బిజినెస్ లోనూ రాణిస్తున్న టాలీవుడ్ హీరోలు : Tollywood heroes in business too

టాలీవుడ్ హీరోలు సినిమాల్లో నటించి రెమ్యునరేషన్ తీసుకోవడమే కాదు... బిజినెస్ లో సైతం రాణిస్తూ అదనంగా సంపాదిస్తున్నారు. మేము సినీ రంగంలోనే కాదు... వ్యాపార రంగంలో కూడా రాణిస్తామని ప్రపంచానికి చాటి చెబుతున్నారు.

బిజినెస్ లోనూ రాణిస్తున్న టాలీవుడ్ హీరోలు  : Tollywood heroes in business too

బిజినెస్ లోనూ రాణిస్తున్న టాలీవుడ్ హీరోలు  : Tollywood heroes in business too 

టాలీవుడ్ హీరోలు సినిమాల్లో నటించి రెమ్యునరేషన్ తీసుకోవడమే కాదు... బిజినెస్ లో సైతం రాణిస్తూ అదనంగా సంపాదిస్తున్నారు. మేము సినీ రంగంలోనే కాదు... వ్యాపార రంగంలో కూడా రాణిస్తామని ప్రపంచానికి చాటి చెబుతున్నారు.

టాలీవుడ్ హీరోలు కేవలం సినిమాల్లో నటించడమే కాదు యాడ్స్ చేసి ఆదాయం సంపాదించడంతో పాటుగా అదనంగా వ్యాపార రంగంలో కూడా విశేషంగా రాణిస్తున్నారు. హోటళ్లు, జిమ్‌లు, సినిమా థియేటర్లు మాత్రమే కాకుండా విమానయాన రంగంలో కూడా పెట్టుబడులు పెట్టి రాణిస్తున్నారు. తమకున్న పేరు ప్రఖ్యాతలను ఉపయోగించుకుని ఇలా అన్ని రంగాల్లోనూ వల్ల బిజినెస్ లో దూసుకెళుతున్నారు. ఇప్పటికే టాప్ హీరోలు నుంచి చిన్న హీరోల వరకూ అందరూ దాదాపుగా బిజినెస్ మొదలుపెట్టి రాణిస్తున్నారు. ఒకప్పుడు యాడ్స్ లో నటించి సంపాదిస్తే ఇప్పుడు బిజినెస్ లో కూడా సంపాదిస్తున్నారు. వీరిలో చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా ఎంతో మంది ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి : Megastar Chiranjeevi 

ఎంతో కష్టపడి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న చిరంజీవి ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో వైపు సినాలు నిర్మిస్తున్నారు. తాను హీరోగా నటించిన ఖైదీ నెం150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య సినిమాలు చిరంజీవికి చెందిన సొంత నిర్మాణ సంస్థలోనే నిర్మించారు.సినిమాల్లో మాత్రమే కాకుండా కేరళ బ్లాస్టర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో (KBSPL) లో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్, మరో హీరో అక్కినేని నాగార్జునతో కలిసి ఒక ఫ్రాంచైజీని కొనుగోలు చేసారు. మరోవైపు యాడ్స్ లో కూడా నటిస్తున్నారు. అంతేకాకుండా సామజిక సేవ కార్యక్రమాలను విరివిగా చేపడుతుంటారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్ లను ప్రజల కోసం ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నడుపుతున్నారు. తనకి అన్నం పెట్టిన సినీరంగానికి ఎదో ఒకటి చేయాలన్న సంకల్పంతో తన సొంత సొమ్ము రూ.30 కోట్లతో (30 crores) సినీ రంగంలో ఉన్న వారికోసం ఒక హాస్పిటల్ నిర్మిస్తున్నారు. ఇబ్బందులను ఎదుర్కొంటున్న తోటి కళాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ ఆర్థిక సాయం అందిసూ తన గొప్ప మనస్సును చాటుకుంటున్నారు.

రామ్ చరణ్ : Ram Charan 

ఆర్ఆర్ఆర్ (RRR) మూవీతో గ్లోబల్ స్టార్ గా పేరు గాంచిన రామ్ చరణ్ తనదైన స్టయిల్లో సినిమాలతో పాటు అటు బిజినెస్ రంగంలోనూ రాణిస్తున్నాడు. చెర్రీ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో పేరుగాంచాడు. యాడ్స్ తో పాటు సినిమాలను సైతం నిర్మిస్తున్నాడు. పోలో, రైడింగ్ క్లబ్ లు ఏర్పాటు చేసి తనలోని బిజినెస్ మైండ్ ఉపయోగించి విజయంతంగా నిర్వహిస్తున్నాడు. ట్రూజెట్ అనే ఏవియేషన్ సంస్థను ఏర్పాటు చేసినా రామ్ చరణ్ బహుశా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఏవియేషన్ రంగంలో ఉన్న ఏకైక వ్యక్తి రామ్ చరణ్ అనే చెప్పవచ్చు. రామ్ చరణ్ భార్య ఉపాసన దాదాపు 150 కి పైగా వృద్ధాశ్రమాలకి సహాయం చేయడమే కాకుండా... కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ప్రిన్స్ మహేష్ బాబు : Prince Mahesh Babu 

తెలుగు చిత్ర పరిశ్రమలో మిల్క్ బాయ్ గా పేరొందిన మహేష్ బాబు తెలుగు హీరోల్లో ఎవ్వరూ చేయనన్ని యాడ్స్ చేశాడు. సొంత నిర్మాణ సంస్థ GMB (G. Mahesh Babu) నిర్మాణ సంస్థను ఏర్పాటై చేశాడు. ఒక వైపు పక్కా ప్రణాళికతో గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తూనే సినీ నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నాడు. దేశంలోనే అతి పెద్దదైన AMB సినిమాస్ మల్టీప్లెక్స్‌ ను అధునాతన వసతులతో హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఇప్పటికే దాదాపు 1500 కు పైగా పిల్లలకు గుండె ఆపరేషన్లను ఉచితంగా చేయించాడు. సామాజిక సేవ నిర్వహిస్తూ అందిరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

అక్కినేని నాగార్జున : Akkineni Nagarjuna  

అక్కినేని నాగార్జున... వ్యాపారం చేయాలంటే అది నాగార్జున వల్లే అవుతుంది… ఎందుకంటే ఆయన్ని ఒక విజయవంతమైన బిజినెస్ మ్యాన్ గానే ఎందరో చూస్తుంటారు. తన తండ్రి దివంగత అక్కినేని నాగేశ్వరావు నిర్మించిన అన్నపూర్ణ స్థూడియోస్ ద్వారా సినిమాలు నిర్మించడం నుంచి యాంకరింగ్, యాడ్స్, ఫ్రాంచైజీల్లో పెట్టుబడులు, టీవీ ఛానెల్ లో వాటా ఇలా అన్ని రంగాల్లోనూ ఆయన వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్ గ్రిల్ రెస్టారెంట్, ఎన్ కన్వెన్షన్ సెంటర్లను సైతం నడుపుతున్నాడు. ప్రసిద్ధి చెందిన బిగ్ బాస్ వంటి షోలను నిర్వహిస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భాగస్వామ్యులుగా ఉన్న కేరళ బ్లాస్టర్స్ జట్టుకు సైతం కో ఓనర్ గా నాగార్జున ఉన్నాడు.