స్పై మూవీ రివ్యూ : spy Movie Review

హ్యాపీడేస్ మూవీతో ప్రేక్షకులను అలరించిన నిఖిల్ ఆ తరువాత పలు సినిమాలూ నటించినప్పటికీ కార్తికేయ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు.

స్పై మూవీ రివ్యూ : spy Movie Review

హ్యాపీడేస్ మూవీతో ప్రేక్షకులను అలరించిన నిఖిల్ ఆ తరువాత పలు సినిమాలూ నటించినప్పటికీ కార్తికేయ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా హీరోగా నటించిన 'స్పై' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇన్నాల్లూ ఆధ్యాత్మికత జోడించిన చిత్రాల్లో నటించిన నిఖిల్ ఈ సినిమాలో గూఢచారిగా నటించాడు. ఎన్నో ఆశలతో నిఖిల్ నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదల అయింది. ఈ చిత్రం యొక్క విశేషాలను ఒకసారి పరిశీలిద్దాం. నిఖిల్ నటించిన కార్తికేయ 2 ఘన విజయం సాధించింది. దీంతో నిఖిల్ తాను నటించే చిత్రాల కథలను ఆచి తూచి ఎంపిక చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా నిఖిల్ తాజాగా నటించిన స్పై చిత్రం ట్రైలర్ అభిమానులతో పాటుగా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో పాటుగా నిఖిల్ పాన్ ఇండియా చిత్రాల కథలనే ఎంపిక చేసుకుంటూ నటిస్తున్నాడు. తాజాగా నిఖిల్ నటించిన స్పై చిత్రం సుభాష్ చంద్ర బోస్ అదృశ్యానికి సంబంధించిన రహస్యం గురించి నిర్మించారు. బోస్ కి సంబంధించిన కొన్ని ఫైల్స్ మిస్ అవ్వడం, ఆ మిస్ అయిన ఫైల్స్ తో దేశ ద్రోహులు ఒక పథకాన్ని అమలు చేయబోతున్నారని సమాచారం అందడం... ఆ ఫైల్స్ ని తిరిగి చేజిక్కించుకునేందుకు హీరోగా నటించిన నిఖిల్ ఏమి చేసాడనేది ఈ చిత్రానికి సంబంధించి ఇక మూలం. వాస్తవానికి అందరికీ సహజంగా వచ్చే సందేహం ఏమిటంటే... సుభాష్ చంద్ర బోస్ అదృశ్యం ఇప్పటికీ ఎవ్వరికీ తెలీని ఒక రహస్యంగా ఉండిపోయింది. అయితే ఈ సినిమాని సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన ఫైల్స్ మిస్ అవ్వడం.. ఈ సినిమాను ఆ ఫైల్స్ తో సంబంధం ఏమిటనేది దర్శకుడు ప్రేక్షకులను ఆలోచనలో పడివేసే దిశగా అద్భుత రీతిలో తీర్చిదిద్దాడు.

జోర్డాన్ దేశంలో వాంటెడ్ టెర్రరిస్ట్ ఖాదిర్ ఖాన్ (నితిన్ మెహతా) ను 'రా' అధికారులు చంపేస్తారు. ఆ ఆపరేషన్ పాల్గొన్న ఒక రా అధికారి సుభాష్ (ఆర్యన్ రాజేష్) ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తారు. హత్య గావించబడ్డ సుభాష్ తమ్ముడు జై (నిఖిల్ సిద్ధార్థ్) సైతం తన అన్న లాగానే 'రా' లో చేరతాడు. తన అన్నను హత్య చేసిన వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. 'రా' చీఫ్ శాస్త్రి ఒక సందర్భంలో టెర్రరిస్ట్ ఖాదిర్ ఖాన్ చ‌నిపోలేద‌నే విషయాన్ని జై కి చెబితాడు. అంతేకాకుండా ఖాదిర్ ఖాన్ ను చంపే బాధ్యతను జైకి అప్పగిస్తాడు రా చీఫ్. దీంతో జై తన స్నేహితుడు గోమ‌టం (అభినవ్) తో ఖాదిర్ ఖాన్ ను చంపే ఆపరేషన్లో పాల్గొంటాడు. ఈ ఆపరేషన్ టీమ్ లో జైకి పరిచయమున్న వైష్ణ‌వి (ఐశ్వ‌ర్య మీన‌న్‌)  సైతం వీరితో చేరుతుంది. ఈ ఆపరేషన్లో భాగంగా ఈ బృందానికి (team) ఒక షాకింగ్ వార్త తెలుస్తుంది. వీరి టీమ్ లో ఉన్న సహచరుడు కుల్దీప్ (రవి వర్మ) సుభాష్ చంద్ర బోస్ కి సంబంధించిన రహస్య ఫైల్ ను దొంగిలించి టెర్రరిస్ట్ ఖాదిర్ ఖాన్ కి అందజేస్తాడు. దీని కారణంగా దేశంపై న్యూక్లియర్ అటాక్ జరగనుందని అందరూ భావిస్తారు. దీంతో జై, అతని సహచరులు అందరూ ఈ ఆపరేషన్లో భాగస్వాములు అవుతారు. సుభాష్ చంద్ర బోస్ కి సంబంధించిన రహస్య ఫైల్ లో ఏముంది? ఈ ఆపరేషన్ ను జై అండ్ టీమ్ ఎలా పూర్తి చేసింది అనేది ప్రేక్షకులను ఎంతగానో ఉత్కంఠతకు గురి చేస్తుంది. 

ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునేలా తీరిదిద్దారు. సినిమా ప్రారంభం నుండి శుభం కార్డు వ‌ర‌కు ఆడియెన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది. నేతాజీ  సుభాష్ చంద్ర‌బోస్  పాత్ర‌లో రానా ద‌గ్గుబాటి అద్భుతమైన నటన కనబరిచాడు.

ఎడిటర్ గా పలు హిట్ చిత్రాలకు పనిచేసిన గ్యారీ బి.హెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల అందించిన పాతాళ సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ఆ చిత్రానికి వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు. దగ్గుబాటి రానా కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ నటన పరంగా ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇంకా నెగెటివ్ రోల్ పోషించిన జిస్సు సేన్ గుప్తా విల‌నిజంతో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మిగతా పాత్రల్లో నటించిన సచిన్ ఖేడేక‌ర్‌, పోసాని కృష్ణ ముర‌ళి, సురేష్  ల పాత్రలు ఇలావచ్చి అలా వెళ్లి పోతాయి. వీరి పాత్రలకు తగిన న్యాయం జరగలేదనే భావన ప్రేక్షకులకు కలిగిందని చెప్పవచ్చు.