సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సాప్ : WhatsApp is impressive with new features
ఈ ఫీచర్ ను గనుక వాట్సాప్ అందుబాటలోకి తెస్తే వినియోగదారులు వాట్సాప్ చాట్, గ్రూప్ లో నిర్దిష్ట (specific) సమయం వరకూ సందేశాన్ని (message) పిన్ (pin) చేసుకోవచ్చు.
వాట్సాప్ (WhatsApp) ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి పరిచయం చేయనవసరం లేని మెసేజింగ్ యాప్. మెసేజింగ్ యాప్ గా ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిందంటే అందుకు ఇది ఎప్పటికప్పుడు తమ వినియోగదారులను (users) సరికొత్త ఫీచర్లతో అక్కట్టుకుంటుండడమే దీనికి కారణమని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా వాట్సాప్ (WhatsApp) విండోస్ (windows) యూజర్ల కోసం ఏకంగా 32 మంది వ్యక్తులు ఒకేసారి వీడియో కాలింగ్ (32 people video calling at once) ద్వారా మాట్లాడుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ అప్‌డేట్ వీడియో కాలింగ్ ఫీచర్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో అని వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈ ఫీచర్ గనుక అందుబాటులోకి వస్తే గనుక అద్భుతమైన ఫీచర్ (excellent feature) గా చిరకాలం నిలిచిపోతుందని యూజర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఫీచర్ కొంత మంది బీటా టెస్టర్లకు (Beta testers) అందుబాటులోకి వచ్చినట్లు వాట్సాప్ పేర్కొంది. ఇప్పటివరకూ జూమ్, గూగుల్ మీట్ ద్వారానే ఇలా ఎక్కువ మందితో వీడియో కాలింగ్ డెస్క్ టాప్ (WhatsApp video calling desk top) ద్వారా మాట్లాడుకునే సదుపాయం ఉండేది. ఇప్పుడు వాట్సాప్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా 32 మందితో ఏకకాలంలో వీడియో కాలింగ్ డెస్క్ టాప్ ద్వారా మాట్లాడుకోవచ్చు.
వాట్సాప్ బీటా (WABetainfo) అందించిన ఒక నివేదిక ప్రకారం 32 మంది యూజర్లు ఒకేసారి వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడుకోవచ్చు. గ్రూప్ కాల్స్ లో వచ్చే 'జాయిన్ అవ్వండి' (join now) అని వచ్చే ఆహ్వాన మెసేజ్ (invitation message) ద్వారా బీటా యూజర్లు ఇందులో అంటే వీడియో కాల్ లో జాయిన్ అవ్వవచ్చు. రాబోయే రోజుల్లో మరింత మంది యూజర్లకు దీనిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు, ప్రస్తుతానికి విండోస్ అప్డేట్ కోసం కొంత మంది బీటా టెస్టర్లకు దీనిని అందుబాటులో ఉంచినట్లు వాట్సాప్ బీటా (WABetainfo) నివేదిక తెలిపింది. వాట్సాప్ ఎంతోకాలంగా టెక్స్ట్ సందేశాలు, ఆడియో కాల్స్, తక్కువ మంది యూజర్లతో జరిపే వీడియో కాల్స్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సహోద్యోగులతో కనెక్ట్ అయ్యేందుకు ఈ సదుపాయాలు అందిస్తోంది. ఈ అనుభవాన్ని మరింత మెరుగు పరచడానికి వాట్సాప్ వెబ్, యాప్, డెస్క్ టాప్ యాప్ ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్‌లు విడుదల చేస్తోంది.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ ఫీచర్ గురించి పరిశీలిస్తే... గతంలో వాట్సాప్ లో గరిష్టంగా కేవలం 8 మందితో గ్రూప్ వీడియో కాలింగ్ చేసి మాట్లాడుకునే సౌకర్యం మాత్రమే ఉండేది. ఆడియో కాల్స్ కోసం 32 మందితో మాట్లాడుకోవడానికి సదుపాయం ఉండేది. దీనిని మరింతగా అభివృద్ధి చేసి యూజర్లకు చక్కటి అనుభూతిని అందించేందుకు మరిన్ని ఫీచర్లను తీసుకు రానున్నట్లు వాట్సాప్ బీటా (WABetainfo) పేర్కొంది. తాజా వాట్సాప్ బీటాతో విండోస్ 2.2324.1.0 (Windows 2.2324.1.0) మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న దీంతో ఎక్కువ మందితో బీటా టెస్టర్లు వీడియో కాల్స్ చేసుకునే సదుపాయం కల్పించింది. గతంలో ‘షేర్ స్క్రీన్ డ్యూరింగ్ వీడియో కాల్స్’ ఫెసిలిటీతో బీటా అప్‌డేట్‌తో వచ్చిన వాట్సాప్ విండోస్ 2.2322.1.0 (Windows 2.2322.1.0) కూడా లేటెస్ట్ అప్‌డేట్‌లో అందుబాటులో ఉంది.
త్వరలో అందరికీ అందుబాటులో మరిన్ని ఫీచర్లు తన యూజర్ల కోసం అందుబాటులోకి తేనున్నట్లు వాట్సాప్ బీటా (WABetainfo) వెల్లడించింది. ఇప్పుడు 32 మందితో వీడియో కాలింగ్ సదుపాయాన్ని తెస్తున్న వాట్సాప్ త్వరలో మెసేజ్ పిన్ డ్యూరేషన్ ఫీచర్ (message pin duration feature) ను అందుబాటులోకి తెచ్చెదుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ 2.23.13.11 (WhatsApp Beta Android 2.23.13.11) వెర్షన్ అప్డేట్ లో ఈ ఫేచర్ ను అందుబాటులో ఉంచింది. ఈ ఫీచర్ ను సాధారణ వినియోగదారులకు (users) సైతం త్వరలోనే అందుబాటులో తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
Try out whatsApp on a new Smart Phone - Best 5G Smartphones Coming Soon
ఈ ఫీచర్ ను గనుక వాట్సాప్ అందుబాటలోకి తెస్తే వినియోగదారులు వాట్సాప్ చాట్, గ్రూప్ లో నిర్దిష్ట (specific) సమయం వరకూ సందేశాన్ని (message) పిన్ (pin) చేసుకోవచ్చు. సమయం నిర్దిష్ట సమయం తరువాత పిన్ చేసిన మెసేజ్ ఆటోమేటిక్ గా అన్ పిన్ (automatic un Pin) అయిపోతుంది. మెసేజ్ లను పిన్ చేసుకోవడం, ఉం పిన్ చేసుకోవడం అనేది యూజర్ల మనోగతాన్ని బట్టి ఉంటుంది. మెసేజ్ ను పిన్ చేసుకోవడానికి ఏడు రోజులు (7 days), 30 రోజులు (30 days) డేస్, 24 గంటల (24 hours) వ్యవధి కలిగిన సమయం ఇవ్వబడుతుంది. అంతే కాకుండా ఉం పిన్ చేసుకునే అవకాశం కూడా యూజర్లకు కల్పించనున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. వాట్సాప్ తెస్తున్న ఈ సరికొత్త ఫీచర్ల వల్ల వినియోగదారులు తమ ముఖ్యమైన సమాచారాన్ని చాట్, గ్రూప్ లో పంచుకునేందుకు వీలు కలుగుతుంది.