విడుదలైన 'రావణాసుర' ట్రైలర్ : 'Ravanasura' trailer released

‘మర్డర్‌ చేయడం క్రైమ్‌, దొరక్కుండా చేయడం ఆర్ట్‌… ఐ యామ్‌ యాన్ ఆర్టిస్ట్‌’ అంటూ రవితేజ 'రావణాసుర' ట్రైలర్ లో పలికిన డైలాగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి

విడుదలైన 'రావణాసుర' ట్రైలర్ : 'Ravanasura' trailer released

విడుదలైన 'రావణాసుర' ట్రైలర్ : 'Ravanasura' trailer released

మర్డర్చేయడం క్రైమ్‌, దొరక్కుండా చేయడం ఆర్ట్‌… యామ్యాన్ ఆర్టిస్ట్‌’ అంటూ రవితేజ 'రావణాసుర' ట్రైలర్ లో పలికిన డైలాగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి

మాస్ మహారాజాగా పేరొందిన రవితేజ (hero raviteja) వరుస హిట్లతో దూసుకు వెళుతున్నాడు. హిట్లు, ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లడం రవితేజ నైజం. గత ఏడాది చివర్లో 'ధమాకా'తో (Dhamaka) బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూలు చేసాడు. హీరో చిరంజీవితో కలిసి ఏడాది 'వాల్తేర్ వీరయ్య'లో ఒక శక్తివంతమైన పాత్ర (powerful role) పోషించి సినిమా విజయానికి తోడ్పడ్డాడు.

తాజాగా ఆయన నటిస్తున్న 'రావణాసుర' (Ravanasura) చిత్రం ట్రైలర్ (Trailer) టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ (creating sensation) చేస్తోంది. సినిమాను యాక్షన్ థ్రిల్లర్ గా (action thriller) రూపొందిస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ (Trailer) అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను (hopes) పెంచేసింది. ఇక సినిమాలోని పాటలు సైతం హిట్ టాక్ (songs also hit) తెచ్చుకున్నాయి. 'రావణాసుర' సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం (Director Sudheer Verma) వహించాడు. ఇప్పుడు విడుదల చేసిన సినిమా ట్రైలర్ (Trailer) అభిమానులకు 'కిక్' ఎక్కిస్తోంది. పోస్టర్లు కూడా సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.

 

ట్రైలర్ లో పోలీస్ డిపార్ట్మెంట్‌ (police department) ఒక క్రిమినల్ కోసం చేసే వేటగా చూపించారు. టీజర్ లో రవితేజను రెండు యాంగిల్స్ (two shades) లో చూపించారు. ఒకటి యాక్షన్ యాంగిల్ (action angle) కాగా, రెండోది రవితేజ మార్క్ కామెడీ పాత్ర (comedy character) కనిపిస్తుంది. వైపు వైల్డ్ క్యారెక్టర్‌, మరోవైపు సాఫ్ట్క్యారెక్టర్లో రవితేజ ఒదిగిపోయాడనే చెప్పవచ్చు. రవితేజతో పాటు అక్కినేని సుశాంత్ (Sushant) కూడా సినిమాలో నటిస్తున్నాడు. సుశాంత్ కూడా ఒక మంచి పాత్రే దక్కింది. ముఖ్యంగా సినిమాకి హర్షవర్ధన్‌ (harshavardhan) అందించిన బ్యాక్గ్రౌండ్మ్యూజిక్ స్కోర్‌ (background music) ట్రైలర్ను ఎక్కడితో తీసుకెళ్లిపోయింది. టీజర్ లో రవితేజ చెప్పినమర్డర్చేయడం క్రైమ్‌, దొరక్కుండా చేయడం ఆర్ట్‌… యామ్యాన్ ఆర్టిస్ట్‌’ అనే డైలాగ్స్ (dialogues) ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మాస్ ప్రేక్షకులతో పాటుగా క్లాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేలా ట్రైలర్ ను రూపొందించారు. ఇది అందరినీ కనెక్ట్ కావడంలో మూవీ మేకర్స్ (movie makers) సఫలమయ్యారనే చెప్పవచ్చు. సినిమా ట్రైలర్ లో రవితేజ లాయర్ పాత్ర (Lawyer role) పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ సినిమాపై విశేషమైన ఎక్కడలేని హైప్ను క్రియేట్చేసింది. సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు (technical crew) ఎవరనేది ఒకసారి పరిశీలిద్దాం. సినిమాను ఏప్రిల్ 7 తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాను రూ. 50 కోట్ల బడ్జెట్ (50 crore rupees budget) తో నిర్మించినట్లు తెలుస్తోంది.

నటీనటులు : Film Crew

హీరో (Hero) : రవితేజ

హీరోయిన్లు (heroines) : అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, దక్ష నాగార్కర్

కీలక పాత్రల్లో (Lead Roles) : సుశాంత్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా

నిర్మాతలు (Producers) : అభిషేక్ నామా, రవితేజ (Abhishek Nama, Ravitejs)

కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ (Story, Screen Play, Dialogues) : శ్రీకాంత్ వీసా

దర్శకత్వం (Direction) : సుధీర్ వర్మ

సంగీతం (Music) : హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ (Cinematography) : విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్ శ్రీకాంత్

ఎడిటింగ్ (editing) : నవీన్ నూలి

బ్యానర్స్ (Banners) : అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్

విడుదల తేదీ (Release Date) : 2023 ఏప్రిల్ 7 (2023 April 7)

 

రవితేజ గురించి కొన్ని విషయాలు : About Raviteja

ఎటువంటి బ్యాగ్రౌండ్ (Without background) లేకుండా స్వయంకృషితో ఎదిగిన అతి కొద్ది మంది హీరోల్లో ఒకరు మాస్ మహారాజాగా పిలువబడే రవితేజ. 1968 జనవరి 26 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించారు. రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు (Original Name is : Bhupatiraju Ravishankar Raju). భార్య కల్యాణి (Wife Kalyani), మహాధన్ అనే కుమారుడు (Son Mahadhan), మోక్షద అనే కూతురు (Daughter Mokshada) ఉన్నారు. ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రల్లో నటించారు రవితేజ. 1997లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'సింధూరం' సినిమాలో రెండో హీరోగా నటించారు. 'నీకోసం' సినిమాతో హీరోగా మారాడు.

 

'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం' 'ఇడియట్' 'అమ్మ నాన్న తమిళమ్మాయి' 'నేనింతే' చిత్రాలు  రవితేజను స్టార్ హీరోగా నిలబెట్టాయి. చిత్రాలన్నీ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెసినవే కావడం విశేషం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'విక్రమార్కుడు' (Vikramarkudu) ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. అన్ని భాషల్లోనూ చిత్రం అఖండ విజయం సాధించింది. రవితేజ నటనా విశ్వరూపాన్ని సినిమా చూపించింది. ఇందులోని జింతాతా జితా జితా జింతాతతా అనే పాట అన్ని భాషల్లోనూ ఇప్పటికీ అందరి నోళ్ళల్లోనూ నానుతోంది. ఇవే కాకుండా 'డాన్ శీను' (Don Srinu), 'మిరపకాయ్', 'బలుపు' 'పవర్' 'రాజా ది గ్రేట్' (Raja the great) వంటి చిత్రాలు రవితేజకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవల చిరంజీవితో 'వాల్తేర్ వీరయ్య'లో నటించారు. అంతకుముందు ప్రేక్షకులకు 'క్రాక్' తెప్పించారు. ఇప్పుడు తాజాగా ఏప్రిల్ లో విడుదల కానున్న 'రావణాసుర' అఖండ విజయాన్ని (Super hit) అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. టీజర్ లో రవితేజ స్టైల్ (Style) కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.