అఖిల్ "ఏజెంట్" మూవీ టీజర్, తారాగణం, బడ్జెట్, స్టోరీలైన్ : Akhil's "Agent" Movie Teaser

యాక్షన్, స్పై థ్రిల్లర్ మూవీ "ఏజెంట్" టీజర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. విజయం కోసం ఎదురు చూస్తున్న అఖిల్ ఈ సినిమాకు ఎంతో కష్టపడ్డాడని టీజర్ చూస్తే అర్ధమవుతోంది.

అఖిల్ "ఏజెంట్" మూవీ టీజర్, తారాగణం, బడ్జెట్, స్టోరీలైన్ : Akhil's "Agent" Movie Teaser

 

యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న యాక్షన్, స్పై థ్రిల్లర్ మూవీ "ఏజెంట్" టీజర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. విజయం కోసం ఎదురు చూస్తున్న అఖిల్ సినిమాకు ఎంతో కష్టపడ్డాడని టీజర్ చూస్తే అర్ధమవుతోంది. ఎంతో రఫ్ గా కనిపిస్తున్నాడు అఖిల్ సినిమా టీజర్ కు విశేషమైన స్పందన లభించింది. సినిమా నిర్మాణానికి రూ.40-50 కోట్లు ఖర్చు అయినట్లు పేర్కొంటున్నారు. ఏడాది సెప్టెంబర్ 12 తేదీన విడుదల చేయాలనుకున్నప్పటికే కొన్ని కారణాలచేత విడుదల ఆలస్యమయింది. సినిమాని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయనున్నారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ స్టంట్స్ ని మరిపిస్తున్న టీజర్ ఎంతో ఆకట్టుకుంటోంది. టీజర్ లో అఖిల్ ని పరిచయం చేసే డైలాగులు, విజువల్స్, గ్రాఫిక్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీ అదిరిపోయింది.

 

తారాగణం:

అఖిల్ అక్కినేని

మమ్మూట్టి

సాక్షి వైద్య

 

దర్శకత్వం: సురేందర్ రెడ్డి

కథ: వక్కంతం వంశీ

సినిమాటోగ్రఫీ: రాగుల్ ధారుమాన్

సంగీతం: థమన్ ఎస్

నిర్మాత: అనిల్ సుంకర

ఎడిటింగ్: నవీన్ నూలి

బ్యానర్: ఏకే ఎంటర్టైన్మెంట్స్

 

విడుదల తేదీ: 2023 జనవరి 26