2023 జూలైలో విడుదల కానున్న తెలుగు సినిమాలు

టాలీవుడ్ (Tollywood) లో ఈ ఏడాది జూలై నెలలో (in July) దాదాపు 12 సినిమాలు విడుదల కానున్నాయి. పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఇందులో ఉన్నాయి.

2023 జూలైలో విడుదల కానున్న తెలుగు సినిమాలు

టాలీవుడ్ (Tollywood) లో ఈ ఏడాది జూలై నెలలో (in July) దాదాపు 12 సినిమాలు విడుదల కానున్నాయి. పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే ఇప్పటి రోజుల్లో చిన్న చిత్రాలను సైతం ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కంటెంట్ (content) ఉంటే చిన్నా, పెద్ద చిత్రాలు అని చూడడం లేదు. రాబోయే నెలలో విడుదలయ్యే చిత్రాలపై ఒక లుక్కేద్దాం.

గూఢచారి 2 : Goodachari 2

Goodachari 2

అడివి శేష్‌ కథానాయకుడిగా, శోభిత ధూళిపాళ్ల కథానాయకిగా నటించిన చిత్రం గూఢచారి 2. ఈ సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా మలిచారు. ఈ సినిమాకి వినయ్ కుమార్ సిరిగినీది దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర, అభిషేక్ నామా నిర్మాతలుగా వ్యవహరించి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం 2023 జూలై 4 న విడుదల కానుంది.

శ్రీరంగనీతులు : Sriranganeetulu

సుహాస్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న శ్రీరంగ‌నీతులు సినిమా న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో సుహాస్‌తో పాటు కార్తిక్‌ర‌త్నం, విరాజ్ అశ్విన్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈ సినిమాతో ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎన్ ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 5 జూలై 2023 న విడుదల అవుతోంది.

రంగబలి : Rangabali

Rangabali Telugu Movie

కామెడీ డ్రామా ఎంటర్టైనర్ చిత్రంగా రూపొందుతున్న రంగబలి చిత్రంలో నాగ శౌర్య హీరోగా, యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించారు. సీహెచ్ పవన్ సంగీతాన్ని అందించారు. అక్కల సత్య, గోపరాజు రమణ, సప్తగిరి, బ్రహ్మాజీ, మురళీ శర్మ, కళ్యాణి నటరాజన్, షైన్ టామ్ మిగతా పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 5 జూలై 2023 న విడుదల కానుంది.

బడ్డీ : Buddy

శామ్ అంటోన్ దర్శకత్వంలో నిర్మించిన యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం బడ్డీ. ఈ చిత్రంలో అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, గోకుల్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందించారు. ఎడిటింగ్ బాధ్యతలను రూబెన్ నిర్వహించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత KE జ్ఞానవేల్ రాజా నిర్మించారు. టాప్ ప్రొడక్షన్ బ్యానర్ స్టూడియో గ్రీన్‌పై నిర్మించిన ఈ చిత్రం 8 జూలై 2023 న విడుదల కానుంది.

ఫైర్ : Fire

నమిత, రిషి, సంద్య, మౌనిక నటించిన యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఫైర్. దర్శకత్వ బాధ్యతలను బషీద్ SK నిర్వహించారు. నిర్మాతగా కరీమున్నీసా SK వ్యవహరించారు. సంగీత దర్శకురాలు MM శ్రీలేఖ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం 14 జూలై 2023 న విడుదల కానుంది.

రెండు జెళ్ళ సీత : Rendu jella seetha

రెండు జెళ్ళ సీత సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ చిత్రంలో నవీన్ విజయ్ క్రిష్ణ, కీర్తి సురేష్, నాగేంద్ర బాబు, రాహుల్ దేవ్, పోసాని క్రిష్ణ మురళి, సప్తగిరి, కొండవలస తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి రామ్ ప్రసాద్ రగుతు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. చంటి అడ్డాల ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీతదర్శకుడు అచ్చు స్వరాలు అందించారు. ఈ చిత్రం 14 జూలై 2023 న విడుదల కానుంది.

సామజ వరగమన : Saamaja varagamana

సామజ వరగమన మూవీ రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఈ మూవీలో శ్రీ విష్ణు, రెబ మోనికా జాన్, వెన్నెల కిషోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించారు. AK ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 16 జూలై 2023 న ఈ చిత్రం విడుదల కానుంది.

Read - 'Tiger Nageswara Rao' first look poster released

హత్య : Hatya

బాలాజీ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం హత్య. ఈ చిత్రంలో బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ, రితిక సింగ్, మీనాక్షి చౌదరి, రాధికా శరత్ కుమార్, మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. గిరీష్ గోపాలకృష్ణన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం 2023 జూలై 18 న విడుదల కానుంది.

పుష్ప ది రూల్ : Pushpa the Rule

Pushpa the Rule Telugu Movie

పుష్ప మొదటి భాగం ఎంత చరిత్ర సృష్టించిందో యావత్ భారతదేశం చూసింది. దానికి సీక్వెల్ గా వస్తున్నా రెండో భాగమే పుష్ప ది రూల్. యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం జూలై 19 న విడుదల కానుంది. అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. నిర్మాతలు నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'వేర్ ఈజ్ పుష్ప' గ్లింప్స్ అభిమానులను విశేషంగా అలరించింది.

బ్రో : Bro

తమిళంలో సముద్రఖని ప్రధాన పాత్రలో నటించి... దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రం వినోదయ సీతమ్ కి తెలుగు రీమేక్ గా బ్రో సినిమాను నిర్మించారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతికా శర్మ, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, రాజా చేంబోలు, ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు నటించారు. యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Also Read - Mahesh's movie title name is 'Guntur Karam

ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు (Anaganaga oka Raju) జూలై 21 వతేదీన, విజయ్ ఆంటోని, అరుణ్ విజయ్ నటించిన జ్వాల (Jwala) 25 జూలైన, పంజా వైష్ణవ్ తేజ్, శ్రీ లీల నటించిన ఆది కేశవ జూలై 29 న విడుదల కానున్నాయి.