ (Choreographer Premrakshit) గా పనిచేసారు. ముఖ్యంగా పాటను ఆలపించిన గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిపోయారంటే అతిశయోక్తి లేదు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో (Best original song category) ఈ పాటకు అవార్డు దక్కడం దేశానికే గర్వకారణమని ప్రతి భారతీయుడు ముక్త కంఠంతో చెబుతున్నారు. ఈ 95వ ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ భారతీయ చలన చిత్ర రంగంలో చిరకాలం నిలిచిపోతుంది అనడంలో సందేహమే లేదు. ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రానికి సంగీతాన్ని అందించిన కీరవాణి మాట్లాడుతూ... ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రం ఆస్కార్ గెలవాలని... ఇది ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణంగా ఉండాలనేది తన మనసులోని కోరిక అని చెప్పారు.
ఆస్కార్ అవార్డులో ఒరిజినల్ సాంగ్ (Original Song) కేటగిరీలో మొత్తం 5 పాటలు నామినేట్ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ (RRR) నుంచి 'నాటు నాటు' పాటతో పాటుగా, బ్లాక్ పాంథర్ వకాండా (Black Panther Wakanda) చిత్రంలోని లిఫ్ట్ మీ అప్ సాంగ్ (lift me up song), ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (Everything everywhere all at once) చిత్రంలోని దిస్ ఈజ్ ఏ లైఫ్ (This is a life song) పాట, టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ (Tell it like a women) సినిమాలోని అప్లాజ్ (Applause song) పాట కూడా బరిలో నిలిచాయి. ఈ పాటను డయాన్ వారెన్ రాయగా సోఫియా కార్సన్ పాడారు. ప్రముఖ అమెరికా గాయని లేడీ గాగా (Singer Lady Gaga) పాట హోల్డ్ మై హ్యాండ్ (Hold my hand) నాటు నాటు పాటకు పోటీగా ఆస్కార్ బరిలో నిలిచింది.
ఈ సందర్భంగాఈ పాటకు సంగీతాన్ని కంపోజ్ చేసిన కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ స్టేజ్ ఎక్కి అవార్డును అందుకున్నారు. స్టేజ్పై MM కీరవాణి (MM Keeravani) యావత్ భారతీయులకు, ప్రపంచ సినీ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ట్వీట్ చేస్తూ ‘ఇది అసాధారణం. నాటు నాటు పాటకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కింది. ఇది రాబోయే సంవత్సరాల్లో ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయే పాట అవుతుంది. భారతదేశం గర్వంతో ఉప్పొంగుతుంది’ అంటూ ప్రధాని తన ట్వీట్ (Twitter) లో ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
'ది ఎలిఫెంట్ విష్పరర్స్' కి ఆస్కార్ అవార్డు : ‘The Elephant whisperers’ also win Oscar
ఒక గిరిజన జంట అనాథ ఏనుగును పోషించాలని నిర్ణయించుకోవడం, అనంతరం అదే ఏనుగుతో వాళ్లకి ఏర్పడిన అనుబంధంతో తీసిన భారతీయ షార్ట్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విష్పర్' (The Elephant whisper) షార్ట్ ఫిలిమ్స్ కేటగిరీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు ను అందుకుని భారతీయుల హృదయాలను ఉప్పొంగేలా చేసింది.