'రావణాసుర'గా రవితేజ : Ravi Teja as 'Ravanasura'

మాస్ మహారాజా రవితేజ (Hero Raviteja) నటిస్తున్న నూతన చిత్రం 'రావణాసుర' (Movie : Ravanasura). యాక్షన్ డ్రామా (Action Drama) మూవీగా వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రంలో హీరో రవితేజ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం టీజర్ (Teaser) అభిమానులను అలరింపజేస్తోంది.

'రావణాసుర'గా రవితేజ : Ravi Teja as 'Ravanasura'

'రావణాసుర'గా రవితేజ : Ravi Teja as 'Ravanasura'

మాస్ మహారాజా రవితేజ (Hero Raviteja) నటిస్తున్న నూతన చిత్రం 'రావణాసుర' (Movie : Ravanasura). యాక్షన్ డ్రామా (Action Drama) మూవీగా వేసవిలో విడుదల కానున్న చిత్రంలో హీరో రవితేజ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన చిత్రం టీజర్ (Teaser) అభిమానులను అలరింపజేస్తోంది. ఒక కీలక పాత్రలో కాళిదాసు సినిమాలో నటించిన హీరో సుశాంత్ (నాగార్జున మేనల్లుడు) నటిస్తున్నాడు. సినిమా షూటింగ్ పూర్తి కావడంతో చిత్రం యూనిట్ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. 2023 ఏప్రిల్ 7 (2023 April 7) తేదీన సినిమా ప్రపంచ వ్యాప్తంగా (Worldwide) థియేటర్లలో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకాన్ని చిత్ర యూనిట్ వ్యక్త పరిచింది. చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొత్తం ఐదుగురు హీరోయిన్లు చిత్రంలో నటిస్తుండడం విశేషం.

 

టీజర్ ను ఆవిష్కరించిన రవితేజ : Teaser Released by Raviteja

ఏడాది జనవరి 26 తేదీ నాటికి 55 ఏళ్ళు (55 years) పూర్తి చేసుకున్నారు హీరో రవితేజ (Hero Raviteja). సందర్భంగా 'రావణాసుర' సినిమా టీజర్ (Teaser) ను ఆయన స్వయంగా ఆవిష్కరించారు. 46 సెకన్ల టీజర్ అభిమానుల్లో హైప్ తీసుకొచ్చింది. రవితేజ డిసెంబర్ 23, 2022 విడుదలైన 'ధమాకా' మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు యాక్షన్-థ్రిల్లర్ (Action-Thriller) 'రావణాసుర'తో వస్తున్నాడు. టీజర్ ను వీక్షించిన అభిమానులు చిత్రం అఖండ విజయం సాధించాలని సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

నటీనటులు : Film Crew

హీరో (Hero) : రవితేజ

హీరోయిన్లు (heroines) : అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, దక్ష నాగార్కర్

కీలక పాత్రల్లో (Lead Roles) : సుశాంత్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా

నిర్మాత (Producer) : అభిషేక్ నామా

కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ (Story, Screen Play, Dialogues) : శ్రీకాంత్ వీసా

దర్శకత్వం (Direction) : సుధీర్ వర్మ

సంగీతం (Music) : హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ (Cinematography) : విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్ శ్రీకాంత్

బ్యానర్స్ (Banners) : అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్

 

విడుదల తేదీ (Release Date) : 2023 ఏప్రిల్ 7 (2023 April 7)

రవితేజ గురించి కొన్ని విషయాలు : Few things about Ravi Teja

ఎటువంటి బ్యాగ్రౌండ్ (Without background) లేకుండా స్వయంకృషితో ఎదిగిన అతి కొద్ది మంది హీరోల్లో ఒకరు మాస్ మహారాజాగా పిలువబడే రవితేజ. 1968 జనవరి 26 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించారు. రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు (real Name is : Bhupatiraju Ravishankar Raju). భార్య కల్యాణి (Wife Kalyani), మహాధన్ అనే కుమారుడు (Son Mahadhan), మోక్షద అనే కూతురు (Daughter Mokshada) ఉన్నారు. ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రల్లో నటించారు రవితేజ. 1997లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన  'సింధూరం' సినిమాలో సెకండ్ హీరోగా నటించారు. 'నీకోసం' సినిమాతో హీరోగా మారాడు.

 

'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం' 'ఇడియట్' 'అమ్మ నాన్న తమిళమ్మాయి' 'నేనింతే' చిత్రాలు  రవితేజను స్టార్ హీరోగా నిలబెట్టాయి. చిత్రాలన్నీ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెసినవే కావడం విశేషం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'విక్రమార్కుడు' (Vikramarkudu) ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. అన్ని భాషల్లోనూ చిత్రం అఖండ విజయం సాధించింది. రవితేజ నటనా విశ్వరూపాన్ని సినిమా చూపించింది. ఇందులోని జింతాతా జితా జితా జింతాతతా అనే పాట అన్ని భాషల్లోనూ ఇప్పటికీ అందరి నోళ్ళల్లోనూ నానుతోంది. ఇవే కాకుండా 'డాన్ శీను' 'మిరపకాయ్' 'బలుపు' 'పవర్' 'రాజా ది గ్రేట్' వంటి చిత్రాలు రవితేజకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవల చిరంజీవితో 'వాల్తేర్ వీరయ్య'లో నటించారు. అంతకుముందు ప్రేక్షకులకు 'క్రాక్' తెప్పించారు. ఇప్పుడు తాజాగా ఏప్రిల్ లో విడుదల కానున్న 'రావణాసుర' అఖండ విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. టీజర్ లో రవితేజ స్టైల్ (Style) కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.