శని జయంతి 2024 మే 7 : Shani Jayanti 2024 May 7
శని జయంతిని (Shani Jayanti) హిందూ మతానికి చెందిన దక్షిణ భారతదేశంలోని (South India) భక్తులు అమావాస్య క్యాలెండర్‌ను అనుసరిస్తారు.
శని జయంతి 2024 మే 7 : Shani Jayanti 2024 May 7
శని జయంతిని (Shani Jayanti) హిందూ మతానికి చెందిన దక్షిణ భారతదేశంలోని (South India) భక్తులు అమావాస్య క్యాలెండర్‌ను అనుసరిస్తారు. ఈ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుపుకుంటారు. అయితే ఉత్తర భారతంలో (North India) కి చెందినవారు పౌర్ణమి క్యాలెండర్‌ను ఫాలో అవుతారు. దీని ప్రకారం, జ్యేష్ట మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం, శని దేవుడిని న్యాయ దేవుడిగా, కర్మలకు అధిపతిగా హిందువులు భావిస్తారు. శని దేవుడు ప్రతి ఒక్కరికి తాము చేసిన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడని భక్తులు విశ్వసిస్తారు. శని దేవుడికి ప్రత్యేక పూజలు చేసిన వారికి సకల పాపాలు తొలగిపోతాయని, కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఏలినాటి శని తొలగి పోవడంతో పాటుగా, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, వైశాఖం, జ్యేష్ఠ మాసాలలో అమావాస్య రోజున శని జయంతిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో అంటే మే 7వ తేదీ మంగళవారం రోజున శని జయంతి (Shani Jayanti) వచ్చింది. ఈ సందర్భంగా శని జయంతి రోజున చేయాల్సిన పూజా విధానం, ఏయే పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలను మీకోసం తెలియజేస్తున్నాం...
హిందూ మత విశ్వాసాల ప్రకారం, శని జయంతిని (Shani Jayanti) ప్రతి ఏడాది రెండు సార్లు జరుపుకుంటారు. ఈసారి వైశాఖ మాసంలోని అమావాస్య తిథి మే 7వ తేదీన మంగళవారం రోజున ఉదయం 11:40 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే మే 8వ తేదీన 8:51 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, శని జయంతిని 8వ తేదీన జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున వేకువజామునే లేచి స్నానం చేసి శనీశ్వరుడికి పూజలు చేయడం వల్ల శని మహాదశ నుంచి ఉపశమనం లభించి, జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు.
జ్యేష్ఠ మాసంలో శని జయంతిని (Shani Jayanti) ఎప్పుడు జరుపుకుంటారంటే...
హిందూ ధర్మ వేద క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది జ్యేష్ఠ మాసంలోని క్రిష్ణ పక్షం అమావాస్య తిథి జూన్ 5వ తేదీ బుధవారం సాయంత్రం 7:54 గంటలకు ప్రారంభమై ఆ మరుసటి రోజు 6వ తేదీ గురువారం సాయంత్రం 6:07 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ఉదయం తిథి ప్రకారం, జ్యేష్ఠ అమావాస్య శని జయంతి 2 జూన్ 2024న జరుపుకుంటారు.
శని జయంతి ప్రాముఖ్యత...
హిందూ పురాణాల ప్రకారం, సూర్యుడు, ఛాయ దేవికి జన్మించిన కుమారుడే శని దేవుడు (God of Shani). శని దేవుడు పూర్తిగా నల్లని రంగులో ఉంటాడు. ఎవరి జాతకంలో అయితే శని దేవుని స్థానం బలంగా ఉంటుందో వారికి శనీశ్వరుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శని దేవుని ఆశీస్సులు లభించిన వారికి రాజయోగం పడుతుందని కూడా చెప్పబడింది. అయితే శని దేవుని స్థానం బలహీనంగా ఉంటే మాత్రం రాజాలా బతికిన వారు సైతం కష్టాల కడలిని ఈదాకా తప్పదని భావిస్తారు. ఇటువంటి వారి జీవితంలో నిత్యం ఏదో ఒక సమస్య వారిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అందుకే ఎవరి జీవితంలో అయితే అనుకోని ఆకస్మిక మార్పులు వస్తాయో.. వారంతా శని దోషం నుంచి విముక్తి పొందడానికి శని జయంతి (Shani Jayanti) రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించాలి.
శని జయంతి (Shani Jayanti) రోజున జరుపుకునే పూజా విధానం..
* శని జయంతి రోజున వేకువజామునే నిద్రలేచి స్నానం చేసి ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించాలి.
* ఎవరైతే తమ జాతకంలో శని దోషం ఉందని భావిస్తారో.. తమకు ఏలినాటి శని పట్టిందని బాధపడుతుంటారో... అటువంటి వారంతా శని దోషం నుంచి విముక్తి పొందడానికి శని జయంతి (Shani Jayanti) రోజున శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
* శనీశ్వరుడు పుట్టిన రోజున బ్రహ్మ ముహుర్తంలో ఉపవాసం, పూజలు చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి.
* నెయ్యి లేదా ఆవాల నూనెతో దీపం వెలిగించి, శని దేవునికి పంచామృతంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి.
* శని మంత్రం, శని చాలీసా పఠించాలి.
* శని పూజ తర్వాత బెల్లంతో చేసిన పదార్థాలను శని దేవుడికి సమర్పించాలి.
శని దేవుని ఆశీస్సుల కోసం (For God of Shani blessings)
హిందూ మత విశ్వాసాల ప్రకారం, శని జయంతి (Shani Jayanti) రోజున స్నానం చేసిన తర్వాత తడి బట్టలతో ఒక గిన్నెలో నూనె వేసుకుని, ఆ నూనెలో మీ ముఖాన్ని చూడాలి. ఆ తర్వాత ఆ నూనెను ఎవరికైనా దానం చేయాలి. ఈ పరిహారం పాటించడం వల్ల శని దేవుడు కలిగించే కష్టాల నుంచి త్వరగా విముక్తి పొందొచ్చని... శని భగవానుడి ఆశీస్సులు కూడా లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఒక్క శని సాయంతి రోజున మాత్రమే కాకుండా అంతే కాదు శనివారాల్లోనూ, నిత్యం శని దేవుడిని ఆరాధించడం వల్ల మనిషి జీవితంలో పురోభివృద్ధి పథంలో పయనిస్తాడని చెబుతారు. శని దేవుడు మంచి పనులు చేసేవారికి ఆశించిన ఫలితాలను ఇస్తాడని, చెడు పనులు చేసేవారిని శిక్షిస్తాడని గ్రంథాలలో చెప్పి ఉంది. ఈ కారణంగా ఆయన్ని న్యాయ దేవుడు అని పిలుస్తారు. మీరు కూడా శని దేవుడి అనుగ్రహాన్ని పొందాలనుకుంటే, శని దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలను క్రమం తప్పకుండా జపించండి.
శని మంత్రం (Shani mantra)
“నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం.
ఛాయామార్తండ్ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ॥”