ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్దిఖీ కన్నుమూత : Renowned malayalam director Siddique passed away
ప్రముఖ మలయాళ దర్శకుడు, చిత్రనిర్మాత సిద్దిఖీ ఇస్మాయిల్ మంగళవారం కన్నుమూశారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'బాడీగార్డ్' చిత్రానికి దర్శకత్వం వహించిన సిద్దిఖీ ఈ నెల 7 వ తేదీన గుండె పోటు రావడంతో ఆసుపత్రిలో చేరారు.
ప్రముఖ మలయాళ దర్శకుడు, చిత్రనిర్మాత సిద్దిఖీ ఇస్మాయిల్ మంగళవారం కన్నుమూశారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'బాడీగార్డ్' చిత్రానికి దర్శకత్వం వహించిన సిద్దిఖీ ఈ నెల 7 వ తేదీన గుండె పోటు రావడంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందారు. అంతకు ముందు జూలై 1 వ తేదీన కాలేయ సంబంధిత సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేర్పించారు. గుండెపోటు వచ్చిన తరువాత ఐసీయూలో ఉంచినా ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సిద్దిఖీ వయస్సు 60 సంవత్సరాలు. సిద్ధిఖీ మరణం పట్ల తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ చిత్ర రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.
సిద్దిఖీ ఇస్మాయిల్ ‘హిట్లర్’, ‘ఫ్రెండ్స్’, ‘గాడ్ ఫాదర్’, ‘సాహు మిరాండా’, ‘క్రానిక్ బ్యాచిలర్’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. మోహన్లాల్, అర్బాజ్ ఖాన్ తారాగణంగా నటించిన 'బిగ్ బ్రదర్' సిద్దిఖీకి ఆఖరి చిత్రం. సిద్ధిక్ దర్శకత్వంతో పాటుగా పలు చిత్రాలను కూడా నిర్మించి భారతీయ సినీ పరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆయనకి భార్య సుజిత, ముగ్గురు కుమార్తెలు సౌమ్య, సారా, సుకూన్ ఉన్నారు. బుధవారం సాయంత్రం కొచ్చిలో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సిద్దిఖీ పార్థివ దేహాన్ని కడవంతరలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో సందర్శనార్ధం ఉంచి ఆపై అతని నివాసానికి తీసుకువెళతారు.
సిద్దిఖీ ఇస్మాయిల్ గురించి...
సిద్దిఖీ నటుడు లాల్ తో పాటుగా పలు చిత్రాలను నిర్మించారు. వీరిద్దరినీ మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ దర్శక ద్వయంగా పేర్కొంటారు. కొన్ని మనస్పర్థల కారణంగా తదనంతర కాలంలో ఇద్దరూ వేరువేరుగా సినిమాలకు దర్శకత్వం వహించడం మొదలుపెట్టారు. సిద్దిఖీ దర్శకత్వంతో పాటుగా పలు చిత్రాలను సైతం నిర్మించారు. కొన్ని చిత్రాల్లో నటించారు కూడా. 1989 లో సిద్దిఖీ 'రాంజీ రావ్ స్పీకింగ్' చిత్రంతో దర్శకుడిగా మారారు.ఈ చిత్రాన్ని మలయాళ సినిమా చరిత్రలో ఇప్పటికీ కామెడీ క్లాసిక్ సినిమాల్లో ఒక గొప్ప చిత్రంగా పరిగణిస్తారు. ఇది హిందీలో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ నటించిన హేరా ఫేరీ చిత్రానికి రీమేక్ గా నిర్మించారు.
సిద్దిఖీ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రాలు ఇప్పటికీ బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారంటే ఆయన చిత్రాలు ఏ స్థాయిలో ప్రేక్షలను అలరించాయి అర్ధం చేసుకోవచ్చు. హిందీలో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ నటించిన బాడీగార్డ్ చిత్రాన్ని నిర్మించక ముందు అయన చిత్రాలు హిందీలో రీమేక్ చేసే వారు. బాడీగార్డ్ చిత్రం మలయాళ చిత్రానికి రీమేక్. సిద్దిఖీ 2020 లో దర్శకత్వం వహించిన బిగ్ బ్రదర్ అయన ఆఖరి చిత్రం. ఈ చిత్రంలో మోహన్లాల్తో పాటుగా అర్బాజ్ ఖాన్, అనూప్ మీనన్, విష్ణు ఉన్నికృష్ణన్, సర్జానో ఖలీద్, హనీ రోజ్ మరియు సిద్ధిక్ కూడా నటించారు. తమిళంలో విజయ్, సూర్యలతో సిద్ధిఖీ ఎన్నో చిత్రాలను తీసాడు.
సిద్దిఖీ దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలు
సిద్ధిఖీ... ఆ నేరం అల్ప్ప దూరం (1985) చిత్రంతో సినీ రంగప్రవేశం చేశాడు. ఆ తరువాత న్యూ ఢిల్లీ (1987), బూమియిలే రాజక్కన్మార్ (1987), ప్రాదేశిక వార్తకల్ (1989) కాలాల పడ (1989). అయితే ఆయనకి హరిహర నగర్ (1990) చిత్రంతో బ్రేక్ త్రూ వచ్చింది.ఆ తరువాత ఆయన ముక్కిల్యారాజ్యతు (1991), మిమిక్స్ పరేడ్ (1991), తీరుతాళ్వది (1992), ఏకలవ్యన్ (1993),చింతవిష్టాయయ శ్యామల (1998) వంటి చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటుగా అత్యంత ప్రాచుర్యం పొందిన చిత్రాల్లో... మేఘమల్హార్ (2001), కళ్యాణరామన్ (2002), ఇన్ హరిహర నగర్ (2009), ప్రాంచిఎట్టన్, ది సెయింట్ (2010), గ్రాండ్మాస్టర్ (2012), సెల్యులాయిడ్ (2013), వెళ్ళిమూంగా (2014), పతేమరి (2015), పూతన పానం (2017). 2018 లో ఆది, హే జూడ్, కెప్టెన్, కమ్మర సంభవం, పెరోల్, అంగానే న్జనుమ్ ప్రేమిచు, ఒరు కుప్రసిద పయ్యన్, ఇబ్లిస్, డ్రామా, ఒరు కుట్టనాదన్ బ్లాగ్, ఆనకళ్లన్, ఓడియన్ చిత్రాలు వచ్చాయి. 2019 లో మధురరాజా, ఉయర్, ఇసక్కింటే ఇతిహాసం, ఇట్టిమాని : మేడ్ ఇన్ చైనా, గానగంధర్వన్, హ్యాపీ సర్దార్, ఉల్టా అండ్ మై శాంతా చిత్రాలు ఉన్నాయి. 2020 లో ఉరియాది, షైలాక్ అండ్ సుఫియుమ్ సుజాతయుమ్ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.