విడుదలైన 'భగవంత్ కేసరి' మూవీ టీజర్ : 'Bhagavanth Kesari' movie Teaser released
భగవంత్ కేసరి టీజర్‌లోని ఒక సీన్‌లో బాలకృష్ణ (Balakrishna) ఒక జైలులో ఖైదీగా ఉన్నట్లు చూపించారు. బాలయ్య ధరించిన చొక్కాపై 108 నెంబర్ కనిపిస్తుంది

నందమూరి నట సింహం, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Hero, MLA Balakrishna) సినిమా అంటేనే అభిమానులకు పూనకం వస్తుంది. ఇక ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా మాస్ హిస్టీరియా కొనసాగుతుంది. నేడు బాలకృష్ణ పుట్టిన రోజు (Birthday) కావడంతో ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari) టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బాలకృష్ణ గతంలో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘నరసింహ నాయుడు’ రీరిలీజ్ అయింది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ నరసింహ నాయుడు చిత్రం ప్రదర్శిస్తున్న సినిమా థియేటర్ లో ‘భగవంత్ కేసరి’ మూవీ టీజర్ (movie teaser) ను విడుదల చేసారు. అనిల్ రావిపూడి (Director Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు సృష్టించింది. తాజాగా విడుదల చేసిన టీజర్లో బాలకృష్ణ చేసిన మాస్ విధ్వంసం ఎలా ఉందంటే...
‘రాజు వాని వెనకున్న వందల మంది మందను చూయిస్తడు... మొండోడు వానికున్న ఒకే ఒక గుండెను చూయిస్తడు’ అంటూ బాలకృష్ణ చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. అంతేకాకుండా పక్కా హైదరాబాదీ స్టైల్‌లో హిందీలో (Hyderabad style Hindi) చెప్పిన డైలాగ్ కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక టీజర్ చివరిలో ‘అడుగుపెట్టా... నేలకొండపల్లి భగవంత్ కేసరి. ఈ పేరు చానా ఏండ్లు యాదుంటది’ అంటూ చెప్పిన మరో పవర్‌ఫుల్ డైలాగ్‌తో టీజర్ దద్దరిల్లింది. స్టార్ సంగీత దర్శకుడు థమన్ (Music Director Thaman) మరోసారి తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కట్టిపడేశాడు.
భగవంత్ కేసరి టీజర్ : Bhagwant Kesari Teaser
భగవంత్ కేసరి టీజర్‌లోని ఒక సీన్‌లో బాలకృష్ణ (Balakrishna) ఒక జైలులో ఖైదీగా ఉన్నట్లు చూపించారు. బాలయ్య ధరించిన చొక్కాపై 108 నెంబర్ కనిపిస్తుంది. దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఎందుకంటే ఈ 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari) సినిమా బాలకృష్ణకి 108 వ చిత్రం (108th film). అంతేకాకుండా ఈ టీజర్ ను సైతం 108 థియేటర్లలో ప్రదర్శించడం మరో విశేషం. బాలకృష్ణ సినిమా అంటేనే ఒక సెన్సేషన్. అందులోనూ ఇప్పుడు మాస్ యాంగిల్ (mass angle) అంటే ఇక అభిమానులకు (balayya fans) పండగే పండగ. బాలయ్యలో యాంగిల్ ను దర్శకుడు అనిల్ రావిపూడి చూపించినట్లు టీజర్ చూస్తుంటేనే తెలుస్తోంది. దీనికి ఉదాహరణగా టీజర్ చివరిలో వచ్చే సీన్ ద్వారా చూపించారు. ఈ టీజర్ బాలకృష్ణ ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా సాధారణ అభిమానులు సైతం ఫిదా అయ్యారనడంలో సందేహమే లేదు.
షైన్ స్క్రీన్ పతాకంపై (Shine screen banner) సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. కాజల్ అగర్వాల్ (Heroine Kajal Agarwal) కథానాయికగా నటిస్తోంది. యంగ్ హీరోయిన్ శ్రీలీల (Heroine Srileela) బాలయ్యకు కూతురి పాత్రలో కనిపించనుంది. సి రాంప్రసాద్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి : About Hero cum MLA Balakrishna
తెర పైన, తెర వెనక శ్లోకాలు, పద్యాలను అవలీలగా చెప్పగలిగే అరుదైన తెలుగు నటుల్లో బాలయ్య ఒకరు. తండ్రి నందమూరి తారక రామారావు (NTR) వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న బాలయ్య ప్రస్తుతం ఉన్న నటుల్లో పౌరాణిక, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్... ఇలా అన్ని పాత్రలను టచ్ చేసిన ఏకైక కథానాయకుడు ఒక్క బాలయ్య మాత్రమే. ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఓవైపు అగ్రకథానాయకుడిగా కొనసాగుతూనే... మరోవైపు రాజకీయ నాయకుడిగా (MLA Balakrishna) ప్రజలకు సేవ చేస్తున్నారు హీరో బాలకృష్ణ. పైసా వసూల్, సాహసమే జీవితం, సింహా, నిప్పులాంటి మనిషి చిత్రాలు ఆయన కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే మరపురాని చిత్రాలు. ఆయా డైలాగులు చెబుతుంటే థియేటర్లలో ఈలలే ఈలలు. తాతమ్మ కల సినిమాతో హీరోగా చిత్ర రంగ ప్రవేశం చేశారు బాలకృష్ణ. 100 కి పైగా చిత్రాల్లో నటించిన బాలకృష్ణ ఒక్క రీమేక్ చిత్రంలో (no remake pictures) కూడా నటించని ఏకైక హీరోగా ఘనత వహించారు.
Also Read - 2023 జూలైలో విడుదల కానున్న తెలుగు సినిమాలు