Top Gear Film Review : ‘టాప్ గేర్’లో కూడా స్లోగానే నడిచింది
యువ కథానాయకుడు (hero) ఆది సాయి కుమార్ (Aadi Saikumar) క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటించిన చిత్రమే ‘టాప్ గేర్’ (Top gear). థ్రిల్లర్ సినిమాగా చిత్రం యొక్క ప్రమోషన్స్ చెబుతున్నాయి. గత ఏడాదిలో (2022) ఆది నటించిన చిత్రాల్లో ఇది మూడో చిత్రం. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన ఎన్. శశికాంత్ (Shashikanth) కి ఇదే మొదటి చిత్రం. ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి సమీక్షిద్దాం (Review).
Top Gear Film Review: ‘టాప్ గేర్’లో కూడా స్లోగానే నడిచింది
నటీనటులు: ఆది సాయికుమార్, రియా సుమన్, మైమ్ గోపి, శత్రు, బ్రహ్మాజీ, మిర్చి హేమంత్, సత్యం రాజేష్ తదితరులు
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్
కథ, మాటలు, దర్శకత్వం: ఎన్.శశికాంత్
నిర్మాత: కె. శ్రీధర్ రెడ్డి
ప్రొడక్షన్ : ఆదిత్య మ్యూజిక్, శ్రీ ధనలక్ష్మి క్రియేషన్స్
యువ కథానాయకుడు (hero) ఆది సాయి కుమార్ (Aadi Saikumar) క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటించిన చిత్రమే ‘టాప్ గేర్’ (Top gear). థ్రిల్లర్ సినిమాగా చిత్రం యొక్క ప్రమోషన్స్ చెబుతున్నాయి. గత ఏడాదిలో (2022) ఆది నటించిన చిత్రాల్లో ఇది మూడో చిత్రం. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన ఎన్. శశికాంత్ (Shashikanth) కి ఇదే మొదటి చిత్రం. ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి సమీక్షిద్దాం (Review).
‘టాప్ గేర్’ కథ : Top Gear story
అర్జున్ (ఆది సాయికుమార్) హైదరాబాద్‌లో ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్ మరియు అతనికి భార్య ఆద్య (రియా సుమన్ Riya Suman) అంటే ఎంతో ఇష్టం. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా, సంతోషంగా ఉంటూ వుంటారు. హైదరాబాద్ పోలీసులు డ్రగ్ సప్లయి చేసే క్రిమినల్ సిద్ధార్థ్ (మైమ్ గోపి Mime Gopi) కోసం వెతుకుతూ ఉంటారు. సిద్దార్ధ్ వందల కోట్ల విలువైన డ్రగ్స్‌తో దేశం వదిలి పారిపోవాలని ఒక ప్లాన్ వేసుకుంటాడు. అందుకోసం తన అనుచరులను పురమాయిస్తాడు కూడా. అయితే అతని ప్లాన్ అనుకోకుండా గాడి తప్పుతుంది. అతని అనుచరులు ఇద్దరు బ్రహ్మాజీ (బ్రహ్మాజీ Brahmaji), రాజేష్ (రాజేష్ Rajesh) డ్రగ్స్ వున్న బ్యాగ్ పట్టుకుని అర్జున్ క్యాబ్ ఎక్కుతారు. అనుకోకుండా ఆ ఇద్దరి మధ్య జరిగిన గొడవలో బ్రహ్మాజీ మరణిస్తాడు. రాజేష్ అర్జున్‌ని బెదిరించి క్యాబ్ ని సిద్ధార్థ్ దగ్గరికి కాకుండా వేరే దగ్గరికి తీసుకెళ్ళమంటాడు. రాజేష్ అర్జున్ నడుపుతున్న క్యాబ్ (cab) ని ఎక్కడికి తీసుకెళ్లాడు? అక్కడ పరిస్థితి ఏమిటి? డ్రగ్స్ వున్న బ్యాగ్ సిద్ధార్థ్ కి అందిందా? తన భార్యను చంపేస్తాము అని విలన్స్ అంటే అర్జున్ ఎలా కాపాడుకున్నాడు? పోలీసులు ఏమి చేశారు? ఇవన్నీ తెలియాలంటే వెండితెర మీద ‘టాప్ గేర్’ సినిమాను చూడాల్సిందే. (Top Gear Movie Telugu Review)
సినిమా విశ్లేషణ : Movie Analysis
తన మొట్టమొదటి సినిమాకు ఓ మామూలు కథనే (normal story) దర్శకుడు శశికాంత్ ఎంచుకున్నాడు. ఈ కథలో అంత కొత్తదనం ఏమీ కనిపించలేదు. గతంలో విడుదలైన ‘అనుకోకుండా ఒకరోజు’ అనే సినిమాలో ఒక్క రోజులో ఏమి జరిగింది అనే కాన్సెప్ట్ ను చూపించారు. ఆ తరువాత అదే కాన్సెప్ట్ తో ‘మత్తు వదలరా, దొంగలున్నారు జాగ్రత్త’ వంటి చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇక్కడ దర్శకుడు శశికాంత్ ఒక క్యాబ్ డ్రైవర్‌ని (cab driver) తీసుకొని ఈ పాత్రకి డ్రగ్స్ మాఫియా, పోలీస్‌లను జతచేసి వీరి మధ్య ఒక రాత్రి వేళ ఏమి జరిగింది, క్యాబ్ డ్రైవర్ అర్జున్ ఎలా ఇబ్బంది పడ్డాడు, తిరిగి ఆ పరిస్థితి నుండి ఎలా బయటికి రాగలిగాడు అన్నది ముఖ్యమైన కథ. అయితే మంచి కాన్సెప్ట్ (good concepet) అయినప్పటికీ, దర్శకుడు దీనిపై మరి కొంచెం దృష్టి పెట్టినట్లయితే ఈ సినిమా ఒక థ్రిల్లర్ చిత్రంగా నిలిచి ఉండేది. కానీ కథలో అంత బలం లేకపోవడంతో ఒక మామూలు చిత్రంగా తయారయింది.
సినిమా మధ్యలో కొన్ని కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నా, దర్శకుడు సినిమా మొత్తం అంతే ఆసక్తికరంగా మలచలేకపోయాడు. క్యాబ్ లోకి డ్రగ్స్ వున్న బ్యాగ్‌తో బ్రహ్మాజీ, రాజేష్‌లు ఎక్కిన తరువాత కథ కొంచెం ఆసక్తి రేకెత్తిస్తుంది. కానీ అది కొంత సేపటి వరకే, కథ మళ్ళీ మామూలు అయిపోతుంది. సెకండ్ హాఫ్‌లో హైవే మీద కార్ ఛేజింగ్, అలాగే కారు అదే రోడ్డు మీద ప్రయాణం చేయడం లాంటివి ఎక్కువ ఉండటంతో అవి కొంచెం సాగదీత అయినట్టుగా వున్నాయి. అదీ కాకుండా, ఇందులో సన్నివేశాలు రాక మునుపే మనం ముందే తరువాత ఏమి జరుగుతుందో ఊహించేసుకోవచ్చు. సినిమా థ్రిలర్ అని పేర్కొన్నప్పటికీ అంత థ్రిల్లింగ్‌గా కూడా ఏమీ లేదు. కాకపోతే సినిమాలో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బాగున్నాయి.. అంతే. ఇందులో దర్శకుడు విలన్‌కి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చినట్టుగా కనపడింది.
ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ (thriller) సినిమాలకి బ్యాక్ గ్రౌండ్ సంగీతం (background music) చాలా ముఖ్యం. దీనికి సంగీత దర్శకుడు హర్షవర్థన్ రామేశ్వర్ సమకూర్చాడు, పరవాలేదు అనిపించాడు కూడా. సినిమాకి హైలైట్ మాత్రం సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ (cinematography). అతను రాత్రి ఎఫెక్ట్ ని బాగా చూపించటమే కాకుండా, కొన్ని సన్నివేశాల్లో కథకి తగ్గట్టుగా బాగా చూపించాడు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. (Top Gear Review)
ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఆది సాయికుమార్ క్యాబ్ డ్రైవర్ అర్జున్ పాత్రలో బాగా చేశాడు, తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక అర్జున్ భార్యగా ఆద్య పాత్రలో నటించిన (రియా సుమన్ Riya Suman) కి నటనకు ఆస్కారమున్న పాత్ర లభించలేదు. దీంతో ఆమె సినిమాలో నామమాత్రమే అయ్యింది. మైమ్ గోపి విలన్‌గా సిద్ధార్థ్ పాత్రలో బాగా చేశాడు.. ఇంకా చెప్పాలంటే, సినిమాలో అతని పాత్రే ఎక్కువ. అతనే ఒక సమయంలో ఈ చిత్రానికి లీడ్ యాక్టర్ అనేట్టుగా అతని పాత్ర వుంది. దర్శకుడు విలన్ పాత్ర పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా ఉంది. శత్రు మరొకసారి పోలీస్ (police) పాత్రలో నటించాడు, అతనికి ఇప్పుడు మంచి పాత్రలు వస్తున్నాయి. ఆ పాత్రలు బాగా చేస్తున్నాడు కూడా. బ్రహ్మాజీ, రాజేష్‌లు చిన్న పాత్రల్లో కనిపించినప్పటికీ, ఉన్నంతలోనే ఆ పాత్రల్లో మెరుస్తారు. ఇంకా చాలామంది సపోర్టివ్ రోల్స్‌లో కనపడతారు. ప్రతి ఒక్కరూ కూడా తమకు లభించిన పాత్రలకు న్యాయం చేశారనే చెప్పవచ్చు.
చివరిగా, ఈ ‘టాప్ గేర్’ సినిమా ఒక సాధారణ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అయితే దర్శకుడు కథ మీద కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కథలో బలం తగ్గడంతో ఇది ఒక మామూలు సినిమాలా నిలిచిపోయింది.