నేడు శ్రీదేవి వర్ధంతి : Today Sridevi Death Anniversary
మన్మథుడే బ్రహ్మను పూని... సృష్టించాడేమో గానీ... అన్నట్లుగా… అతిలోక సౌందర్య రాశి, దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య (Goddess)... ఇలాగ ఎంత వర్ణించినా సరిపోనటువంటి అతిలోక సుందరి (Supernatural beauty) మహానటి శ్రీదేవి (Sridevi).
నేడు శ్రీదేవి వర్ధంతి : Today Sridevi Death Anniversary
మన్మథుడే బ్రహ్మను చూసి... సృష్టించాడేమో గానీ... అన్నట్లుగా… అతిలోక సౌందర్య రాశి, దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య (Goddess)... ఇలాగ ఎంత వర్ణించినా సరిపోనటువంటి అతిలోక సుందరి (Supernatural beauty) మహానటి శ్రీదేవి (Sridevi). బ్రహ్మ దేవుడు (God Brahma) ఎంతకని ఆమెను తయారుచేసి దివి నుంచి భువికి (Heaven to Earth) పంపాడో... కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేలా చేసింది. అంతటి మహా సౌందర్యవతి (Beauty) వర్ధంతి నేడు.
నటన కోసమే పుట్టిన శ్రీదేవి : Sridevi Born for Acting
నటన కోసమే ఆమె పుట్టిందా (Born for Acting) ... అన్నట్లుగా తన అమోఘమైన హావభావాలు, నటన, మోముపైన అమాయకత్వం (Innocence)... చిలిపి నవ్వులు (Prankness)… ఎన్నని చెప్పగలం. కేవలం పాత్రలు ఆమె కోసమే పుట్టాయా అన్నట్లుగా అన్ని పాత్రలకు న్యాయం చేసి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అంభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ (Heroine) గా ప్రఖ్యాతి చెందింది. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ గా ఖ్యాతి గడించింది. బాలనటిగా (Child Artist) ఏ హీరో పక్కన నటించిందో, ఆ హీరోలతోనే హీరోయిన్ గా నటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. బహుశా సినిమా రంగ చరిత్రలోనే (History Created) ఈ విధంగా ఎప్పుడూ జరిగి ఉండదంటే అతిశయోక్తి కాదు. అటువంటి దేవకన్య (Angel) ఈ లోకం నుంచి వెళ్లిపోయిందంటే ఇప్పటికీ అందరికీ నమ్మశక్యంగా లేదు. ఆమె మన మధ్యే ఉన్నట్లుంది ఆమె అభిమానులు (Fans), సినీ రంగ ప్రముఖులు పేర్కొంటున్నారంటే ఎంతలా ఆమె సినీ రంగాన్ని ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు. శ్రీదేవి తల్లి రాజేశ్వరి (Mother Rajeshwari) తన కూతురు ఎప్పటికైనా మంచి నటి అవుతుందని గట్టింగా నమ్మేది. అందుకే చిన్నతనంలోనే (Childhood) సినిమాల్లో నటింపచేసింది.
ఐదేళ్లకే సినిమాల్లోకి ఎంట్రీ : Entered films 5 years of age
శ్రీదేవి తన ఐదేళ్ల వయసులో 'తునైవన్' (Tunaivan) అనే తమిళ చిత్రంలో సుబ్రమణ్యస్వామి వేషాన్ని వేసింది. తెలుగులో "మానాన్న నిర్దోషి" (Maa Nanna Nirdoshi) చిత్రంలో బాలనటిగా రంగ ప్రవేశం చేసింది. ఇందులో సూపర్ స్టార్ కృష్ణతో శ్రీదేవి నటించింది. అప్పటి నవరస నటనా సార్వభౌముడు నందమూరి తారక రామారావు (NTR) కి బడిపంతులు సినిమాలో మానవరాలిగా (Granddaughter) నటించింది శ్రీదేవి. ఆ తరువాత ఆకుచాటు పిండే తడిసె... అంటూ ఆయనతోనే హీరోయిన్ (Heroine) గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటి తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర నటులైన అక్కినేని నాగేశ్వరావు (ANR), నందమూరి తారక రామారావు (NTR), కృష్ణ (Krishna), శోభన్ బాబు (Sobhanbabu) లతో ఎన్నో చిత్రాల్లో నటించింది. ANR కొడుకు నాగార్జున (Nagarjuna) తో కూడా నటించి తండ్రి కొడుకులతో హీరోయిన్ గా నటించిన నటిగా ఘనత వహించింది.
దేవకన్య శ్రీదేవి : Sridevi as a Goddess
సిరిమల్లె పువ్వా... సిరిమల్లె పువ్వా... చిన్నారి చిలకమ్మా... అని పాడుకుంటూ 'పదహారేళ్ళ వయసు' (Padaharella Vayasu) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కుర్రకారుల గుండెల్లో అలజడి రేపింది. ఇప్పటికీ ఆ సినిమా పేరు వింటే కుర్రకారుల హృదయాలు కాకుండా ముసలివారు సైతం హుషారుగా చిందులేస్తారు. అంతలా మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది. అన్ని భాషల్లోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి అందరి దృష్టిలో పడింది. కమలహాసన్ (Kamalhasan) తో 'వసంత కోకిల' లా నటించింది. చిరంజీవితో (Chiranjeevi) 'జగదేకవీరుడు-అతిలోకసుందరి'లో నిజంగానే దేవకన్య ఇలా ఉంటుందా అనిపించింది. నాగార్జునతో (Nagarjuna) ఆఖరి పోరాటం, వెంకటేష్ (Venkatesh) తో క్షణక్షణం సినిమాల్లో నటించింది. తెలుగుతో (Telugu) పాటు తమిళం (Tamil), కన్నడ (Kannada), మలయాళం (Malayalam), హిందీ (Hindi) భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి తన హవాను ఎన్నో ఏళ్ళు కొనసాగించింది.
1963 ఆగస్టు 13న శ్రీదేవి తమిళనాడు రాష్ట్రం శివకాశిలోని మీనంపట్టిలో (Meenampatti, Sivakashi, Tamilnadu) తన తండ్రి ఇంట జన్మించింది. తల్లి రాజేశ్వరి ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి చెందిన వారు. శ్రీదేవి అసలు పేరు అమ్మ యాంగర్ అయ్యప్పన్ (Sridevi real Name is: Shree Amma Yanger Ayyapan). బాలీవుడ్ (Bollywood) లో నగీనా (Nagina), మిస్టర్.ఇండియా (Mr.India) వంటి మరపురాని చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. దాదాపు 300 చిత్రాల్లో శ్రీదేవి నటించింది. 2017 లో 'మామ్' (Mom) సినిమాలో శ్రీదేవి నటనను విమర్శకులు (Critics) సైతం మెచ్చుకున్నారు. శ్రీదేవికి 5 ఫిలిం ఫేర్ అవార్డులు (5 Film Fare Awards), 2013 లో పద్మశ్రీ (Padma Sri) లభించింది.
శ్రీదేవికి భర్త బోనీ కపూర్ (Bony Kapoor), కూతుళ్లు జాన్వీ కపూర్ (Janhvi Kapoor), ఖుషి కపూర్ (Kushi Kapoor) ఉన్నారు. తన కూతురు జాన్వీని తెరపై చూడాలని శ్రీదేవి ఎప్పుడూ అంటుండేది. చివరికి ఆ కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న బంధువుల పెళ్ళి కోసం దుబాయ్ (Dubai) వెళ్లి ఓ హోటల్ బాత్ టబ్‌లో (Bath Tub) ప్రమాదవశాత్తు పడి కన్ను మూసి అందరినీ పెను విషాదంలో నింపింది. ఆమె మరణ వార్తను విన్న అభిమానులు, యావత్ సినీ రంగ ప్రముఖులు (Entire Cine field) దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎంతమంది హీరోయిన్లుగా వచ్చినా, శ్రీదేవికి ఉన్న స్థానాన్ని ఎవ్వరూ పూడ్చలేరంటే అతిశయోక్తి కాదు. శ్రీదేవి మరణించినా... ఆమె నటించిన చిత్రాలు (Sridevi all movies) ఎప్పటికీ అజరామరమే (Immortal). ఇప్పటికీ ఆమె చనిపోయిందంటే నమ్మశక్యంగా లేదని ఆమె అభిమానులు కన్నీళ్లతో చెబుతుంటారు.
శ్రీదేవి తెలుగులో (Telugu) నటించిన కొన్ని అద్భుతమైన చిత్రాలు... ప్రేమాభిషేకం, ఆకలిరాజ్యం, దేవత, వసంత కోకిల, వేటగాడు, క్షణక్షణం, ఆఖరి పోరాటం.