'రా' కొత్త చీఫ్‌గా టాప్ కాప్ రవి సిన్హా : Top cop Ravi Sinha is the new chief of 'RAW'
అత్యంత కీలకమైన నిఘా కార్యకలాపాలను నిర్వహించే భారత గూఢచార సంస్థ 'రా' (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, RAW new Chief) కొత్త చీఫ్‌గా టాప్ కాప్, సీనియర్ ఐపీఎస్ అధికారి రవి సిన్హా (Ravi Sinha, IPS) నియమితులయ్యారు.
'రా' కొత్త చీఫ్‌గా టాప్ కాప్ రవి సిన్హా : Top cop Ravi Sinha is the new chief of 'RAW'
అత్యంత కీలకమైన నిఘా కార్యకలాపాలను నిర్వహించే భారత గూఢచార సంస్థ 'రా' (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, RAW new Chief) కొత్త చీఫ్‌గా టాప్ కాప్, సీనియర్ ఐపీఎస్ అధికారి రవి సిన్హా (Ravi Sinha, IPS) నియమితులయ్యారు. ఆయన ఈనెల 30 వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. 1988 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి అయిన రవి సిన్హా ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు (Chhattisgarh cadre) చెందిన వారు. ప్రస్తుతం రవి సిన్హా క్యాబినెట్ సెక్రటేరియట్ స్పెషల్ సెక్రెటరీగా (Special Secretary) పనిచేస్తున్నారు. ఈ మేరకు రవి సిన్హా నియామకాన్ని సెంట్రల్ పర్సనల్ మినిస్ట్రీ (Cabinet Appointment Committee) ప్రకటించింది. నియామక ఉత్తర్వులపై అధికారులు ఆయనకు సమాచారం అందించారు. ప్రస్తుతం 'రా' (RAW) చీఫ్ గా సమంత్ గోయల్ (Samant Goel) ఉన్నారు. కేంద్ర మంత్రివర్గం రవి సిన్హా నియామకానికి ఆమోదం తెలిపింది. రవి సిన్హా రెండేళ్ల పాటు ఈ పదవిలో (2 years in service) ఉంటారని అందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపినట్లు సిబ్బంది బంత్రిత్వ శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుత 'రా' చీఫ్ సమంత్ కుమార్ గోయెల్ పదవీ కాలం ఈ నెల 30 తో పూర్తి కానుంది. అదే రోజున రవి సిన్హా రా చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తారు.
కొత్త 'రా' చీఫ్ రవి సిన్హా ఎవరు? : Who is Ravi Sinha, the new 'RAW' chief?
రవి సిన్హా (Ravi Sinha) ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. గత ఏడేళ్లుగా రీసెర్చ్ అండ్ అనాలసిస్ ఆపరేషనల్ విభాగంలో (RAW operation department Chief) చీఫ్ గా సేవలు అందిస్తున్నారు. సాధారణంగా 'రా' లో పనిచేసే వారి వ్యక్తిగత వివరాలను అత్యంత రహస్యంగా (personal details are secret) ఉంచుతారు. అందుకే ఎవ్వరి వివరాలనూ బయటికి వెల్లడించరు. అయితే సిన్హాకు భారత ఇంటెలిజెన్స్ విభాగంలో అత్యంత ప్రతిభావంతుడిగా (Excellent talent) మంచి పేరుంది. ఆయన 'రా' లో ఉన్న వివిధ విభాగాల్లో ఉన్నతమైన సేవలు అందించారు. వివిధ దేశాల్లో జరిగే పరిణామాలు, అక్కడి విషయాలపై సిన్హాకు మంచి పట్టుంది.
అసలు 'రా' అంటే ఏమిటి? : What exactly is 'RAW'?
రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) భారత దేశపు గూఢచార సంస్థ. 1962 లో భారత్-చైనా, 1965 లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధాల తర్వాత విదేశాలపై నిఘా ఉంచి తగిన పట్టు సాధ్నచేందుకు గానూ 1968 సెప్టెంబర్ లో 'రా' ను అప్పటికే ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నుంచి వేరు చేసి ఒక సంస్థగా ఏర్పాటు చేశారు. 'రా' ను ఏర్పాటు చేయకముందు వరకూ ఇంటెలిజెన్స్ బ్యురో భారతదేశం లోపల, బయట నిఘా కార్యకలాపాలు పర్యవేక్షించేది. ఆ తరువాత ప్రత్యేకంగా విదేశాలపై నిఘా పెట్టే బాధ్యతను 'రా'కు అప్పజెప్పారు. 'రా' తరపున ఒక్క పాకిస్తాన్ లోనే 10 వేల మంది గూఢచారులు ఉన్నారు. రా గూఢచారులు పెద్ద ఎంబసీలు, హైకమిషన్లలోనూ ఉన్నారు.