రేపు గుడ్ ఫ్రైడే : Tomorrow is Good Friday

నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు (Love your neighbor as yourself) ... అని యేసు (Jesus) బోధించాడు. అదేవిధంగా ఆయన మనుష్యులు చేసిన పాపాల కోసం తన ప్రాణాలను సిలువపై మోశారు. ఎదుట వ్యక్తి కంటిలోని నలుసును వెదికే ముందు నీ కంటిలోని దూలాన్ని చూసుకోమని ఆయన చెప్పాడు.

రేపు గుడ్ ఫ్రైడే : Tomorrow is Good Friday

రేపు గుడ్ ఫ్రైడే : Tomorrow is Good Friday

నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు (Love your neighbor as yourself) ... అని యేసు (Jesus) బోధించాడు. అదేవిధంగా ఆయన మనుష్యులు చేసిన పాపాల కోసం తన ప్రాణాలను సిలువపై మోశారు. ఎదుట వ్యక్తి కంటిలోని నలుసును వెదికే ముందు నీ కంటిలోని దూలాన్ని చూసుకోమని ఆయన చెప్పాడు. క్రైస్తవ మత విశ్వాసం ప్రకారం యేసు క్రీస్తును శుక్రవారం (friday) నాడు సిలువ వేశారు. అందుకే ఆ రోజుని శుభ శుక్రవారం (Good Friday) గా జరుపుకుంటారు. అయితే ఎంతోమందికి ఎన్నో సందేహాలు రావొచ్చు. చనిపోయిన రోజు ఎలా శుభదినం అవుతుంది… అని.

 

దీని వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే... ఒకరి కోసం మరొకరు ప్రాణాలను వదలడం జరగదు. అయితే, యెహోవా (Jehova) దేవుడు భూలోకంలో పెరుగుతున్న పాపుల రక్షణార్థం ఆయన కుమారుడైన యేసు క్రీస్తును భూమి పైకి పంపుతాడు. యేసు (Jesus) భూలోకంలో జన్మించిన తరువాత 30 ఏళ్ళు (30 years) తన తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటాడు. అనంతరం మూడున్నరేళ్లు సువార్త బోధ చేస్తాడు. ఆయనకు ఎందరో శిష్యులు ఉన్నారు. వారిలో 12 మంది ముఖ్య శిష్యులు (12 disciples) ఉన్నారు. వీరిలో యూదా ఇస్కరియోత్ అనే శిష్యుడు కేవలం 33 వెండి నాణేల (only for 33 silver coins) కోసం యేసు ప్రభువుకు నమ్మక ద్రోహం చేస్తాడు. యేసు క్రీస్తు ఎక్కడ ఉన్నదో యూదా సైన్యానికి చెప్పేస్తాడు. ఆ తర్వాత క్రీస్తును సైన్యం బంధించడం, ఆయన్ను సిలువ వేయడం జరుగుతుంది. సిలువపై వ్రేలాడుతున్నపుడు ఆయన చివరిగా ఏడు మాటలను (7 words) పలుకుతాడు. క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ ఈ రోజును గుర్తు తెచ్చుకుని ప్రత్యేక ప్రార్థనలు (prayers) చేస్తారు. యేసు క్రీస్తు తాను భూమిపై బతికున్న రోజుల్లో ఎన్నో బోధనలు చేశారు. అందులో ముఖ్యమైనది తమ పొరుగువారిని ప్రేమించి వారి తప్పులను క్షమించాలని చెప్తారు. దీన్నే క్రైస్తవులు అనుసరిస్తారు.

శత్రువులను ప్రేమించాలని (Love your enimies), వారు చేసిన తప్పులను క్షమించాలని యేసు బోధించాడు. గుడ్ ఫ్రైడే (Good Friday) అనే పదం... గాడ్స్ ఫ్రైడే అనే పదం నుంచి వచ్చిందని చెబుతారు. ఇజ్రాయెల్, నజరేతు పట్టణానికి చెందిన యేసు ప్రభువును అక్కడి ప్రజలు తమ రక్షకుడిగా కొలుస్తారు. ఇది నచ్చని యూదా మత పెద్దలు, ప్రవక్తలు (religious leaders and prophets) ఏకమై, యేసు క్రీస్తు ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారని, తాను దేవుడి ప్రతినిధిగా ప్రచారం చేసుకుంటున్నాడని చక్రవర్తికి నూరిపోస్తారు. తమ పబ్బం గడుపుకునేందుకు వీరంతా కలిసి యేసు క్రీస్తును ఎలాగైనా హతమార్చాలను కుట్ర పన్నుతారు. యేసును సిలువ వేయాలను (hang on cross) చక్రవర్తిపై అందరూ కలిసి ఒత్తిడి తెస్తారు. చక్రవర్తి మాట పెద్దలు, ప్రవక్తల మాటలకు తలొగ్గి, మనసు అంగీకరించక పోయినా సిలువ వేయమని ఆజ్ఞ ఇస్తాడు. యూదా సైనికులు (Jude soldiers) యేసు క్రీస్డు భుజంపై సిలువ పెట్టి కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెళతారు. ఆయన తలపై ముళ్ల కెరేటం పెట్టి, అరచేతుల్లోనూ, అరికాళ్లలో మేకులు (nails) దిగ్గొట్టి సిలువపై వ్రేలాడదీస్తారు. ఆఖరికి ఓ తండ్రీ... వీరేమి చేయుచున్నారో వీరికే తెలియదు... వీరిని క్షమించండి (O Father... They do not know what they are doing... Forgive them) అంటూ చివరిగా ఏడు మాటలు పలికి ప్రాణాలను విడుస్తాడు. దీనికి జ్ఞాపకంగా క్రైస్తవులు అందరూ ఈరోజున శుభ శుక్రవారంగా (Good Friday) జరుపుకుంటారు. చర్చిల్లో ప్రార్ధనలు (prayers in churches) జరుపుతారు. మూడో రోజున యేసు తిరిగి లేచే రోజు ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. తాను చనిపోయిన మూడు రోజుల తరువాత తిరిగి లేస్తానని (Christ resurrection) కూడా యేసు క్రీస్తు చెప్పాడు.

 

సిలువపై యేసు పలికిన ఏడు మాటలు : 7 words of Jesus on the cross

1. తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను.

సైనికులు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి. అప్పుడు యేసు ఈ మాటలను పలికాడు.

2. నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువు

ఆయనతో పాటు శిలువ వేయబడిన ఇద్దరి దొంగలలో ఒక దొంగను కూడా యేసు క్రీస్తు క్షమించారు. యేసు క్రీస్తుతో పాటు కుడి వైపు ఒకరు, ఎడమ వైపు ఒకరు ఇద్దరు బందిపోటు దొంగలు కూడా శిలువ వేయబడ్డారు. వారిలో ఒక దొంగ ఆయనతో నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని అడిగినప్పుడు యేసు ఈ పాటలను పలికాడు.

 

3. అమ్మా, యిదిగో నీ కుమారుడు

యేసు తన తల్లి, తాను ప్రేమించిన శిష్యుడు సిలువ దగ్గర నిలుచుండుట చూచి అమ్మా,యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. పరలోకపు తండ్రి యెహోవా దేవుడు ఆయనకు అప్పగించిన గొప్ప కార్యమును చేస్తూ కూడా, ఆయన తన కుటుంబ భాద్యత మర్చిపోలేదు.

 

4. నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి

ఇంచుమించు మూడు గంటల సమయమప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటలకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.

 

5. నేను దప్పిగొనుచున్నాననెను

యేసు క్రీస్తును శిలువ వేసినప్పుడు మొదట ఆయనకు చేదును కలిపిన ద్రాక్షరసం ఇస్తారు. అయితే అది ఆయన స్వీకరించలేదు. ఆ సమయంలో ఆయన ప్రవచనాలు నెరవేర్చడానికి గానూ ఈ మాటలను పలికాడు.

6. సమాప్తమైనది

తండ్రి తనకు అప్పగించిన పనిని యేసు క్రీస్తు పూర్తి చేసారు. ఏ పాపమూ లేకుండా జీవించి, లోక రక్షణార్థం శిలువపై తనను తాను బలిగా అర్పించుకుని తండ్రి అప్పగించిన పనిని పూర్తి చేసాడు.

 

7. తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను

మరణించే ముందు యేసు క్రీస్తు... తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్ననని పలికినవే ఆయన చివరి మాటలు

 

నూతన నిబంధన గ్రంథం, యోహాను 3:16 (John 3:16)

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.