ఉన్నత విద్య కోసం కేంద్ర ప్రభుత్వ ఉచిత పథకం : Central Government Free Scheme for Higher Education
భారతదేశంలోని దళితులు, గిరిజన (SC & ST) కుటుంబాలకు చెందిన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి కేంద్రం నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీమ్ (National Overseas Scholarship Scheme)
భారతదేశంలోని దళితులు, గిరిజన (SC & ST) కుటుంబాలకు చెందిన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి కేంద్రం నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీమ్ (National Overseas Scholarship Scheme) పేరుతో ఒక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం గురించి చాలా మందికి అవగాహన కూడా లేదు.వ్యవసాయ కూలీలా పిల్లలు కూడా ఈ పథకానికి అర్హులే. ఈ పథకం క్రింద వివిద్యార్థులకు ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా, విమాన చార్జీలు సైతం వీరికి ఉచితంగా కల్పిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పథకం అమలవుతోంది. ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలు, దీని ద్వారా ఎలా లబ్ది పొందాలనే విషయాలను ఒకసారి తెలుసుకుందాం.
విదేశీ విద్య కోసం అవకాశం : Opportunity for overseas education
పట్టభద్రులు, ఎంబీఏ, ఇంజనీరింగ్ వంటి కోర్సులు చదివిన విద్యార్థులు పీజీ (PG), పీహెచ్‌డీ (PhD), ఎం.ఫిల్ (M.Phil) వంటి ఉన్నత విద్య కోర్సులను విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు కోసం ఈ పథకం అమల్లోకి తెచ్చారు. ఎటువంటి భూమిలేని వ్యాసాయ కూలీలు, గిరిజన, దళిత సామజిక వర్గాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలంటే వాళ్లకి ఎంతో కష్టంతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. వీరి కలలను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీమ్ (National Overseas Scholarship Scheme) ను తీసుకువచ్చింది. ఈ వర్గాలకు చెందిన విద్యార్హులు విదేశాల్లో చదువుకోవాడ్నైకి ఇక్కడి నుండి వెళ్ళింది మొదలు అంటే విమాన ప్రయాణ ఖర్చులు, విదేశాల్లో ఫీజుల చెల్లింపులు అన్నింటినీ ప్రభుత్వం ఉపకార వేతన (stipend) రూపంలో అందజేస్తుంది.ఒక్కో విధ్యర్హికి కోర్సును బట్టి అలవెన్సులు, ఫీజులు అన్నీ కలిపి దాదాపు 14 లక్షల రూపాయలను చెల్లిస్తుంది. విమాన టిక్కెట్లను మాత్రం ప్రభుత్వం సూచించిన సంస్థల ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం సూచించిన వాటిలో బల్మర్ లావ్రీ అండ్ కంపెనీ లిమిటెడ్ (BLCL), అశోక్ ట్రావెల్స్ అండ్ టూర్స్ (ATT), ఐఆర్‌సీటీసీ (IRCTC) ఉన్నాయి. విద్యార్ధి అక్కడ తన కోర్సు పూర్తయిన తరువాత రిటర్న్ టికెట్ (return ticket) కోసం ఆ దేశంలో స్థానికంగా ఉన్న భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ని సంప్రదిస్తే విద్యార్థికి రిటర్న్ టికెట్ ను అక్కడి అధికారులు ఏర్పాటు చేస్తారు.
విద్యార్ధి తాను చదివే కోర్సు కాలపరిమితి బట్టి ఈ ఉపకార వేతనం (stipend) ఉంటుంది. పీహెచ్‌డీ కోర్సుకు 4 సంవత్సరాలు, పీజీ కోర్సు కోసం 3 సంవత్సరాలు, పోస్ట్ డాక్టోరల్ రీసెర్చికి 2 సంవత్సరాల కాలపరిమితికి తగ్గట్లుగా ఈ స్టైఫండ్ ను అందజేస్తారు. ఈ ఉపకార వేతనాన్ని ఆయా దేశాల్లో ప్రభుత్వం గుర్తించిన సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఇస్తారు.
ఉపకారవేతనం పొందడానికి అర్హతలు ఏమిటి? : What are the eligibility criteria for getting stipend?
అంతర్జాతీయ ప్రమాణాలతో క్యూఎస్ అధ్యయనంలో (QS study) 500 లోపు ర్యాంకులు సాధించిన యూనివర్సిటీలు, కళాశాలల్లో మాత్రమే విద్యార్థులు సీట్లు పొందాల్సి ఉంటుంది. ఎస్టీ (ST) విద్యార్థులు మాత్రం 1000 లోపు ర్యాంకులు ఉన్న యూనివర్సిటీలు, కళాశాలల్లో సీటు పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఆయా యూనివర్సిటీల జాబితా కోసం https://www.topuniversities.com/university-rankings/world-university-rankings/2023 వెబ్సైట్ లో లభిస్తాయి. అయితే ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆయా యూనివర్సిటీల్లో సీటును తన సత్తాతో ఆయా విద్యార్థులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం ఏమాత్రం సహాయం చేయదు. తదనంతరం యూనివర్సిటీ నుండి తనకు ప్రవేశం కల్పిస్తున్నట్టు అన్ కండీషనల్ ఆఫర్ లెటర్ ను యూనివర్సిటీ నుండి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ కోర్సుల విద్యార్థులు 60% కి పైగా మార్కులు సాధించాల్సి ఉంటుంది. వయస్సు విద్య సంవత్సరం ఏప్రిల్ 1 వ తేదీ నాటికి 35 ఏళ్ళు దాటి ఉండకూడదు. ఎస్టీ (ST) విద్యార్థులకు మాత్రం 38 సంవత్సరాల వయస్సు దాటకూడదు. సంవత్సరం ఆదాయం 8 లక్షల రూపాయలకు మించి ఉండకూడదు. ప్రతి ఏడాది 17 మంది ఎస్టీ విద్యార్థిలను (17 ST), ఎస్సీ కులాల (115 SC) నుంచి 115 మంది విద్యార్థులను, ఆరుగురు డీనోటిఫైడ్ ట్రైబ్స్ (Denotified Tribes) విద్యార్థులు, వ్యవసాయ కూలీల నుంచి నలుగురు విద్యార్థులు, హస్తకళాకారుల కుటుంబాల నుంచి నలుగురు విద్యార్థులను ఈ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీమ్ (National Overseas Scholarship Scheme) కోసం ఎంపిక చేస్తారు. 30% రిజర్వేషన్ ను మహిళలకు కేటాయించారు.
ఈ స్కీం కోసం ప్రభుత్వ నిబంధనలు ఏమిటి? : What are the government norms for this scheme?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం (National Overseas Scholarship Scheme) కోసం ఎంపికైన విద్యార్ధి ఒక నాన్ జ్యూడీషియల్ బాండ్ ను నోటరీ చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకం కోసం ప్రభుత్వానికి తాను ఇచ్చిన సమాచారం అంత వాస్తవమేనని తెలియజేయాలి. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తానని, దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే డీఫాల్టర్ గా ప్రకటించవచ్చని ఈ బాండ్ లో తెలపాల్సి ఉంటుంది. విద్యార్ధి తరపున ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరూ 50 వేల రూపాయల (Rs.50,000) చొప్పున ష్యూరిటీ బాండు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్ధి గనుక తప్పు చేసినట్లు (defaulter) తేలితే ఆ సొమ్మును ప్రభుత్వానికి తాము చెల్లిస్తామని ష్యూరిటీగా ఉన్నవారు ఈ బాండ్ లో ఖచ్చితంగా పేర్కొనాల్సి ఉంటుంది. విద్యార్ధి ఏ విశ్వవిద్యాలయంలో అయితే ప్రవేశం పొందుతాడో అక్కడ అవసరమయ్యే అన్నిరకాల ఫీజులను ఆ దేశంలో ఉండే భారత ఎంబసీ అధికారులే నేరుగా చెల్లిస్తారు. ఆయా విద్యార్థులు ప్రగతిని పర్యవేక్షించడమే కాకుండా, ప్రోగ్రెస్ రిపోర్ట్ ను సైతం అధికారులు ప్రతి ఏటా తెప్పించుకుని పరిశీలిస్తారు.
విద్యార్ధి గనుక నిర్ణీత గడువులోగా తన కోర్సును గనుక పూర్తి చేయకపోతే ఆ విద్యార్థిపై అప్పటివరకూ పెట్టిన ఖర్చును 2.5% వడ్డీతో ప్రభుత్వం వసూలు చేస్తుంది. విద్యార్ధి చెల్లించలేని పక్షంలో ష్యూరిటీ ఇచ్చిన వారినుండి వసూలు చేస్తుంది. అంతేకాకుండా ఆ దేశంలో ఉన్న భారత ఎంబసీ అటువంటి విద్యార్థులను వెంటనే భారత్ కు పంపించి వేస్తుంది. ఒకవేళ సంబంధిత విద్యార్థి తన గురించి వివరాలపై తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే 15 శాతం వడ్డీతో అప్పటివరకూ పెట్టిన ఖర్చును వసూలు చేస్తారు.
దరఖాస్తుకు అవసరమయ్యే డాక్యుమెంట్లు : Documents required for application
దరఖాస్తు చేసుకునే సమయంలో 10 వ తరగతి సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఫొటోలు, స్కాన్ చేసిన సంతకం, ప్రస్తుత, పర్మనెంట్ అడ్రస్, డిగ్రీ మార్కుల సర్టిఫికెట్, విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్‌కు సంబంధించిన పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఐటీఆర్ (ITR) పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఉపకార వేతనానికి ఎంపికైన తరువాత అటెస్టేషన్ ఫామ్, సంవత్సరాదాయ సర్టిఫికెట్, సెల్ఫ్ డిక్లరేషన్, పాస్‌పోర్ట్ కాపీ సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం ప్రక్రియ అంత ఆన్‌లైన్ లోనే చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు https://nosmsje.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేయాలి. ఎస్టీ (ST) విద్యార్థులు https://overseas.tribal.gov.in వెబ్‌సైట్లో తమ పేర్లను ముందుగా నమోదు చేసుకోవాలి.