ఐపీఎల్ లో నేడు తలపడనున్న కోల్కతా vs బెంగళూర్ : KKR vs RCB match in IPL today

ఐపీఎల్ లో నేడు తలపడనున్న కోల్కతా vs బెంగళూర్ : KKR vs RCB match in IPL today

ఐపీఎల్ లో నేడు తలపడనున్న కోల్కతా vs బెంగళూర్ : KKR RCB match in IPL today

ఐపీఎల్‌ 16 సీజన్లో (IPL 2023) భాగంగా నేడు కోల్కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూర్ జట్టు మొదటి మ్యాచ్లో విజయం సాధించగా, కోల్కతా జట్టు డక్వర్త్ లూయిస్ నిబంధన (DLS method) ప్రకారం పంజాబ్ కింగ్స్పై ఓటమి చెందింది. నేడు జరిగే మ్యాచ్ ఇరు జట్లకూ రెండవది.

 

ఐపీఎల్ 2023 లో ఆర్సీబీ ప్రదర్శన : RCB Performance in IPL 2023

ఇప్పటి వరకూ ఒక్క ఐపీఎల్ (IPL) గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (RCB) జట్టు ఏడాది 16 సీజన్ ను ఘన విజయంతో ప్రారంభించింది. 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) జట్టు పై విజయం సాధించింది. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ (RCB) 172 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ (Captain Duplessis) తో కలిసి విరాట్ కోహ్లీ ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో విజయం సులువయింది. మ్యాచ్లో వీరిద్దరూ ఓపెనర్లుగా దిగారు. ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) (49 బంతుల్లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 82 పరుగులు) చేయగా, డుప్లెసిస్ (Duplessis) (73; 43 బంతుల్లో నాలుగు ఫోర్లు,ఆరు సిక్సర్లతో 73 పరుగులు) చేసాడు. ఆర్సీబీ జట్టు రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి కేవలం 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్డుప్లెసిస్​ 'మ్యాన్ఆఫ్ మ్యాచ్‌' అవార్డు అందుకున్నాడు.

రికార్డుల రారాజు కోహ్లీ : Kohli is the king of records

ఫార్మాట్ (any format) అయినా రికార్డులు సాధించాలంటే అది తనకే సాధ్యమనే రీతిలో కోహ్లీ ఉన్నాడు (kohli records). ఐపీఎల్ 16 సీజన్లో కోహ్లీ అరుదైన రికార్డును నమోదు చేసాడు. ఆర్సీబీ ఓపెనర్గా 3 వేల పరుగుల (as an opener 3000 runs) మార్క్ను అందుకున్నాడు. ఐపీఎల్ అన్ని సీజన్లలో ఇప్పటివరకూ 224 మ్యాచ్లు   ఆడిన కోహ్లీ 6,706 పరుగులు చేశాడు. అదేవిధంగా 50+ స్కోర్లు చేయడం ఇది 50 సారి కావడం గమనార్హం. దీంతో 50+ స్కోర్లు (50+ score made 50 times) చేసిన వారి జాబితాలో రెండో స్థానానికి (2nd place) చేరుకున్నాడు. మొదటి స్థానంలో డేవిడ్ వార్నర్ (60) ఉన్నాడు. తరువాతి స్థానాల్లో వరుసగా ధావన్‌ (49), ఏబీ డివిలియర్స్‌ (43), రోహిత్శర్మ (41) ఉన్నారు.

 

ఆర్సీబీ ప్లేయింగ్ XI : RCB playing XI 

 విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, మైఖేల్ బ్రేస్వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కరణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, డేవిడ్ విల్లీ, మహ్మద్ సిరాజ్

 

ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ : RCB full squad

విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, మహ్మద్ సిరాజ్, ఫాఫ్ డు ప్లెసిస్, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, రజత్ పటీదార్, అనుజ్ రావత్, ఆకాశ్ దీప్, జోష్ హేజిల్వుడ్, మహిపాల్ లోమ్రోర్, ఫిన్ అలెన్, సుయాష్ సిద్ధర్ శర్మ, సుయాష్ ప్రభుదేస్ కౌల్, డేవిడ్ విల్లీ, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, మనోజ్ భాండాగే, రాజన్ కుమార్, అవినాష్ సింగ్, సోను యాదవ్, మైఖేల్ బ్రేస్వెల్

ఐపీఎల్ 2023 లో కేకేఆర్ ప్రదర్శన : KKR Performance in IPL 2023

ఐపీఎల్ సీజన్ (IPL season) ను ఘనంగా ఆరంభిద్దామని ఆశించిన కోల్కతా నైట్ రైడర్స్ (KKR) విజయాన్ని వరుణుడు అడ్డుకున్నాడు. తన మొదటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (PBKS) తో తలపడింది. మ్యాచ్కు వరుణుడు (rain) అడ్డంకి కలిగించడంతో క్ర్త్ లూయిస్ ప్రకారం (DLS method) పంజాబ్జట్టు 7 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ (PBKS) 192 పరుగులు చేసింది.

నేటి మ్యాచ్ రస్సెల్, నరైన్ కు ప్రత్యేకం : Russel 100, Naraine 150th Match

ఈ రోజు జరగనున్న మ్యాచ్‌తో రస్సెల్ కెరీర్‌లో 100 వ మ్యాచ్ (Russel IPL 100 match) పూర్తి చేసుకోనున్నాడు. అదేవిధంగా సునీల్ నరైన్ 150 వ మ్యాచ్ (Sunil Naraine IPL 150th match) ఆడనున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి వీరిద్దరికీ చిరస్మరణీయమైన గుర్తింపును ఇవ్వాలని టీమ్ ఆటగాళ్లు ఉత్సాహంతో ఉన్నారు.

కేకేఆర్ ప్లేయింగ్ XI : KKR playing XI 

రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ/లాకీ ఫెర్గూసన్, అనుకుల్ రాయ్, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి

 

కేకేఆర్ ఫుల్ స్క్వాడ్ : KKR full squad

నితీష్ రాణా (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, రింకు సింగ్, విభవ్స్రోన్, డేవిడ్ వీస్,కుల్వంత్ ఖేజ్రోలియా, మన్దీప్ సింగ్, లిట్టన్ దాస్, జాసన్ రాయ్.

ఆర్సీబీ vs కేకేఆర్ హెడ్ టు హెడ్ : RCB vs KKR head to head

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (RCB), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు ఇప్పటివరకూ అన్ని ఐపీఎల్ సీజన్లలో 30 సార్లు తలపడ్డాయి. ఆడిన 30 మ్యాచ్ల్లో కోల్కతా 16 సార్లు నెగ్గింది (KKr wins 16 out of 30). బెంగళూర్ జట్టు 14 సార్లు గెలిచింది. అంటే ఇరు జట్ల మధ్య ఎల్లప్పుడూ హోరాహోరీ పోరు కొనసాగుతుంటుంది. ఆఖరి 5 మ్యాచ్ల్లో (last 5 matches) బెంగళూర్ జట్టు కోల్కతా జట్టుపై 3-2 ఆధిక్యంలో ఉంది.

 

ఈడెన్ గార్డెన్స్లో చివరి 3 IPL మ్యాచ్లు (last 3 IPL matches report in Eden Garden )

మొదటి ఇన్నింగ్స్ స్కోరు (1st innings score) : 207

2 ఇన్నింగ్స్ స్కోరు (2nd innings score) : 193

1 స్థానంలో బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచిన మ్యాచ్లు (1st batting team wins) : 2

2 బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచిన మ్యాచ్లు 2nd batting team wins) : 1

 

KKR vs RCB, IPL 2023, మ్యాచ్ 9 (Match 9)

తేదీ, సమయం: ఏప్రిల్ 6, 2023, 7:30 PM

వేదిక (Stadium): ఈడెన్ గార్డెన్స్, కోల్కతా

లైవ్ స్ట్రీమింగ్ (Live streaming) : జియో సినిమా (Jio cinema)

ప్రసారం (Broadcast) : స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ (Star sports network)