పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్ విడుదల : Pushpa 2 Concept teaser released

పుష్పరాజ్‌ ఎక్కడ?... ‘వేర్‌ ఈజ్‌ పుష్ప?’ (where is Pushpa) అంటూ రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చకు ఫుల్‌స్టాప్‌ పడింది. ‘పుష్పరాజ్‌ ఏమయ్యాడు?’

పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్ విడుదల : Pushpa 2 Concept teaser released

పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్ విడుదల : Pushpa 2 Concept teaser released

పుష్పరాజ్ఎక్కడ?... ‘వేర్ఈజ్పుష్ప?’ (where is Pushpa) అంటూ రెండు మూడు రోజులుగా సోషల్మీడియాలో జరుగుతున్న చర్చకు ఫుల్స్టాప్పడింది. ‘పుష్పరాజ్ఏమయ్యాడు?’

 

‘అడవిలో జంతువులు రెండడుగు వెనక్కి వేసినాయంటే పులి వచ్చినాదని అర్థం... అదే పులే రెండడుగులు వెనక్కి వేసిందంటేపుష్పవచ్చినాడని అర్థం (Pushpa the rule). ఇది పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్ (Pushpa 2 Concept teaser) లోని డైలాగ్. దాదాపు మూడు నిమిషాలకు పైగా ఉన్న వీడియోలోని డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. విజువల్స్, చిత్రీకరణ అసాధారణంగా (extraordinary) గా ఉంది. సోషల్మీడియాలో ప్రస్తుతం డైలాగ్ విపరీతమైన ట్రెండ్ లో (dialog in trend) ఉంది.

 

పుష్పరాజ్ఎక్కడ?... ‘వేర్ఈజ్పుష్ప?’ (where is pushpa) అంటూ కొన్ని రోజులుగా జరుగుతున్నా చర్చకు పుష్ప 2 (Pushpa 2) చిత్రం మేకర్స్ శనివారం 8 తేదీన బన్నీ పుట్టినరోజు (Bunny birthday on 8th April) సందర్భాన్ని పురస్కరించుకుని మూడు నిమిషాలకు పైగా ఉన్న ఒక టీజర్ (teaser) విడుదల చేసారు. టీజర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. టీజర్ లో ఉన్న కంటెంట్ ని ఒకసారి గమనిస్తే...

‘తిరుపతి జైల్నుంచి బులెట్గాయాలతో తప్పించుకున్న పుష్ప’...

 

ప్రయత్నంలో పోలీసులు పది రౌండ్లల కాల్పులు జరపగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

 

శేషాచలం అడవుల్లో పుష్ప జాడ కోసం మొదలైన కూంబింగ్ఆపరేషన్‌…

 

పుష్ప మరణించాడా... బతికే ఉన్నాడా?

 

నెల రోజులు అయినా చల్లారని అల్లర్లు... పలు చోట్ట కొనసాగుతున్న 144 సెక్షన్లు

పుష్ప అసలు బతికే లేడని కొందరు అంటుంటే... అతను జపాన్‌, మలేషియా, చైనాలో ఉన్నాడని కొందరు అంటున్నారు

 

బాక్రాపేట కొండపై ఎనిమిది బుల్లెట్రంధ్రాలు, రక్తపు మరకలతో పుష్ప దుస్తులు కనుగొన్న సెర్చ్టీమ్‌... అంటూ న్యూన్ఛానళ్లలో వార్తలు...

 

మరోవైపు అతని మద్దతుదారులు తిరుగుబాటు

 

పుష్ప ఏం చేసి దుడ్డు సంపాదిస్తున్నాడో చెప్తాండారు కానీసంపాదించిన దుడ్డు ఏం చేస్తాండాడో చెప్తాండారా? అంటూ వ్యాపారి ప్రశ్న...

 

నా కొడుక్కి గుండె ఆపరేషన్అంటే పుష్పనే దుడ్డు పంపించినాడప్ప... అంటూ తల్లి కృతజ్ఞత..

 

నా బిడ్డ పెండ్లికి పుష్పనే డబ్బు సర్దుబాటు చేశాడు... అని తండ్రి కృతజ్ఞత..

మాలాంటోళ్లకి కూడు పెడతాండు... ఇది పుష్ప గురించి సామాన్యుల మాట. ఇలా ఎన్నో ప్రశ్నలు, పరంపలు.

 

ఇది కట్చేస్తే... అడవిఅక్కడో పులి నడుచుకుంటూ వస్తుంటుంది...

 

మనిషిని చూసి రెండు అడుగులు వెనక్కి తగ్గుతుంది పులి. అప్పుడు వినిపిస్తాయి డైకగులు ...

 

అడవిలో జంతువులు రెండడుగు వెనక్కి వేసినాయంటే పులి వచ్చినాదని అర్థం...

 

అదే పులి రెండడుగులు వెనక్కి వేసిందంటేపుష్పవచ్చినాడని అర్థం’ ... ఎదురుగా మెరిసే కళ్లతో ముసుగులో మనిషి... అతన్ని చూసి రెండు అడుగులు వెనక్కి తగ్గుతుందా పులి. ఇది పుష్ఫగాడి రూల్‌…

అంటూ తనదైన మేనరిజంతో కుర్చీలో కూర్చున్న అల్లు అర్జున్‌.  ఇది టీజర్లో ఉన్న కంటెంట్.

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా సుకుమార్దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని. మైత్రీ మూవీ మేకర్స్సంస్థ నిర్మిస్తోంది. పుష్ప చిత్రానికి కొనసాగింపుగా పుష్ప 2 (Pushpa 2) ప్యాన్ఇండియా స్థాయిలో విదలవబోతోంది. శరవేగంగా చిత్రం షూటింగ్ జరుగుతోంది. పుష్ప మొదటి భాగం కూడా పాన్ ఇండియాలో విడుదలై అందరినీ విశేషంగా అలరించింది. ఇప్పుడు అందరి నోళ్ళల్లోనూ పుష్ప 2 (Pushpa 2) పేరే నానుతోంది.

 

నటీనటులు (Actors) : రష్మిక మందన్నా, ఫహద్ఫాజిల్‌, సునీల్, అనసూయ

దర్శకత్వం (Director) : సుకుమార్

మ్యూజిక్డైరెక్టర్‌ (Music Director) : దేవిశ్రీ ప్రసాద్

బ్యానర్ (Banner) : మైత్రీ మూవీ మేకర్స్