మే నెలలో ఒకేసారి విడుదల కానున్న సినిమాలు : Movies to be Released in the Month of May 2024

ప్రతి నెలలోనూ కొత్త సినిమాలు విడుదల అవుతాయి. అందులో కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయితే మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి.

మే నెలలో ఒకేసారి విడుదల  కానున్న సినిమాలు : Movies to be Released in the Month of May 2024

మే నెలలో ఒకేసారి విడుదల కానున్న సినిమాలు : Movies to be released in the month of May

ప్రతి నెలలోనూ కొత్త సినిమాలు విడుదల అవుతాయి. అందులో కొన్ని సినిమాలు సూపర్ హిట్  అయితే మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. సినిమాలో సరైన కంటెంట్ ఉంటే, హీరో ఎవరనేది ప్రేక్షకులు చూడరు. ఇక ఈ నెల 31 న అధిక సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. ఈ రోజున ఏకంగా ఆరు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఏయే సినిమాలు ఈ తేదీన విడుదల అవుతాయో ఒకసారి తెలుసుకుందాం..

హరోంహర : Harom Hara 

సుధీర్ బాబు హీరోగా ‘సెహరి’ ఫేమ్ ద్వారక జ్ఞానసాగర్ దర్శకుడిగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. సుమంత్ జి నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సుధీర్ బాబు కి మాళవిక శర్మ హీరోయిన్‌. సునీల్, అక్షర గౌడ చిత్రంలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. మే 31న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘హరోంహర’ (Harom Hara). ‘ది రివోల్ట్‌’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వ‌హిస్తుండ‌గా, మాళవికా శర్మ కథానాయికగా నటిస్తోంది. సుమంత్‌ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా రానుంది. ఈ మూవీలో మాళవిక, సునీల్ ర‌వి కాలే, కేజీఎఫ్ ఫేమ్ ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్, అర్జున్ గోవిందా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. 

సత్యభామ : Satyabhama 

అందం, అభినయంతో కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది టాలీవుడ్ కలువ కళ్ల భామ కాజల్‌ అగర్వాల్‌. ఈ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సుమన్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ లో నటిస్తున్నట్లు  ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా రానున్న ఈ చిత్రానికి ‘సత్యభామ’ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఒక పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తోంది. ఈ సినిమా కూడా మే 31న విడుదల కాబోతోంది.  సత్యభామ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్‌ గ్లింప్స్ నెట్టింట చక్కర్లు కొడుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. మేకర్స్‌ ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం కల్లారా సాంగ్‌ను లాంఛ్ చేశారు. నవీన్‌చంద్ర, కాజల్ జర్నీతో సాగే ఈ పాటను శ్రేయాఘోషల్ పాడింది. శ్రేయాఘోషల్ మృదువైన వాయిస్‌తో సాగే ఈ పాట మ్యూజిక్‌ లవర్స్‌ను ఇంప్రెస్‌ చేయడం పక్కా అని తెలిసిపోతుంది. క్రైం థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని సుమన్ చిక్కాలా డైరెక్ట్ చేస్తున్నాడు.

భజే వాయువేగం : Bhaje vaayu vegam 

హీరో కార్తికేయ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నాడు. గత ఏడాది బెదురులంక చిత్రంతో హిట్ అందుకున్నాడు ఈ హీరో. ఇక ఇప్పుడు “భజే వాయువేగం” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. "భజే వాయు వేగం"చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినీ ప్రేక్షకులకు ఈ సినిమా పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా కూడా మే 31 న విడుదల కానుంది. ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో "భజే వాయు వేగం" సినిమా రూపొందించినట్లు టీజర్ చూస్తే అర్ధమవుతోంది.

గం గం గణేశ : Gum Gum Ganesha 

నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి దర్శకత్వంలో నటుడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న చిత్రానికి ’గం గం గణేశ’ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా పాటను  ఇటీవలే విడుదల చేశారు. ఇక ఈ చిత్రాన్ని మే 31 న విడుదల చేసేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. “గం..గం..గణేశా” సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న"గం..గం..గణేశా" సినిమా టీజర్ అభిమానులను అలరిస్తోంది. ‘బేబీ’ సినిమాతో ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ఈ కొత్త సినిమా “గం..గం..గణేశా”. ఇప్పటిదాకా చేయని యాక్షన్ జానర్ లో ఆనంద్ ఈ సినిమా చేస్తున్నాడు. 

మ్యూజిక్ షాప్ మూర్తి : Music shop Murthy 

అజయ్ ఘోష్, ప్రముఖ హీరోయిన్ చాందిని తండ్రీ కూతుళ్లుగా నటించిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి. తెలుగు నటుడు అజయ్ ఘోష్ విలన్ గానూ, కామెడీ పాత్రల్లో ప్రేక్షకులని అలరించిన నటుడు ఇప్పుడు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం మే 31 న రిలీజ్ కానుంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించగా, శివ పాలడుగు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలను ఇందులో చూపించనున్నట్లు తెలుస్తోంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి : Gangs of Godavari 

విశ్వక్‌సేన్, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రం మళ్ళీ వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. మే 17 న విడుదల కావలసిన ఈ చిత్రం మళ్ళీ వాయిదా పడింది. ఇప్పుడు మే 31 న రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అంజలి మరో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు.