WTC ఫైనల్‌లో శుభ్‌మన్ గిల్ ని ఔట్ చేసిన స్కాట్ బోలాండ్

లండన్ లోని ఓవల్ మైదానంలో భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రారంభమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ లో భారత బ్యాట్స్‌మన్లు తేలిపోయారు.

WTC ఫైనల్‌లో శుభ్‌మన్ గిల్ ని ఔట్ చేసిన స్కాట్ బోలాండ్

లండన్ లోని ఓవల్ మైదానంలో భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రారంభమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ లో భారత బ్యాట్స్‌మన్లు తేలిపోయారు. హోరాహోరీగా మ్యాచ్ జరగనుందని భావించిన భారత క్రికెట్ ప్రేమికులు మ్యాచ్ లో బ్యాట్స్‌మన్ల ఆటతీరు పట్ల పెదవి విరుస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమవడంతో (Captain Rohit Sharma) ఆట ఎందుకు దండగ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. 26 బంతుల్లో 15 పరుగులు చేసిన రోహిత్ శర్మ పాటు కమిన్స్ బౌలింగ్ లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC final) కోసం ఆస్ట్రేలియా జట్టులో ఎంపికైన జోష్ హేజిల్‌వుడ్ గాయపడడంతో అతని స్థానంలో వచ్చిన పేసర్ స్కాట్ బోలాండ్ (Scott Boland) తన బౌలింగ్ లో అద్భుతమైన బంతితో శుభమన్ గిల్ (Shubman Gill) ను బౌల్డ్ చేసాడు. దీంతో గిల్ నిరాశగా వెనుదిరిగాడు. ఆఫ్ స్టంప్ నుండి బైటకు వెళుతుంది అని భావించి వదిలేయాలని భావించే లోపే ఆ డెలివరీ ఆఫ్ స్టంప్ ను గిరాటేసింది. దీంతో ట్విట్టర్ వేదికగా గిల్ ని ట్రోల్ (trolling by twitter) చేస్తున్నారు.

Some tweets on Shubhman Gill

శుభమన్ గిల్‌కు బంతిని ఎలా వదిలేయాలో కూడా తెలియదు. మీరు అతన్ని బాబర్ ఆజంతో పోల్చుతున్నారు... ఎహితిశామ్ సిద్దిఖ్ (Ehtisham Siddique)

ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్ laku ఇంగ్లాండ్ లో పెద్ద తేడా ఉంటుంది. గిల్ బేబీ ఐపీఎల్ అనుకుని ఇంగ్లాండ్ వెళ్ళాడు... పంకు (Panku)

మ్యాచ్ విషయానికి వస్తే...

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC final) మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 469 పరుగులకు ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజ్ లో అజింక్య రహానే (Rahane) 29 పరుగుల తోనూ, శ్రీకర్ భరత్ (Srikar Bharat) 5 పరుగులతో ఆడుతున్నారు. భారత్ టాప్ ఆర్డర్ అందరూ విఫలమైనప్పటికీ రవీంద్ర జడేజా (Jadeja) కొంచెంసేపు పోరాడాడు. స్వేచ్ఛగా తన బ్యాట్ ను ఝుళిపించి. 51 బంతుల్లో 48 పరుగులు రాబట్టాడు. హాఫ్ సెంచరీకి రెండు పరుగుల ముందు క్యాచ్ ఔటై పెవిలియన్ చేరాడు. ఇక భారమంతా రహానే, భరత్ మీదే ఉంది. వీరిద్దరూ అవుటయితే మాత్రం మ్యాచ్ ఆస్ట్రేలియా చేతిలోకి వెళ్ళినట్లే.